.
Shiva Prasad
… ఇప్పుడేం చేయాలి…
ఇప్పటిదాకా స్థూలంగా వినిపిస్తున్న అభిప్రాయాలు…
1.కేసిఆర్ ని జనం శిక్షించేసారు.
2.మళ్ళీ కేసులు, అరెస్టులు రేవంత్ కే నష్టం.
3.అరెస్టయి జైలుకెళ్లిన వాళ్లందరూ మళ్లీ అధికారంలోకి వచ్చారు.
(ఇందిరా గాంధీ మొదలుకుని, జగన్, రేవంత్, చంద్రబాబు వరకు)
4.కక్ష సాధించడం మానేసి రేవంత్ పాలనపై దృష్టిపెట్టాలి.
Ads
కేసిఆర్ కుటుంబం దగ్గర జీతానికో.
“గీతానికో” పనిచేసే వాళ్లు (జర్నలిస్టులు?)
ఈ మాటలంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.
కానీ స్వతంత్రంగా, తటస్థంగా వుండే ఆలోచనాపరులు
కూడా ఇదే అభిప్రాయాల్నివ్యక్తం చేయడం
ఆశ్చర్యం అనిపించింది.
అసలు రేవంత్ రాజకీయ భవిష్యత్తు గురించి
జర్నలిస్టులెందుకు ఎందుకు ఆలోచించాలి?
ప్రభుత్వంగా చేయాల్సిన పని చేయాలని అడగాలి కదా?
ఒకవేళ కేసిఆర్ కుటుంబంలో ఎవర్నీ అరెస్టు చేయకపోతే,
రేవంత్ మళ్ళీ గెలుస్తాడని గ్యారంటే ఏమైనా వుందా?
కాంగ్రెస్ గ్రాఫ్ ఇప్పుడెలా వుందో అందరికీ తెలుసు…
ఇప్పుడున్న యూరియా కరువు ఎన్నికల ముందొచ్చినా..
ఇప్పుడు పడిన వర్షాలు ఎన్నికల ముందు పడకపోయినా..
ఫలితాలు ఎలా తారుమారవుతాయో చెప్పక్కర్లేదు
ఒక్క నల్గొండ రెడ్ల హెలికాప్టర్ షికార్లు చాలు..
ఖమ్మం పొద్దుతిరుగుడు రెడ్డి అక్రమార్జన చాలు..
రేవంత్ సర్కార్ పై జనం తిరగబడడానికి..
ఇవన్నీ జరగకుండా చూసుకోవాల్సిన బాద్యత
మళ్లీ ఎలా గెలవాలని ఆలోచించుకోవాల్సిన అగత్యం
రేవంత్ కి వుండాలి
మధ్యలో జర్నలిస్టులకు ఎందుకు?
జర్నలిస్టుగా నేను కోరుకునేది ఒకటే.
ప్రజాధనంతో అవినీతికి పాల్పడ్డవాడికి
చట్టప్రకారం శిక్షపడాలి
కనీసం ప్రభుత్వాలు ఆ ప్రయత్నమైనా చేయాలి.
ఇవాళ రేవంత్ సర్కార్ లో ఇలాంటి అవినీతి జరిగితే
తర్వాత వచ్చే ఏ ప్రభుత్వమైనా అది నిగ్గుతేల్చాలి.
అది కక్ష సాధింపు అనుకున్నా పరవాలేదు.
కాళేశ్వరం నుంచి ధరణి వరకు
ఈ కార్ రేసింగ్ నుంచి ఔటర్ టోల్ స్కామ్ వరకు
కేసిఆర్ ప్రభుత్వంపై వచ్చిన ప్రతి ఆరోపణా
నిజమో కాదో తేలాల్సిందే.
అందుకు చట్టపరంగా ఏమేం జరగాలో
అవన్నీ జరగాల్సిందే.
అంతేకానీ, ప్రజలు శిక్షించారు కాబట్టీ
చట్టం శిక్షించక్కర్లేదనే వాదనేంటో అర్ధం కాదు.
రేవంత్ సర్కార్ కి ప్రజలేం తిరుగులేని విజయాన్ని ఇవ్వలేదు
రెండు జిల్లల్లో నాలుగు సీట్లు తారుమారై వుంటే
తమ్మిని బిమ్మిని చేసైనా
మళ్ళీ కేసిఆర్ ముఖ్యమంత్రి అయుండేవాడు…
అప్పుడు ప్రజలే క్షమించేసారు కనుక
కేసిఆర్ ఏ తప్పు చేయాలేదని తీర్మానంచేయాలా?
ప్రజాతీర్పు వేరు,
న్యాయస్థానాల తీర్పు వేరు కాదా?
అధికారం వున్నన్నాళ్ళు ఎంత అవినీతికి పాల్పడినా,
ఒక్క ఎన్నికల ఓటమి పాప ప్రక్షాళన అయిపోతుందా?
ఒక్క గెలుపుతో బారాఖూన్ మాఫ్ అందామా?
పోన్లే పాపమనేది చట్టబద్ధ పాలన అవుతుందా?
ఇక ప్రజాపాలన అంటారా?
దానికీ ఈ కేసులకీ సంబంధంలేదు
కేసులు, అరెస్టులు, విచారణ
సంక్షేమం, అభివృద్ధి, వగైరా
ఇవన్నీ సమాంతరంగా సాగొచ్చు.
సాగాలి కూడా.
కేవలం రాజకీయనేతలపై కేసులకు మీడియా కవరేజి ఎక్కువుంటుంది.
కానీ, రోజూ ఎన్నెన్నో కేసులు, ఎన్నెన్నో దర్యాప్తులూ
జరుగుతూనే వుంటాయి.
అవేవీ పాలనకి అడ్డం కానప్పుడు
ఒక కేటిఆర్ మీద కేసు
మరో కేసిఆర్ మీద కేసు
ఎందుకు అడ్డమవుతాయి.
అసలు చట్టాలు, శిక్షల భయం లేనప్పుడు
ఒక అయిదేళ్ళు కళ్లు మూసుకుంటే
మళ్ళీ అధికారంలోకి రావచ్చనే ధీమా పెరగదా?
అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వేల కోట్లు దోచుకునే
అరాచకానికి అడ్డుంటుందా?
అధికారం అడ్డుపెట్టుకుని కళ్ళముందు నేతలు
కోటీశ్వరులైపోతుంటే,
రాజకీయ ప్రయోజనాల కోసం
తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేతులు ముడుచుకుంటే,
ఇక జనమే చట్టాన్ని చేతిలోకి తీసుకునే రోజు …
పొరుగు దేశాల్లాగా నేతలపై తిరగబడే తరిమికొట్టే ప్రమాదం
ఎంతో దూరం లో వుండవు…
Share this Article