ఈమె తత్వం కాస్త వింతగా కనిపిస్తున్నది… సెలబ్రిటీలు అందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్ని వీలైనంత లైవ్‌గా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు జనాన్ని తమవైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు… పెద్ద పెద్దోళ్ల ఖాతాల్ని మెయింటెయిన్ చేయడానికి సోషల్ మీడియా టీమ్స్ ఉంటయ్… ఇండియన్ టాప్ సినిమా హీరోయిన్ దీపిక పడుకోన్ మాత్రం అందరికీ కొత్త సంవత్సరం వేళ షాక్ ఇచ్చింది… ఏమిటో తెలుసా..? తన సోషల్ మీడియా ఖాతాల్ని ఖాళీ చేసింది… అర్థం కాలేదు కదూ…
ప్రధానంగా సెలబ్రిటీలకు ఉండే సోషల్ మీడియా ఖాతాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్… దీపికకు ఇన్‌స్టాలో 5 కోట్ల పైబడి ఫాలోయర్స్ ఉన్నారు… అలాగే ట్విట్టర్లో 2.77 కోట్ల మంది ఫాలోయర్లున్నారు… ఇక తన ఫేస్బుక్ పేజీకి 3.37 కోట్ల లైకులున్నయ్… రాత్రికిరాత్రి మూడు ఖాతాలు ఖాళీగా దర్శనమిచ్చినయ్… అంటే మొత్తం పాత పోస్టులన్నీ ఎగిరిపోయినయ్…
Ads
అంటే… ఖాతాలు లైవ్… కానీ పాత పోస్టులన్నీ ఖతం… ఉదాహరణకు… ఆమె ఫేస్బుక్ పేజీలో కొత్త సంవత్సరం సందర్భంగా ఆమె ఓ ఆడియో శుభాకాంక్షల్ని పోస్ట్ చేసింది… అలాంటిదే ఓ ఫోటో పోస్టు… అంతే… ఇక ఆమె పాత ఫోటోలు, పోస్టులు మొత్తం మాయం… సేమ్, ట్విట్టర్, సేమ్, ఇన్‌స్టా… మరి అదేమిటి..? హ్యాక్ అయి ఉంటుందా…
అబ్బే, హ్యాక్ చేస్తే మొత్తం మూడూ ఒకేసారి చేయరు కదా, పైగా చేస్తే, అంత పెద్ద సెలబ్రిటీ ఖాతాలు దొరికితే ఏదో చెత్తా నింపుతారు కదా… అదేమీ లేదు… జస్ట్, ఆమె పాత మెమొరీ అంతా డిలిట్ చేసేసి, కొత్తగా 2021 నుంచి స్టార్ట్ చేయాలని అనుకున్నట్టుంది… అంతే… వాళ్ల టీం ఏదో టూల్ ఉపయోగించి, ఒకేసారి మొత్తం ఖాళీ చేసేసింది…
నిజానికి దీపిక లెవల్‌కు తన ఇన్‌స్టా ఖాతాలో ఒక్క కమర్షియల్ పోస్ట్ పెట్టినా లక్షలకులక్షల రెవిన్యూ వస్తుంది… ఆమె ఫాలోయర్లు, ఆమె క్రేజీ రేంజ్ అది… అలాంటిది జస్ట్, మూడు సోషల్ దుకాణాల్నీ ఖాళీ చేసి కూర్చున్నది దేనికో మరి… ఇంకేదైనా మార్కెటింగ్ కొత్త స్ట్రాటజీ కావచ్చునేమో…!!
Share this Article