Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తేజస్ ఎందుకు పేలిపోయిందో తెలుసా..? ఇవీ కారణాలు..!! పార్ట్-2

November 24, 2025 by M S R

.
Pardha Saradhi Potluri ….. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ కూలిపోవడానికి కారణాలు ఏమిటో దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చే దాకా ఆగనవసరం లేదు.
ఇవిగో సాక్ష్యాలు! కారణాలు…

జెనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ లో కార్మికుల సమ్మె!
General Electric Aerospace కి చెందిన కార్మికుల సమ్మె!
GE ఏరో స్పేస్ కి చెందిన కార్మిక సంస్థ యునైటెడ్ ఆటో వర్కర్స్ ( UAW) లో సభ్యత్వం కలిగిన 600 కార్మికులు ఆగష్టు చివరి వారం నుండి సెప్టెంబర్ 15 వరకూ సమ్మె చేశారు. దాదాపుగా 22 రోజుల పాటు ప్రోడక్షన్ నిలిచిపోయింది GE ఏరో స్పేస్ లో!

సమ్మెకి కారణాలు:
కనీస వేతనాలు పెంచమని డిమాండ్, కానీ GE ఏరో స్పె్స్ వెంటనే ఒప్పుకోలేదు.
సమయానికి వేతనాలు చెల్లించాలనే డిమాండ్! అంటే GE ఏరో స్పేస్ తన కార్మికులకి సమయానికి వేతనాలు చెల్లించలేకపోతున్నది అనే కదా అర్ధం?
జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి అనే డిమాండ్! అంటే ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో అనే సమస్య ఉన్నట్లేగా?
కార్మికులకు హెల్త్ కేర్ కోసం నిధులు ఇవ్వాలి! ఓహ్! అగ్ర రాజ్యంలో కార్మికులకి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భీమా అదీ ఉచితంగా లేవన్న మాట!

Ads

GE ఏరో స్పేస్ లో కార్మికుల సమ్మె వల్ల ఎఫెక్ట్ అయినవి ఏమిటీ?
ఇవండాలె, ఓహియో ( EVANDALE, OHIO) లలోని ప్లాంట్స్!
ఎర్లాంగర్, కేంటకీ ( Erlander, Kentucky) లలోని డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీలు.

22 రోజుల సమ్మె ఎలా విరమణ అయ్యింది?
కనీస వేతనాలని పెంచడానికి ఒప్పుకుంది యాజమాన్యం.
హెల్త్ కేర్ కోసం బీమా కాకుండా అదనపు కాష్ పేమెంట్ ఇస్తాను అని వ్రాత పూర్వక అగ్రిమెంట్ మీద GE ఏరో స్పేస్ యాజమాన్యం సంతకం పెట్టిన తరువాత సమ్మె విరమించారు!
GE ఏరో స్పేస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ 22 రోజుల పాటు కనీస వేతనాల కోసం చేసిన సమ్మెని చూస్తూ ఉండిపోయింది అంటే GE ఏరో స్పేస్ నష్టాలలో ఉన్నదనేగా అర్ధం?

చైనా కొట్టిన దెబ్బ!
రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతుల మీద చైనా నిషేధం విధించి ఆరు నెలలు అవుతున్నది!
ఈ  నిషేధం విధించే సమయానికి అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ దగ్గర మూడు నెలలకి సరిపడా మాత్రమే రేర్ ఎర్త్ మినరల్స్ స్టాక్ ఉన్నాయి.
చైనాకీ తెలుసు అమెరికన్ ఆయుధ సంస్థల నుండి ఎప్పుడు ఆర్డర్ వస్తుందో అని. ఖచ్చితంగా టైమ్ చూసి నిషేధం విధించింది!

చైనా విధించిన నిషేధం అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ కి చావు దెబ్బ! ఎందుకంటే రా మెటీరియల్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, భారత్, ఆఫ్రికాలలో ఉన్నాయి. కానీ వాటిని వెలికితీసి చైనాకి పంపించాల్సిందే ప్రాసెస్ కోసం!

ప్రపంచంలోని అన్ని దేశాలకి 80% రేర్ ఎర్త్ మినరల్స్ ని ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తున్నది చైనా మాత్రమే!
మిసైల్స్, రాడార్, జెట్ ఇంజన్లలో రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం ఉంటుంది. GE, బోయింగ్, ప్రాట్ & విట్నీ, రోల్స్ రాయిస్, రేథియాన్, లాక్ హీడ్ మార్టిన్ లాంటి సంస్థలు రేర్ ఎర్త్ మినరల్స్ కొరతని ఎదుర్కుంటున్నాయి!

ఇప్పటికే వాడుకలో ఉన్న వాటి కోసం స్పేర్ పార్ట్స్ సప్లై చేయాల్సి ఉండగా, అర కొరగా, అదీ విపరీతమైన జాప్యంతో సప్లై చేస్తున్నది GE.
అమెరికన్ ఆయుధ సంస్థలని నమ్మడానికి వీల్లేదు!

స్పేర్ పార్ట్స్ తయారీలో నిర్దేశిత రేర్ ఎర్త్ మినరల్స్ కలిపి తయారు చేయాల్సి ఉంటుంది… కానీ కొరత వల్ల ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన వాటిలో ప్రమాణాలు పాటించక ఎగుమతి చేస్తే తేజస్ లు ఇలానే కూలిపోతాయి!

మొదటి తేజస్ 2001 లో గాల్లోకి ఎగిరిన తరువాత 2019 కల్లా పూర్తి స్థాయిలో IAF ఆపరేషన్ లోకి వస్తుందని అనుకున్నాం నాలాంటి వాళ్ళం!
2025 వచ్చినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో తేజస్ లు IAF లో చేరలేక పోయాయి!

BOSS IS ALWAYS RIGHT!
CUSTOMER is ALWAYS RIGHT!
ఇక్కడ బాస్ భారత ప్రభుత్వం! వినియోగదారుడు IAF!
మధ్యలో నలిగి చస్తున్నది HAL!
అఫ్కోర్స్! మన దేశంలో ఉన్నంత రెడ్ టేపిజం మరే దేశంలోనూ ఉండదేమో!

1990 లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయ్యాక సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న రిపబ్లిక్ స్టేట్స్ లో ఉన్న చాలా మంది ఏరో స్పేస్ ఇంజనీర్లకి పని లేకుండా పోయింది! చాలా మంది భారత్ వైపు చూశారు. అప్పటికి మన తేజస్ ప్రాజెక్ట్ టేబుల్ మీద డిజైన్ వరకే పరిమితం అయి ఉంది.

భారత్ లో స్థిరపడి తేజస్ ప్రాజెక్ట్ కోసం R&D లో పనిచేయడానికి ఉత్సాహం చూపించారు మాజీ సోవియట్ రిపబ్లిక్స్‌కు చెందిన ఏరో స్పేస్ ఇంజినీర్లు! కానీ మన దేశంలో ఉన్న రెడ్ టేపిజం గురించి విని ఒక్కడంటే ఒక్క సోవియట్ ఏరో స్పేస్ ఇంజినీర్ భారత్ కి రాలేదు! చాలా వరకూ చైనా వెళ్లిపోయారు. కొందరు అమెరికా వెళ్లి స్థిరపడి అక్కడ డిఫెన్స్ ఇండస్ట్రీ లో పనిచేసి రిటైర్ అయ్యారు!

అసలు అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీ అభివృద్ధికి మూల కారకులు జెర్మన్ యూదు సైంటిస్టులు! రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ యూదులని చంపుతున్నతరుణంలో జెర్మనీ నుండి పారిపోయి, మొదట ఇంగ్లాండ్ చేరుకొని, తరువాత అమెరికాకి వలసవెళ్లి, అక్కడి అభివృద్ధికి కారకులు అయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి అమెరికా అభివృద్ధి చెందిన దేశమే, కానీ యుద్ధం తరువాత అమెరికాని అగ్ర రాజ్యంగా నిలపడంలో యూదులదే ప్రధాన పాత్ర!

ప్రస్తుత అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ ని శాసిస్తున్నది యూదులే!
మనం కనీసం రష్యన్లని ఆకర్శించలేక పోయాము 1990 లలో!
మొదటి నుండీ అంటే 1983 లో తేజస్ ప్రాజెక్ట్ ఆమోదం పొందినప్పటి నుండీ నత్త నడకే!
వేగం పుంజుకున్నది 2014 తరువాత! అలా అని అంతా సవ్యంగా సాగలేదు!

తేజస్ డిజైన్, అభివృద్ధి ADA ( Aeronautical Development Agency) చేసింది. కానీ అడుగు అడుగునా అవాంతరాలే! Dr. కోట హరి నారాయణ గారు రెండు దశబ్దాల పాటు ADA కి ప్రోగ్రామ్ డైరెక్టర్, చీఫ్ డిజైనర్ గా ఉన్నారు తేజస్ LCA కి.

  • ప్రోటో టైప్ డిజైన్ పూర్తయ్యే సమయానికి IAF నుండీ మార్పులు, సవరణలు, కొత్తవి చేర్చమని డిమాండ్ వచ్చేది! అవి పూర్తవడానికి మరో రెండేళ్లు పట్టేది. అప్పటికి ఏదో ఒక జెట్ ఫైటర్ లో ఫలానా ఫీచర్ కొత్తగా వచ్చింది అదీ కావాలనేది IAF.

ఇలా ఇంటర్సెప్టర్ జెట్ కాస్త మల్టీ రోల్ ఫైటర్ జెట్ గా రూపాంతరం చెందింది! ఇక్కడ ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు! ADA, HAL లు నిరంతరం పని చేస్తూనే వచ్చాయి. IAF అడిగేది దేశ రక్షణ కోసమే అని అనిపిస్తుంది కానీ తేజస్ ఎయిర్ ఫ్రేమ్ డిజైన్ చేస్తున్న దశలోనే తమకి ఏమీ కావాలో స్పష్టంగా చెప్పి దాని మీదనే స్థిరంగా ఉండిపోయి ఉంటే ఈపాటికి నాలుగు స్క్వాడ్రన్లు ఆపరేషన్ లో ఉండేవి.

రాజకీయ సంకల్పం లేకపోవడం పెద్ద నష్టం మన దేశానికి!
బలమైన రాజకీయ సంకల్పం ఉండి ఉంటే 2000 నాటికే MIG-21 ల స్థానంలో తేజస్ లు ఉండేవి. మన నాయకులకి విదేశాల నుండీ కొంటే కమిషన్లు వస్తాయి.
ఏ దేశానికైనా ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ పూర్తి అవడానికి 15 ఏళ్ళ నుండీ 18 ఏళ్ళు పడుతుంది ఫైనల్ ఆపరేషన్ సర్టిఫికెట్ రావడానికి! ఈ లెక్కన చూస్తే తేజస్ 1983 లో మొదలుపెట్టారు అంటే 2000 కల్లా ఫైనల్ ఆపరేషన్ సర్టిఫికెట్ రావాల్సి ఉంది. కానీ 2001 లో ఇనిషియల్ ఆపరేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు!

అసలు తేజస్ కి వాడడానికి కావేరి ఇంజిన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు కానీ తేజస్ ఎయిర్ ఫ్రేమ్ డిజైన్ పూర్తయాక కూడా కావేరి ఇంజిన్ పూర్తి కాలేదు. దాంతో ఎయిర్ ఫ్రేమ్ లో మార్పులు చేసి GE F404 ఇంజిన్  అమర్చారు.

మొదట్లో GE F404 ఇంజిన్ తేజస్ కి అండర్ పవర్ ఇస్తున్నది అనే వార్తలు వచ్చాయి. ఇంజిన్ IN LET కోసం మార్పులు చేసిన తరువాత తగినంత పవర్ దొరికింది!
ఇన్ని బాలారిష్టాలు దాటుకొని IAF నుండీ ఆర్డర్ తీసుకున్నది HAL!

భారత్ స్వంతంగా ఫైటర్ జెట్ ఇంజిన్ తయారు చేసుకోవడం ఏ దేశానికి ఇష్టం ఉండదు, లేదు కూడా!
ఆసియాలోనే కాదు, ప్రపంచంలోనే భారత దేశం ఫైటర్ జెట్స్ కి అతి పెద్ద మార్కెట్! రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు భారత మార్కెట్ ని కోల్పోతాయి ఇండియా స్వంతంగా ఇంజిన్ ని తయారుచేసుకోగలిగితే!

రష్యా సుఖోయ్ నుండి ఏ దేశమైనా ఒకేసారి 272 ఫైటర్ జెట్స్ కొనగలదా? మనం కొన్నాం! అఫ్కోర్స్ రష్యాకి డబ్బులు కట్టి లైసెన్స్ తీసుకొని HAL తయారుచేస్తున్నది!
అలాంటిది రష్యా మన మార్కెట్ వదులుకుంటుందా?

