.
పొట్లూరి పార్థసారథి.... తేజస్ Mk-1A కోసం సేల్స్ ప్రమోషన్ అవసరమా?
అస్సలు అవసరమే లేదు! ఈ దుబాయ్ ఎయిర్ షోలలో తేజస్ విన్యాసాలు, తేజస్ కంటే విలువైన పైలట్ ప్రాణాలని తాకట్టు పెట్టడం అవసరమా?
ఒకసారి వివరంగా పరిశీలిస్తే తేజస్ సేల్స్ ప్రమోషన్ అవసరమో కాదో తెలుస్తుంది!
తేజస్ LCA MARK-1A కోసం ఏ విడిభాగాలు ఎక్కడి నుండి దిగుమతి చేసుకుంటున్నామో చూడండి…
ఇంజిన్: GE F404 IN20 అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాము.
రాడార్, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్: ఎల్టా సిస్టమ్స్ ELM-2052 ( Elta Systems EL M -2052 Active Electronically Scanned Array – AESA RADAR) ఇజ్రాయేల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాము.
ELL -8222WB ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్ ( EW) ఇజ్రాయేల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాము.
Ads
అత్యవసర సమయంలో పైలట్ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడే ఎజెక్ట్ సీట్ ని బ్రిటన్ నుండి దిగుమతి చేసుకుంటున్నాము. బ్రిటన్ కి చెందిన మార్టిన్ బేకర్ సంస్థ ఏజెక్టింగ్ సీట్స్ ని 1947 నుండి తయారుచేస్తున్నది కాబట్టి కొనాల్సి వచ్చింది.
తేజస్ ముందు భాగంలో ఉండే ముక్కు భాగం Radom ( Quartz nose cone )ని బ్రిటన్ నుండి దిగుమతి చేసుకుంటున్నాము.
ఎయిర్ to ఎయిర్ రీ ఫ్యూయలింగ్ ప్రొబ్ ని బ్రిటన్ కి చెందిన Cobham నుండి దిగుమతి చేసుకుంటున్నాము.
మిగతావన్నీ మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాము.
అర్జెంటినా దేశం మన తేజస్ లని కొనడానికి సిద్ధపడింది
కానీ బ్రిటన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 1982 బ్రిటన్ అర్జెంటినా దేశాలు యుద్ధం చేసుకున్నాయి ఫాక్ లాండ్ దీవుల కోసం. బ్రిటన్ ఇప్పటికీ అర్జెంటినా దేశాన్ని శత్రువుగానే చూస్తున్నది కాబట్టి తేజస్ లని అమ్మడానికి వీల్లేదంది. బ్రిటన్ మాట కాదని ఒప్పందం చేసుకుంటే బ్రిటన్ తేజస్ కి ఇచ్చే విడిభాగాలని ఆపేస్తుంది!
ఇక అమెరికా అయితే GE ఏరో స్పేస్ నుండి ఇంజన్ల సరఫరా కావాలనే ఆలస్యం చేస్తున్నది అన్న సంగతి తెలిసిందే!
ఇప్పుడు విదేశాల నుండి కొత్త ఆర్డర్లు అవసరమా?
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం 180 తేజస్ MK-1A ల కోసం HAL కి ఆర్డర్ ఇచ్చింది!
IAF మొదట 2021 లో 83 తేజస్ లకి ఆర్డర్ ఇచ్చింది.
గత సెప్టెంబర్ లో మరో 97 తేజస్ లకి ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 180 తేజస్ లని డెలివరీ ఇవ్వాలి HAL! కానీ HAL సకాలంలో IAF కి ఇవ్వగలుగుతుందా? సందేహమే! HAL వర్కంగ్ స్టయిల్ చూసే కదా దసల్ట్ ఏవియేషన్ పార్టనర్ షిప్ తో పనిచేయడానికి ఒప్పుకోలేదు!
2021 లో ఆర్డర్ ఇచ్చిన 83 తేజస్ లనే ఇంతవరకూ పూర్తిగా డెలివరీ చేయలేకపోయింది HAL! గట్టిగా అడిగితే అమెరికా నుండి ఇంజన్ల సరఫరా ఆగిపోవడం వలన ఆలస్యం అవుతున్నది అని అంటున్నది HAL! ఇదే మాట వేరే దేశం వాళ్ళతో అనగలదా? పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది డాలర్లలో!
ఓకే! GE ఏరో స్పేస్ సంస్థ సంవత్సరానికి 24 F404 IN20 ఇంజన్లు సరఫరా చేస్తానని వాగ్దానం చేసింది అదీ 2024 నుండి… కానీ అలా చేయలేకపోయింది!
2026 నుండి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తానని మరోసారి వాగ్దానం చేసింది కానీ అనుమానమే!
