.
ప్రెస్టిట్యూట్స్… ఈ పదం చాలామంది పదే పదే వాడుతున్నారు… ఆ పదం వాడటం సరైందో కాదో తెలియదు గానీ… ఈరోజు ఈనాడు మొదటి పేజీలో ఒక యాడ్ చూశాక ఆ పదం మళ్లీ గుర్తొచ్చింది…
ఈ యాడ్ కేఎల్ యూనివర్శిటీది… ఆహా ఓహో… మాది అత్యున్నత విద్య, వద్దన్నా మస్తు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు అనే తరహాలో స్వకుచమర్దనం… సరే, అన్ని యాడ్స్ అలాగే ఉంటాయి గానీ…
Ads
ఇదే ఈనాడు కదా ఇదే కేఎల్ యూనివర్శిటీ బాగోతాన్ని ప్రచురించింది ఆమధ్య… అదేనండీ… ఎ++ గుర్తింపును అక్రమంగా పొందడం కోసం న్యాక్ (National Accredition Council) టీమ్స్‌కు అడ్డంగా లంచాలిచ్చి దొరికిపోయారని రాశారు కదా…
సీబీఐ కేసు పెట్టింది… నగదు, బంగారం, ట్యాప్‌టాప్స్, సెల్‌ఫోన్స్… ఏది కావాలంటే అది… జస్ట్, ఎ++ గుర్తింపు ఇస్తే చాలు… దాని పేరు చెప్పుకుని ఫీజులు రాలగొట్టుకోవడం, తినేయడం… 14 మంది నిందితులు, పేరున్న పెద్ద ప్రొఫెసర్ల పేర్లు కూడా… 10 మంది అరెస్టు… అదొక కలకలం…
సాక్షాత్తూ చైర్మనే ముందస్తు బెయిల్ మీద ఉన్నట్టు వార్తలొచ్చాయి… మరి ఇలాంటి సంస్థ ఓ యాడ్ ఇస్తే క్యారీ చేయాలా…? ఇన్ని మరకల సంస్థ యాడ్‌ను అంగీకరించాలా…? ఇదే ఈనాడుతో, అనుబంధ సంస్థలతో ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్నారు కదా… ఇంకా ఇంకా ఈ కక్కుర్తి సొమ్ముకు ఆశపడాలా ఈనాడు..?
సొసైటీ ఇంత సంపదను ఇచ్చింది… సొసైటీకి ఈనాడు ఏమీ ఇవ్వలేదా… కనీసం ఇలాంటి యాడ్స్ దూరం పెట్టడం ద్వారా… తన నైతికతను చూపించుకోలేదా..? నో, పాత్రికేయ దందాలో అవన్నీ కుదరవు అంటుందా..?
ఎస్…, తాము మెచ్చిన నాయకులు, తాము మెచ్చిన పార్టీలకు అనుగుణంగా పత్రికలు, టీవీలు తమ పాత్రికేయ లక్షణాలు కోల్పోయి, జస్ట్, మౌత్ పీసులుగా మారిపోయింది నిజమే… కనీసం కొన్ని ప్రమాణాల్ని ఇలాంటి యాడ్స్‌ను తిరస్కరించడం ద్వారా ప్రదర్శించలేరా…? లేక ఇక్కడా సామాజికవర్గ దృక్పథమేనా..?
ప్చ్, తెల్లారిలేస్తే లక్ష నీతులు చెప్పే ఈనాడు… అందరికీ శకునం చెబుతూ బల్లి ఏదో తొట్టిలో పడినట్టుగా ఉంది..!! అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యల కార్పొరేట్ జూనియర్ కాలేజీల యాడ్స్ ప్లస్ ఇదుగో ఇలాంటి కక్కుర్తి యాడ్స్… దారుణం..!!
Share this Article