.
రేవంత్ రెడ్డి ఎంత ఉదారంగా ఉంటున్నా సరే… తెలుగు సినిమా పరిశ్రమ వ్యవహారాలకు సంబంధించి తను బాగా మిస్‌లీడ్ అవుతున్నాడనే భావన ప్రబలంగా వ్యాపిస్తోంది…
1) దిల్ రాజు… తను స్వతహాగా సినిమా వ్యాపారి… తనకు రాగద్వేషాలు ఉంటాయి… అవి ప్రభుత్వంపై రిఫ్లెక్ట్ అవుతాయి… అది ఓ ప్రజాప్రభుత్వానికి సరైనది కాదు…
Ads
2) కోమటిరెడ్డి… తను మంత్రే… తను పెద్దగా సినిమా పరిశ్రమ నుంచి ఆశించేది ఏమీ ఉండదు… కానీ తను కూడా మిస్‌లీడ్ అవుతున్నాడు…
… ఇండస్ట్రీ కార్మికుల సమస్య… అది పక్కా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టాలీవుడ్ సమస్య… కానీ దాన్ని ఏపీ మంత్రి చేతుల్లోకి, తద్వాారా ఇండస్ట్రీ భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల్లోకి వదిలేశారు… అసలు ఏపీలో కొందరికి, తెలంగాణ ప్రభుత్వం మీద నిర్ణయాధికారం ఏమిటి..? పెత్తనం ఏమిటి..?
కార్మిక సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాయి, కానీ నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు… అదెలా..? ఏపీ ప్రభుత్వం సాల్వ్ చేస్తుందా దీన్ని..? మరిక తెలంగాణ ప్రభుత్వం ఉనికికి, అధికార పరిధికి అర్థమేమిటి..? ఎవరో కందుల దుర్గేష్ తీర్పు చెబితే తెలంగాణ ప్రభుత్వం తలవంచి జీహుజూర్ అనాలా..?
కోమటిరెడ్డికి పంజా విప్పే సమర్థత లేదా..? అసలు దిల్ రాజు ఏం చేస్తున్నాడు..? రేవంత్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాల్ని నిజంగా వమ్ము చేస్తున్నదెవరు..?
కూలీ, వార్2 సినిమాలకు దేశంలో ఎక్కడా లేని భారీగా టికెట్ రేట్స్ హైక్ ఎందుకు ఇచ్చినట్టు..? పైగా అవి హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలు… ఎవరు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుదోవలో తీసుకుపోతున్నారు..?
వార్2 ప్రిరిలీజ్‌కు ఎవరు అనుమతులు ఇప్పించారు..? కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎంను, తెలంగాణ పోలీసు యంత్రాంగాన్ని గుర్తుంచుకుని థాంక్స్ చెప్పినవాడు లేడు ఆ మీటింగులో…
నిజానికి గద్దర్ అవార్డుల జ్యూరీ పెత్తనం జయసుధకు ఇవ్వడమే తప్పు… సరైన ఎంపిక కాదు… ప్రజాకవి కాళోజీ సినిమాకు ‘గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు’ ప్రకటించి మూడు లక్షల చెక్ ఇచ్చారు… బ్యాంకులో వేసిన తర్వాత.., ‘లేదు, లేదు. మీకు లక్ష రూపాయలే వస్తాయి..’ అని చెప్పి చెక్ వాపస్ తెప్పించారు…
ఇంతకన్నా ఘోరమైన అవమానం మరొకటి ఏముంటుంది…? మొత్తం గద్దర్ అవార్డులలో ‘బలగం’ కు తప్ప, ఒక్క తెలంగాణా సినిమాకు అవార్డు రాలేదు… సిగ్గుచేటు కాదా..? దానికి తోడు ఇచ్చిన చెక్కును వాపస్ తీసుకుంటారా..?
ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు..? ప్రభుత్వాన్ని ఎవరు బదనాం చేస్తున్నారు..? కాళోజీని గురువుగా అభిమానించిన గద్దర్ పేరిట ఉన్న అవార్డుల్లో అదే కాళోజీకి అవమానం..? చివరకు నేను సీఎం ఛాంబర్ ఎదుట నిరాహార దీక్ష చేస్తానని సదరు నిర్మాత ప్రభాకర్ జైనీ హెచ్చరిస్తే, ఆ 3 లక్షలు సేఫ్, కాపాడబడ్డాయి…
ఎస్, తెలంగాణ జ్యూరీ గనుక ఉండి ఉంటే… తెలంగాణ కోణంలో అవార్డులు ఖరారై ఉండేవి… తెలుగు సినిమాలు ఏపీలో ప్రదర్శితమవుతున్నాయి కాబట్టి వాటి కోణంలో అవార్డులు ఇవ్వాలా..? అలాగంటే తెలుగు సినిమాలు ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయి కదా మరి…
అంతేనా..? ఒకచోట, ఈ అవార్డు కాళోజీ నారాయణరావు గారికి posthumus, అంటే మరణానంతరం ఇచ్చారని రాసారు… వారు పబ్లిష్ చేసిన సావనీర్ లో…, ‘ప్రజాకవి కలోజి’ అని రాసారు.,.. నిర్మాతకు ఇచ్చిన సర్టిఫికేట్ లో ‘ప్రజాకవి కాళోజు’ అని రాసారు… అంటే, కాళోజీ పట్ల ఎంత విద్వేషం చూపించారో అర్థం చేసుకోండి…
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ‘గద్దర్’ పేరు మీద తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన అవార్డులలో, ఒక్క తెలంగాణా సినిమాకు సరైన గౌరవం దక్కలేదు… అవునూ, జాతీయ అవార్డులకు జ్యూరీగా ప్రతీసారి ఒక్కడే వెళ్ళడమేమిటి..? ఆ జ్యూరీ మెంబరే గద్దర్ అవార్డుల కమిటీలో కూడా ఉండడం కాకతాళీయమా? కాలిక్యులేటెడా?
రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఒకసారి తనను, తన ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న ఈ సినిమా వ్యవహారాలపై కాన్సంట్రేట్ చేసి, తగు మార్పులు చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా కనిపిస్తోంది..!!
Share this Article