*****************
భారత్ స్వంతంగా జెట్ ఇంజిన్ తయారు చేసుకోవాలనే సంకల్పం మంచిదే! కానీ మొదటి నుండి నిర్లక్ష్యం చేసి చివరలో హడావుడి పడడం ఎంత వరకూ సబబు?
మన దేశంలో మెటీరియల్ సైన్స్ లో ఇంజినీరింగ్ చేసిన విద్యార్థులు తక్కువ! మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ సైన్స్ లో నైపుణ్యం ఉన్నవాళ్లు లేరు. జెట్ ఇంజిన్ కోసం మెటలర్జికల్ సైన్స్ లో నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి! ఫైటర్ జెట్ ఫ్రేమ్, బాడీ నిర్మాణానికి మెటీరియల్ సైన్స్ లో నైపుణ్యం కావాలి.

జెట్ ఇంజిన్ లో టర్బైన్ బ్లేడ్స్ తయారు చేయాలంటే సింగిల్ క్రిస్టల్ టైటానియం అల్లాయ్ కావాల్సి ఉంటుంది. ఇంకా ఇతర అంశాలు ఉన్నాయి కానీ ఇంజినీర్లు లేరు!
2010 లో చైనా జెట్ ఇంజన్ల విషయంలో మనం అప్పుడున్న స్థితిలోనే ఉండేది. కానీ విదేశాలలో పనిచేస్తున్న చైనా ఇంజినీర్లు వందల్లో చైనాకి చేరుకొని జెట్ ఇంజిన్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు!
2019 కల్లా చైనా తన మొదటి WS-10 జెట్ ఇంజిన్ ని J-10 కి బిగించి వాడడం మొదలుపెట్టింది.

అఫ్కోర్స్! చైనా లో పనిచేయడానికి ఉత్సాహం చూపించే వాళ్ళని ప్రోత్సహిస్తారు! మన దేశంలో ప్రభుత్వరంగ సంస్థలలో ఆ అవకాశం ఉండదు! డిఫెన్స్ రంగం మొత్తం ప్రభుత్వరంగ సంస్థల చేతిలో ఉంది! పని చేయకపోతే ఉద్యోగం పోతుందనే భయం ఉండదు! మన దేశ రక్షణ రంగంలో పనిచేయాలనే ఉత్సాహం ఉన్నా మన దేశ ప్రభుత్వరంగ సంస్థల వర్కింగ్ స్టయిల్ తెలుసు కాబట్టి భారత్ కి రారు! ఇక కావేరి ఇంజిన్ ఎలా పూర్తవతుంది? నా సర్వీస్ అయిపోతే చాలు, తరువాత వచ్చేవాడు చూసుకుంటాడులే అనే మనస్తత్వం ఉంటుంది మన దగ్గర!

(తరువాయి భాగం... మూడో కథనం... మనకు సేల్స్ ప్రమోషన్లు అవసరమా..?)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తేజస్ ఎందుకు పేలిపోయిందో తెలుసా..? ఇవీ కారణాలు..!! పార్ట్-2
  • తేజస్ కుప్పకూలి, పేలిపోవడం వెనుక పైలట్ తప్పుందా..? పార్ట్-1
  • అటు అమలాపురం… ఇటు పెద్దాపురం… మధ్య గోదావరి…
  • వాట్సప్ గ్రూపుల్లో వచ్చే ఎస్‌బీఐ APK టచ్ చేశారో… బ్యాంకు ఖాతా ఖల్లాస్…
  • ప్రపంచయుద్దం గురించి రాసినా… జగన్‌ను అందులోకి లాగాల్సిందే…
  • అలా కాజువల్ జీన్స్‌లో వచ్చాడు.., మంత్రిగా ప్రమాణం చేశాడు..!
  • ఖర్చు వేల కోట్లు… ఇంపాక్ట్ తక్కువ… డిజిటల్ యాడ్స్ కథాకమామిషు..!
  • పోస్ట్ చేయడానికీ డబ్బుల్లేవ్… ఆమె తన హెయిర్ డ్రయర్ అమ్మేసింది…
  • కాల్పనిక కథను మించి..! జీవితాన్ని మించిన మెలోడ్రామా ఏముంటుంది..?
  • తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో… మంచాలిక దిగండోయ్ కొక్కొరొకో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions