Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఔనమ్మా… ఏవో కథలు ఉంటేనే కదా ఓ సినీ జంట విడిపోయేది…

May 14, 2024 by M S R

రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకులకు దరఖాస్తు చేసుకుని రెండేళ్లయిపోయింది… దాదాపు 18 సంవత్సరాల పెళ్లి బంధాన్ని తెంపేసుకున్నారు… ఈ రోజుల్లో విడాకులు పెద్ద విశేషం కాదు, కానీ సినీ సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే ఏ వ్యవహారమైనా జనాసక్తి కారణంగా ప్రముఖంగా వార్తల్లో నలుగుతుంది…

అంత పెద్ద హైఫై కుటుంబంతో తన బంధాన్ని ధనుష్ ఎందుకు తెంపుకోవాలనుకున్నాడు..? ఇది ఈరోజుకూ మిస్టరీయే… వాళ్లు ఒకరిపైనొకరు చిల్లర విమర్శలతో బురద జల్లుకోలేదు… మా ఇద్దరికీ పడటం లేదు, విడిపోతున్నాం అన్నట్టుగా హుందాగానే ఉంది జంట… చెన్నై ఫ్యామిలీ కోర్టులో 2022 జనవరిలోనే విడాకుల దరఖాస్తు ఇచ్చారు…

కానీ అలా కామ్‌గా ఉంటే అది కోలీవుడ్ ఎందుకు అవుతుంది..? పైగా చెన్నై ఇండస్ట్రీలో కంట్రవర్సీల్ని కావాలని కోరుకునే, పుట్టించే కేరక్టర్లు ఎక్కువ కదా… సింగర్ సుచిత్ర తెర మీదకు వచ్చింది… కొన్ని కామెంట్స్ చేసింది… ఇవిప్పుడు వైరల్ అయిపోయాయి… ఇంతకీ ఎవరీమె..? ఏమని చెబుతోంది..?

Ads

సింగర్ సుచిత్ర… గాయకురాలు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్టు, గీత రచయిత, స్వరకర్త, నటి, కథా రచయిత, బిగ్‌బాస్ ఫేమ్… వాట్ నాట్..? చిన్మయి తరహాలోనే..! 2016లో సుచీలీక్స్ పేరిట ఆమె సోషల్ అకౌంట్ నుంచి బోలెడు వీడియోలు, పోస్టులు ప్రసారమవుతూ పెద్ద వివాదం, రచ్చ బయల్దేరింది గుర్తుంది కదా… అదుగో ఆ సుచిత్రే…

ఆమె కుముదం అనే యూట్యూబ్ ఛానెల్‌కు (ఆమె కూడా ఓ పాపులర్ యూట్యూబ్ చానెల్ నడిపిస్తుంది…) ఇచ్చిన ఇంటర్వ్యూలో… ‘‘ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు ఇన్నేళ్లూ… వీళ్లు వేరే వ్యక్తులతో బార్లలో కూర్చుని మందు కొడతారు, డేటింగ్ వెళ్తారు, అది కరెక్టేనా..? పెళ్లయిన తరువాత ఎవరైనా వేరే వ్యక్తులతో డేటింగ్ చేస్తారా..?’’ అని చెప్పుకొచ్చింది…

‘‘ఐశ్వర్య బ్యాడ్ మదర్… ఈ విషయంలో ధనుష్ మంచి తండ్రి అని చెప్పొచ్చు… నిజానికి ఐశ్వర్య డబుల్ స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేసింది… ఇద్దరూ సిస్టమాటిక్‌గా పరస్పరం మోసం చేసుకున్న ఫలితమే విడాకులు’’ అని పేర్కొంది ఆమె…

మేం కలిసి ఉండటం లేదు, పరస్పర అంగీకారంతో విడిపోవడానికి నిర్ణయించుకున్నాం అని ఆ జంట చెప్పుకుందే తప్ప వీసమెత్తు విమర్శలు చేసుకోలేదు… బజారుకెక్కలేదు… ఎక్కడా ఎవరికీ ఈ విషయంలో ఇంటర్వ్యూలు లేవు, వ్యాఖ్యలు లేవు… నిజానికి ఇన్నేళ్లూ ఇండస్ట్రీలో ఇలా బహిరంగంగా ఎవరూ విమర్శలు కూడా చేయలేదు… మొదటిసారి సుచిత్ర బ్రేక్ చేసింది… అన్నట్టు… సుచిత్ర కూడా డైవర్సీయే… నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్‌తో 2005లో పెళ్లి కాగా, 2017 లో విడాకులు… కారణం అంటారా..?భర్త గే అట..!! 12 యేళ్లు పట్టిందట తెలియడానికి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ క్షణం ఒక యుగం! 𝐓𝐡𝐞𝐒𝐩𝐥𝐚𝐬𝐡𝐃𝐨𝐰𝐧… భూమి ఎదురుచూస్తోంది..!
  • రొట్టె- చక్కెర … వైరల్ వీడియోపై బోలెడు పోస్టులు… కానీ..?
  • రాజీనామా చేశాడట… బారా ఖూన్ మాఫ్… వాటీజ్ దిస్ మోడీ…
  • పిల్లి కళ్ల పిల్ల మోనాలిసా ప్రేమపెళ్లి కథలో ట్విస్ట్… మొగుడిపై పోక్సో…
  • రేపు పోలింగ్ అనగా… ఓ ఉపఎన్నిక రద్దు… ఓ చిత్రమైన కేసు…
  • కొత్త కొత్త నాయికలతో రాజేంద్ర ప్రసాద్ రొమాన్స్… ఈమె ఎవరో తెలుసా…
  • ధ్వజమెత్తిన సందీప్ వంగా… ‘ధురంధర్ 2’ విమర్శకులకు చెంపపెట్టు…!
  • గులాబీ బాస్ ‘మౌన’ ముద్ర… తమ్ముళ్లలోనూ అదే ‘నిద్ర’…!
  • అడివి శేషుకు దీటుగా… అక్కడక్కడా దాటేసి… మెప్పించిన మృణాల్…
  • ఐపీఎల్ 2026… పదునైన ఆట మాత్రమే కాదు… అనేక ఎమోషన్స్ కూడా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions