Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయ్… నువ్వు తోపువే..! కానీ వెండితెర చాలా క్షిపణుల్నే చూసింది…!!

August 20, 2022 by M S R

ఒకరు… పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నా సరే, అనుకోకుండా తన సినిమాలు ఒకటీరెండు హిట్టయ్యాయి… దాంతో తన పిచ్చికూతలకు జనామోదం ఉందనీ, దాన్నే జనం ఇష్టపడుతున్నారనే పిచ్చి భ్రమల్లో పడిపోయాడు తను… ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనే నీతి తనకు ఎవడూ చెప్పినట్టు లేడు… పెద్ద పెద్ద స్టార్లు సైతం జనంలోకి వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడతారనీ, సగటు ప్రేక్షకుడు తన బాడీ లాంగ్వేజీ, టాకింగ్ స్టయిల్ కూడా పరిశీలిస్తారనీ, లాంగ్‌రన్‌లో అవన్నీ కౌంట్‌లోకి వస్తాయనే సోయి కూడా లేనట్టుంది తనకు… ఎంతగా ఎడ్డి కూతలు కూస్తే అంత యాటిట్యూడ్, అంత పాపులారిటీ అనుకున్నాడు…

తిక్క మాటలు తూలితే అంత పెద్ద అమీర్ ఖానే కొట్టుకుపోతున్నాడు జనాగ్రహంలో… అంతటి పెద్ద స్టారిణి కరీనా ఖాన్ కూడా కళ్లు తేలవేసింది… పిచ్చి కూతలు కూసిన అనురాగ్ కశ్యప్, తాప్సి జనం ఈడ్చి తన్నేసరికి నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు… సినిమాల ప్రిరిలీజ్ సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలనేది సినిమా నీతి… కానీ విజయ్ దేవరకొండకు ఇలాంటివేమీ పట్టినట్టు లేదు… (ఇక్కడ ఓ క్లారిటీ, మొన్న ఏదో ప్రెస్‌మీట్‌లో కాళ్లను ముందున్న టీపాయ్ మీద పెట్టి రఫ్‌ యాటిట్యూడ్ చూపించాడనే విమర్శ కరెక్టు కాదు… నిజానికి ఫ్రీగా మాట్లాడుకుందాం అనే విధేయతనే కనబరిచాడు… తన తప్పు లేదు…)

కానీ ఇతర విషయాల్లో మాత్రం తనకు తెలియని, లోతులు అర్థం కాని మాటలకు వెళ్తున్నాడు… అసలే కాస్త గీర… అందులోనూ ఇలా మాట్లాడితేనే తన అభిమానులు తనను ఇష్టపడతారనే ఓ డొల్ల అంచనా… అదీ అసలు తప్పు… (ఐనా తనకు పోయిందేముందిలే… పాపం, రష్మిక ఏడుస్తుంది, అంతే కదా…)

Ads

devarakonda

అమీర్‌ ఖాన్ సినిమాను బాయ్‌కాట్ చేస్తే అది దేశఆర్థిక వ్యవస్థకే నష్టదాయకం అని ఏదో మాట్లాడాడు… అబ్బో, ఔనా..? మీరు తీసే పిచ్చి సినిమాల్ని జనం చూడటం మానేస్తే అది దేశఆర్థికానికి నష్టమా..? నిజానికి అది ప్రజల పొదుపు అవుతుంది… దేశానికి మంచి చేస్తుంది… మీరు చేసేదే ఓ దందా… నాలుగు పిచ్చి కూతలు, గెంతులు, ఫైట్ల సినిమాలు చూడకపోతే దేశానికి ఏం నష్టమట… పైగా ఇలా జనం ఒక్కసారి జేజేలు కొట్టగానే ప్రతివాడూ నీతులు చెబుతూ, జాతికి కర్తవ్యాలను బోధిస్తుంటాడు… మూర్ఖాభిమాన ఆర్మీలను పెట్టి ముఖ్యమంత్రుల కలలు కంటారు…

అమీర్ ఖాన్ సినిమా చూడాలా లేదాని ప్రేక్షకుడు నిర్ణయించుకుంటాడు, నడుమ నీ నీతి ఉద్బోధలు దేనికి విజయ్… థియేటర్ల దోపిడీకి, నాసిరకం సినిమాలకు నువ్వేమైనా బాధ్యత వహిస్తావా..? నీకెందుకు తీట..?! ఇలాగే మరో మాట… ‘‘బాహుబలిని కరణ్ జోహార్ బాలీవుడ్ తీసుకెళ్లాడుట… అతని రుణం తీర్చుకోవాలట… ఏం చేయాలి..? ఆ వెగటు కంపు నోటికి నీరాజనాలు పలకాలా..? బాహుబలి వంటి డొల్ల సినిమాలకు ప్రోత్సాహం ఇచ్చి, సినిమాల్ని స్థూలంగా చెడగొట్టినందుకు అర్జెంటుగా ఓ భారతరత్న ఇవ్వాలా..?

ఏది చూడాలో, ఏది చూడకూడదో హిందీ ప్రేక్షకుడికి తెలియదా..? ఇవ్వాళ బుడ్డ హీరో నిఖిల్ తీసిన కార్తికేయను నెత్తిన మోసినవాడే అంతటి ప్రభాస్ తీసిన రాధేశ్యామ్‌ను ఎడమకాలితో తన్నేశాడు… వాడి ఇష్టం… వాడి డబ్బు… రేప్పొద్దున నీ లైగర్ కూడా అంతే… మరీ రణబీర్‌లాగా బరిబాతల ఫోజులు పెట్టకుండా, ఏవో పూలతో కవర్ చేసుకున్నవ్… సినిమా బాగుంటే వోకే… లేకపోతే ఈ కరణ్ జోహార్, ఈ అమీర్ ఖాన్‌లకు నీ మద్దతు వ్యాఖ్యలు గనుక బెడిసికొట్టాయో… ఆ డిజాస్టర్ తట్టుకోగలవా..? యాటిట్యూడ్ అన్నివేళలా కిరీటాలు పెట్టదు… కొన్నిసార్లు ఈడ్చి తన్నే ప్రమాదముంది… సో, మైండ్ యువర్ టంగ్ మై డియర్ రౌడీ హీరో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions