ఈ పిల్లకు ఏమైనా తిక్కా..? ఈ వ్యాఖ్య సాయిపల్లవిని ఉద్దేశించి చాలామంది అభిప్రాయం… హఠాత్తుగా ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..? రెండు రోజులుగా ఓ న్యూస్ దాదాపు అన్ని సైట్లలోనూ కనిపిస్తోంది… తమిళ మీడియా, తమిళ సోషల్ మీడియాలో ఎక్కువగా రావాలి, కానీ రాలేదు… తెలుగు మీడియా, సోషల్ మీడియా అప్పుడప్పుడూ గాలి పోగేసి ఏదో వండుతూ ఉంటుంది… నాలుగు రోజులకే హర్రె, ఇదంతా తప్పట అని కూడా అదే రాస్తుంది…
సాయిపల్లవి రెండు ప్రిస్టేజియస్ ప్రాజెక్టులను వదులుకున్నదనేది ఆ వార్తల సారాంశం… అవి వారసుడు, తెగింపు… (varisu, tunivu)… రెండూ ఇద్దరు పరస్పరం బలంగా పోటీపడే హీరోల చిత్రాలు… వారసుడిలో విజయ్ హీరో… సాయిపల్లవి కోసం దిల్ రాజు విపరీతంగా ట్రై చేశాడనీ, స్క్రీన్ స్పేస్ చిన్నగా ఉండటం, హీరోయిన్ పాత్రను మరీ నామ్‌కేవాస్తేగా మార్చేయడంతో ఆమెకు నచ్చలేడట… ఆ పాత్రను కాస్తా రష్మిక ఎగరేసుకుపోయింది…
Ads
తెగింపు సినిమాలో హీరోయిన్ పాత్రను సాయిపల్లవి సేమ్ రీజన్‌తో తిరస్కరించిందట… దాంతో ఆ పాత్ర కాస్తా మంజూ వారియర్ పాలబడింది… గతంలో సాయిపల్లవి ప్యూర్ కమర్షియల్ పాత్ర చేయలేదా..? ఈ రెండూ ఎందుకు తిరస్కరించింది..? సూర్య పక్కన నందగోపాలకృష్ణ అలియాస్ ఎన్‌జీకే మూవీలో చేసింది… పైగా అందులో రకుల్ ప్రీత్ కూడా ఉంది… సాయిపల్లవే ప్రధానపాత్ర కాదు… ఆ పాత్రకు ఇంపార్టెన్స్ కూడా ఏమీ లేదు…
మారి-2లో ధనుష్ పక్కన చేసింది… యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలు కొట్టిన రౌడీ బేబీ పాట అందులోనిదే… ఇందులో పాత్ర కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే… నాని పక్కన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చేసింది… ఒకటీరెండు పాటలకే ఆమె పరిమితం అందులో… సో, మామూలు పాత్రలు చేయలేదు అని చెప్పడానికి లేదు… అసలు అవి చేస్తేనే కదా పాపులారిటీ వచ్చేది… పనిలోపనిగా మంచి పాత్రలూ వచ్చేది…
పిచ్చిదా..? వారసుడు, తెగింపు సినిమాలు చేస్తే బాగుండు… ఎంతసేపూ ఎవరూ చూడని గార్గి, విరాటపర్వం వంటి సినిమాల్లో పాత్రలు చేస్తే, ఎన్నేళ్లయినా ఆమె అలాగే ఉండిపోతుంది కదా… కొంతలోకొంత నయం, నానితో ఆమధ్య శ్యామ్ సింగరాయ్ చేసింది… ఆ పాత్ర పర్లేదు… సరే, ఈ చర్చను ఇలా వదిలేస్తే… తనకు నచ్చకపోతే ఏ దర్శకుడైనా సరే, ఏ సినిమా అయినా సరే ఆమె వదులుకోగలదు… కోట్ల రూపాయల యాడ్స్‌నే ఎడమకాలితో తన్నేయగలదు… ఆమె ఓ డిఫరెంట్ కేరక్టర్… అయితే వారసుడు, తెగింపు పాత్రల వార్తలు మాత్రం హంబగ్ అని కొట్టిపారేస్తున్నాయి తమిళ మీడియా, సోషల్ మీడియా…
ఆమె మెంటాలిటీ మాత్రం ఇదేనని చెప్పడానికి ఓ బలమైన ఉదాహరణ చెబుతున్నారు… సౌత్ ఇండియా ఫిలిమ్ ఇండస్ట్రీలలో మణిరత్నం సినిమాలో పాత్ర అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు… కానీ ఆయన సినిమాను కూడా సాయిపల్లవి రిజెక్ట్ చేసింది అప్పట్లో… కాట్రు వెలియదై ఆ సినిమా పేరు, చెలియా అని తెలుగులోకి కూడా డబ్ చేసినట్టున్నారు… సాయిపల్లవి వద్దన్నాక మణిరత్నం ఆ పాత్రకు అదితిరావు హైదరీని తీసుకున్నాడు…
సాయిపల్లవి జడ్జిమెంట్ కరెక్టే… సినిమా ఫ్లాప్… కార్తి పాత్ర తేలిపోయింది… దాంతోపాటు అదితిరావు పాత్ర కూడా…!! చెలియా తెలుగులో వచ్చిన విషయమే ఎవరికీ గుర్తులేదు… అంత అనామకంగా కొట్టుకుపోయింది అది… అయితే సినిమా జయాపజయాలు ఎలా ఉన్నా, మణిరత్నం చేతిలో పడితే సాయిపల్లవి ఇమేజీకి ఉపయోగపడేది… ఆ పాలిష్‌నెస్ కోల్పోయింది…
అందుకే గార్గి, విరాటపర్వాలే కాదు, అంతా నేనే కనిపించాలి సినిమాలో అనే ధోరణి కాదు… కాస్త లౌక్యం, మంచి దర్శకుడు, పెద్ద బ్యానర్ ఎంపిక అనేవి ప్రయారిటీ లిస్టులో చేరాలి… ఐనా సాయిపల్లవికి ఎవరూ చెప్పలేరు… ముందే చెప్పినట్టు ‘‘తిక్క కేరక్టర్’’..!! ఏదో మహాభారతం సినిమాకు సైన్ చేస్తోంది, రెండుమూడేళ్లు ఇక వేరే సినిమా చేయదు అనే వార్త కూడా నమ్మబుల్ కాదు… అసలు ఆమె ఎవరికీ అందుబాటులోనే లేదు…!!
Share this Article