.
Rochish Mon … ఎస్. జానకి … ఒక పాఠ్యాంశం… “ఎస్. జానకి జీవితాన్ని పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చాలి” అని తమిళ్షులు ఘోషిస్తున్నారు!
లింక్… https://www.facebook.com/share/v/1UKNumQPSY/
ఔను, ఎస్. జానకి ఒక పాఠం. ఆమె జీవితం, ఆమె గానం, ఆమె ప్రవర్తన ఇవాళ్టి తరానికి ఒక పాఠం!
ప్రతిభ, ప్రవర్తన, నాణ్యత, పనితనం, మనస్తత్వం, మంచితనం వంటి ఉత్తమ లక్షణాలతో ఎస్. జానకి ఎదిగారు; చరిత్ర అయ్యారు. ఎస్. జానకి అట్టడుగు స్థాయి నుంచి ఏ వెన్నుదన్ను లేకుండా అత్యున్నత స్థాయికి చేరారు.
Ads
ఎన్నో కుట్రలు, ఎంతో వ్యతిరేకత ఆమెను చాలకాలం ఆపేశాయి. ఆమె ప్రతిభావంతురాలు అని ఆమెను కొంతకాలం తొక్కిపెట్టారు. అయితే అన్నిటినీ ఆమె తన ప్రతిభతో, ప్రవర్తనతో తుత్తినియలు చేసేశారు. ఆమె గాత్రాన్ని సరిగ్గా రికార్డ్ చేయించని కుట్రలు జరిగాయి. ఆమె తనకు పాడకూడదు అన్న అగ్ర నాయికలు ఉన్నారు! కానీ ఏ వ్యతిరేకత, ప్రతికూలత ఆమెను నిరోధించలేకపోయింది.
జానకి అనారోగ్యం కూడా ఆమెకు ప్రతిబంధకమే అయింది. దాన్ని కూడా అమె తన చిత్తంతో ఓడించారు. తప్పుడు వైద్యం కూడా ఆమెను దెబ్బ కొట్టింది. దాన్నీ ఆమె తన క్రమశిక్షణతో ఓడించారు.
జానకి మంచితనం, కళాభిజ్ఞత, రసజ్ఞత, ప్రవర్తన చాల గొప్పవి. బాలసుబ్రహ్మణ్యంలోని గొప్ప గాయకుణ్ణి ముందుగా గుర్తించింది జానకి. గాయకుణ్ణి కావాలన్న ఆలోచన తనకు జానకి వల్లే కలిగింది అని బాలు స్వయంగా తెలియజేశారు.
గాయని చిత్రకు జానకి ఆదర్శం, మార్గదర్శకం మాత్రమే కాదు చిత్ర జానకి భక్తురాలు. ఇవాళ్టి యువ గాయనీగాయకులకు జానకి ఒక గాన పాఠం. ఆమె జీవిత గమనం, ఆమె ఎదిగిన విధానం ఒక అధ్యయనాంశం.
అటు వంటి జానకిపై తెలుగులో కులోన్మాదులు కుల విద్వేషాన్ని వెళ్లగక్కారు. ఇతర భాషల్లో ఈ వికృతం లేదు. తెలుగులో మాత్రమే కుల నీచం, రసజ్ఞతా రాహిత్యం, ప్రతిభను పరిగణించకపోవడం ఎందుకు ఉంటాయో?
జానకి కులం, మతం, భాష ప్రాతిపదికలుగా కాదు వాటికి అతీతంగా ప్రతిభతో, విద్యతో ఎదిగారు. ప్రతిభ, విద్య లేకుండా బతుకుతున్న భ్రష్ట వర్గీయులైన తెలుగు అధములు జానకి జీవితాన్ని చదివి మనుషులవాలి.
జానకి అంత్యక్రియలు కర్ణాటక ఉపముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగాయి. తమిళ్షనాడు ముఖ్యమంత్రి కర్ణాటకకు వెళ్లి ఆమెకు చివరి మర్యాదలు చేశారు. మరి మన తెలుగులు …?
ఇతరుల్లో ఉండే సంస్కాం, విజ్ఞత, కళాభిజ్ఞత, రసజ్ఞత తెలుగుల్లో ఎందుకు లేవు? ఎందుకు ఉండవు?
ఇదిగో ఇవాళ తమిళ్ష్ సామాన్యులు కూడా జానకి జీవితం తమ పిల్లలకు పాఠ్యాంశం కావాలని ఘోషిస్తున్నారు! మన తెలుగువాళ్లు ఇప్పుడైనా సిగ్గుపడతారా?
ఔను నిర్ద్వంద్వంగా జానకి జీవితం ఒక పాఠం. ఒక గాయనిగా, ఒక భారతీయ మహిళగా భావి తరాలకు ఆదర్శం జానకి.
రోచిష్మాన్
9444012279
Share this Article