గట్టిగా ఒత్తిడి తెస్తే HAL మూడో అసెంబ్లీంగ్ ప్లాంట్ 2026 లో ఓపెన్ చేసి సంవత్సరానికి 24 తేజస్ లని IAF కి సరఫరా చేస్తానని అంటున్నది! ఇప్పటికే రెండు ప్లాంట్లు బెంగుళూరులో అసెంబ్లింగ్ చేస్తుండగా మూడోది నాసిక్ లో ప్రారంభిస్తానని అంటున్నది.
సంవత్సరానికి 24 తేజస్ లని డెలివరీ చేస్తే IAF ఇచ్చిన 180 తేజస్ ల పని పూర్తవడానికి 8 ఏళ్ళు పడుతుంది అంటే 2033 నాటికి IAF ఆర్డర్ ని పూర్తిచేయగలుతుంది HAL! ఇది కూడా GE సంవత్సరానికి 24 ఇంజన్లని అనుకున్నది అనుకున్నట్లుగా సరఫరా చేస్తేనే!
ఇప్పటికే MIG-21 లని దశల వారీగా డీకమిషన్ చేస్తున్నది IAF.
ప్రస్తుతం IAF కి ఉన్నవి 29 స్క్వాడ్రాన్ల ఫైటర్ జెట్స్ మాత్రమే! చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో యుద్ధం అంటూ వస్తే 42 స్క్వాడ్రాన్లు అవసరం అవుతాయి. యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ సిద్ధంగా ఉండాలి కదా?
42 స్క్వాడ్రన్లు కావాల్సి ఉంటే 29 తో ఎన్ని ఏళ్ళు నెట్టుకురావాలి? 2035 దాకా నెట్టుకు రావాలా?
చేతిలో ఉన్న ఆర్డర్స్ పూర్తవడానికి 2035 వరకూ ఉంటే
మరి తేజస్ మార్క్ 2, AMCA ల సంగతి ఏమిటీ?
పోనీ ఏదన్నా విదేశం ఓ 36 తేజస్ లకి ఆర్డర్ ఇచ్చిందే అనుకుందాం వాటిని ఎప్పుడు డెలివరీ చేస్తుంది? 2040 లో డెలివరీ చేస్తుందా? మూడో అసెంబ్లింగ్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి మీనమేషాలు లెక్కపెట్టిన HAL పెద్ద ఆర్డర్ వస్తే హాండిల్ చేయగలదా?
ఇజ్రాయేల్ ని మినహాయిస్తే అమెరికా, బ్రిటన్ లకి కోపం వస్తే అంతే సంగతులు. ఈ రెండు దేశాలు ధూర్త దేశాలు. అగ్రిమెంట్లు, MOU లని పక్కన పెట్టేసి చోద్యం చూస్తుంటాయి!
ముందు ఇల్లు చక్కపెట్టుకొని ఇతరుల ఇంట్లో పనిచేయడానికి చూడాలి!
ఎవ్వరినీ ఏవీ అడగనవసరం లేని విధంగా అన్నీ సమకూర్చుకొని చైనా తాను నేరుగా అమ్మకుండా పాకిస్తాన్ చేత అమ్మిస్తున్నది JF-17 లని. మన పరిస్థితి అలా లేదే!
ఎందుకొచ్చిన ఈ కంచి గరుడ సేవ?
తేజస్ కి IOC ( ఇనీషియల్ ఆపరేషన్ సర్టిఫికెట్) వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ రెండు జెట్లు మాత్రమే కూలిపోయాయి. రాజస్థాన్ లో 2024 మార్చి నెలలో ఒక తేజస్ కూలిపోయింది ఇంజిన్ లోపం వల్ల… కానీ పైలట్ ఎజెక్ట్ అయ్యాడు క్షేమంగా..!
భద్రత పరంగా చూస్తే తేజస్ అత్యంత సేఫ్ ఫైటర్ జెట్!
కానీ అనుభవం గల ఫైటర్ పైలట్ల వెల కట్టలేనిది!
- దేశ భద్రత కంటే ఎక్కువ కాదు HAL లెక్కలు, డొక్కలు!
అసలు HAL ని అసెంబ్లింగ్ వరకూ పరిమితం చేసి ప్రయివేట్ సంస్థలకి అప్పచెప్పాలి! బోయింగ్, GE, లాక్ హీడ్ మార్టిన్, రోల్స్ రాయిస్, దస్సాల్ట్ ఏవియేషన్ లు ప్రయివేట్ సంస్థలే!
రష్యా, చైనా దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు. మరి మన దేశం? బనానా రిపబ్లిక్! చైనా రష్యాలలోలాగా మన దేశంలో జరగదు యూనియన్ పొలిటిక్స్ తో!
దరిద్రం ఏమిటంటే అమెరికాతో మంచిగా ఉండాలి లేకపోతే సప్లై చైన్ ఆగిపోతుంది! ప్రభుత్వ రంగ సంస్థల యూనియన్లతో మంచిగా ఉండాలి లేకపోతే పని ఆగిపోతుంది!
Share this Article