.
నటి సురేఖా వాణి బిడ్డ సుప్రీత ఓ వీడియో విడుదల చేసింది… ‘నేను సేఫ్, ఎవరూ ఆందోళన చెందవద్దు, మీడియాలో వచ్చే వార్తలు అబద్దాలు, నేను షూటింగులో ఉన్నాను’ ఇదీ ఆ వీడియో సారాంశం…
ఏమో, ఆమె పరారీలో ఉందని రాస్తున్నారో ఏమో… సోషల్ మీడియాకు ఇలాంటి వివాదాలు వస్తే పండుగ కదా, ఏదైనా రాసేస్తారు… ఐనా సేఫ్‌గా ఉన్నావు సరే, షూటింగ్ చేస్తున్నావు సరే, కానీ జనానికి ఆందోళన ఎందుకు..?
Ads
పోనీ, నీ కోసం జనమంతా తల్లడిల్లిపోతున్నారా ఏం.,. అసలు నీ మీద కేసే నమోదు కాలేదు అంటున్నావా..? ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..? వాళ్ల బుర్రలు అంతే… అంతకుమించి ఆలోచించలేరు… కాకపోతే కాస్త డబ్బుకు కక్కుర్తి పడి… నిజంగా అది నేరమనో, తప్పు అనో తెలియక బెట్టింగ్స్ యాప్స్‌ను ప్రమోట్ చేసి ఉంటారు…
ఈ చిల్లర సెలబ్రిటీల రీల్స్, వీడియోలు కూడా చూసి నమ్మే పిచ్చోళ్లు ఉంటారు కదా సమాజంలో… ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెడుతున్నారు… ఈ హింట్స్ ఉన్నాయి కాబట్టే హడావుడిగా టేస్టీ తేజ, సుప్రీత, శ్యామల తదితరులు ‘‘తెలియక చేశాం, ఇకపై చేయబోం, ఎవరూ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు’ అని నీతులు చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు…
సరే, పోలీసులు కరుణిస్తారేమోనని ఆశ… తప్పులేదు… నిజానికి వీళ్లలో కొన్ని ముదురు కేసులకు తప్ప మిగతా వారికి తాము చేస్తున్నది తప్పు అని తెలుసో లేదో… సుప్రీతతోపాటు
* హర్షసాయి,
* విష్ణుప్రియ,
* ఇమ్రాన్ ఖాన్,
* రీతు చౌదరి,
* టేస్టీ తేజ,
* అజయ్,
* కిరణ్ గౌడ్,
* బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజులపై కేసులు నమోదయ్యాయి… బిగ్‌బాస్ వంటి టీవీ షోలు ఇలాంటోళ్లను అర్జెంటుగా సెలబ్రిటీలను చేసి సమాజం మీదకు వదులుతున్నాయి… తోడుగా టీవీ కార్యక్రమాలు, రీల్స్, షార్ట్స్, ఇన్‌స్టా వీడియోలు ఎట్సెట్రా వారిని సెలబ్రిటీలుగా ప్రమోట్ చేస్తున్నాయి…
ఈమాత్రం పాపులారిటీతో వాళ్లు డబ్బుకు కక్కుర్తి పడుతున్నారనేది నిజం… నిజానికి ఇలాంటి వాళ్లపై కేసులు బదులు ఆ బెట్టింగ్ యాప్స్‌నే నిషేధించే ప్రయత్నం చేయాలి కదా… కేంద్ర ప్రభుత్వం చాలా యాప్స్ మీద నిషేధం పెడుతోంది, ఇదేమీ కొత్త కాదు…
తెలంగాణ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు… ఒకరు స్వయంగా ఈ హోంశాఖకు సహాయమంత్రి,.. చొరవ తీసుకోవచ్చు కదా… అసలు ఆ యాప్స్ ఉండవు, ప్రమోటర్లూ ఉండరు…
11 మంది కేసులు పెట్టారు కదా… వీరిలో శ్యామల వైసీపీ యాక్టివిస్టు… తరచూ కూటమి ఫ్యాన్స్ ట్రోలింగుకు గురవుతూ ఉంటుంది… విష్ణుప్రియ చాన్నాళ్లుగా టీవీ హోస్టుగా, ఆర్టిస్టుగా ఉంది… బిగ్‌బాస్ ఫేమ్… రీతూ చౌదరి ఆమధ్య వార్తల తెర మీద కనిపించింది…
శ్రీకాంత్ అనే అక్రమార్కుడిని పెళ్లి చేసుకుని, భూదందాలకు పాల్పడినట్టు ఆరోపణలు… అబ్బే, నాకేమీ తెలియదు, తనతో విడిపోయాను, విడాకులకు అప్లయ్ చేశాను అని చెప్పుకుంది… మిగతావాళ్ల గురించి రెగ్యులర్‌గా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవాళ్లకు తప్ప మామూలు జనానికి పెద్దగా తెలియదు…
ఇలాంటోళ్లను కేసులు పెట్టి, విచారించి, జైలులో వేసినా సరే సొసైటీ నుంచి సానుభూతి ఎవరికీ రాదు… అవసరం లేదు కూడా… ఐతే ఒక ప్రశ్న… పెద్ద పెద్ద స్టార్లే గుట్కా సరోగేట్ యాడ్స్ చేస్తున్నారు… సాఫ్ట్ డ్రింక్స్ యాడ్స్ చేస్తున్నారు… కోట్లకుకోట్ల రూపాయలకు కక్కుర్తిపడుతున్నారు… వీళ్లెంత..? వీళ్ల బతుకులెంత..?
ఏ సరుకుకైనా సరే ఏ సెలబ్రిటీ అయినా సరే యాడ్స్ చేసినా, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినా, ప్రమోట్ చేసినా… ఆ సరుకు నాణ్యతకు, సొసైటీకి జరిగే నష్టానికి ఆ సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుసా ఇలాంటి వాళ్లకు..?
ఒక గుట్కా సరోగేట్ యాడ్ తెలియక చేశాను అని తప్పు అంగీకరించి, తీసుకున్న డబ్బు వాపస్ ఇచ్చాడు అమితాబ్… తెలియక చేసినా తప్పు తప్పే… బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ఇంకా ఆ యాడ్స్ చేస్తూనే ఉన్నారు… అవేనా..? మద్యం బ్రాండ్లకూ అలాంటి యాడ్సే చేస్తుంటారు… సో, విష్ణుప్రియలు, రీతూ చౌదరిలు, సుప్రీతలు చాలా చిన్న పక్షులు…
జస్ట్, పోలీసులు చిన్న ఝలక్కులు ఇస్తే సెట్టయిపోయే కేరక్టర్లు… కానీ సొసైటీకి నష్టాన్ని కలగజేసే పెద్ద స్టార్లను ఏం చేద్దాం..?! అసలు ఇలాంటి యాడ్స్ మీద రెగ్యులర్ నిఘా వేసి, కొరడా పట్టుకునే వ్యవస్థ ఉందా అసలు మనకు..?!
Share this Article