Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం టీబీజేపీ… కక్కలేక, మింగలేక… వంకర దారులు, వక్ర బాష్యాలు…

December 3, 2025 by M S R

.

మరీ ఎక్కువ గతంలోకి వద్దులే… కేసీయార్ అనబడిన ఓ భీకర, బీభత్స హిందువు పరిపాలన కాలంలోకి వెళ్దాం…. శుక్రమహర్దశ నడుస్తున్నప్పుడు కన్నూమిన్నూ కానరావు కదా… పైగా మజ్లిస్ ఆత్మతో పాలిస్తున్న దౌర్భాగ్య కాలమాయె…

హిందూగాళ్లు, బొందుగాళ్లు అని హూంకరించిన దొరవారు ఏమన్నాడు తరువాత..? రామజన్మభూమి, రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని కొక్కిరించాడు… తన విధేయ క్షుద్ర రాక్షసగణం అయోధ్య చందాలనూ అడ్డుకుంది…

Ads

సోకాల్డ్ శుష్క మేధస్సులు కూడా భద్రాచలాన్ని, అయోధ్యను పోల్చాయి… అక్కడికి దొరవారు ఏదో భద్రాచలాన్ని ఉద్ధరించినట్టు..! కల్యాణానికీ ఎగ్గొట్టి, మనవడితో తలంబ్రాలు పంపించిన రాజరికం ఆ కాలం… ఇప్పుడంటే ఫామ్ హౌజు కదల్లేని కానికాలం… శిక్షాకాలం… కానీ తన అనుచరగణం ఏమంటోంది..? కాదు, కాదు, అనుచర స్నేహగణం… అనగా తెలంగాణ బీజేపీ…

‘‘ఏయ్, రేవంత్ రెడ్డి హిందువుల్ని అవమానించాడు, వాటీజ్ దిస్, నాన్సెన్స్’’ అని ఘీంకరిస్తోంది… అసలు కిషన్‌రెడ్డి ఘీంకారమే పెద్ద ఐరనీ… అప్పట్లో అయోధ్య చందాలు, కేసీయార్ వ్యాఖ్యల సమయంలో నోరు ఎత్తలేదు… విశ్వాసప్రకటన… ఎందుకో, రాజీ ఏమిటో నాకు తెలియదు… కానీ..?

ఇప్పుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలట, హిందూ ద్రోహమట… మరి కేసీయార్ పాదాల మీద పార్టీని తాకట్టు పెట్టినప్పుడు ఏమైందట..?! తెలంగాణ దిష్టి అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ఈ వీర తెలంగాణ ప్రేమికుల స్పందన ఏది అసలు..?!

tbjp

అవును, సమాజంలోని రకరకాల వ్యక్తులు ఇష్టపడే రకరకాల దేవుళ్లున్నారు… కాకపోతే రేవంత్ రెడ్డి నోటితీట తెలిసిందే కదా… ఆ  నాలుకకు హద్దూఅదుపూ ఉండదు… కానీ ఆ వ్యాఖ్యల్లో కించపరచడం అనే ఉద్దేశం లేదు…

అది ఓ పవన్ కల్యాణ్ బాపతు వాచాలత కాదు… తెలంగాణ ద్వేషం కాదు… కేసీయార్ మార్క్ హిందూ వ్యతిరేక పెడపోకడలు కాదు… ఇప్పుడు అంటకాగి ఊరేగుతున్న ఇదే చంద్రబాబు మోడీ భాార్యను కూడా బజారుకు లాగి దుష్ట వ్యాఖ్యలు చేశాడు కదా… అప్పుడేమైంది ఈ తెంపరి టెంపర్‌మెంట్… నిజం ఇలాగే నిష్ఠురంగా ఉంటుంది సోకాల్డ్ తెలంగాణ బీజేపీ నోమోర్ వెన్నెముక లీడర్స్..!!

tbjp

నిజాయితీ ఉంటే… ధూర్త దిష్టి వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ మీద స్పందనలు ఏవి..? భయమా, భక్తా… భయంతో కూడిన భక్తి వల్ల కలిగిన అనురాగమా..? అందుకే తెలంగాణలో బీజేపీకి ఈ దురవస్థ… మొన్నటి జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక బాపతు ఘోర పరాభవం..!! ఆత్మవిమర్శ, మథనం అవసరం అధ్యక్షా..!!

డిఫాక్టో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఏమాత్రం కాస్త విజ్ఞత, కాస్త వివేచన, కాస్త ఏం జరుగుతున్నదో తెలుసుకునే విషయగ్రాహ్యత ఉంటే… ఫాఫం, టీబీజేపీకి ఈ దురవస్థ ఉండేది కాదు… కేసీయార్ ట్రాప్ నుంచి ఈరోజుకూ బయటపడే ఈ దుస్థితి కొనసాగేది కాదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వృషభ..! పునర్జన్మల్లోనూ వెంటాడే శాపాలు… జనం మెచ్చని ఓ సోది స్టోరీ..!!
  • ఎవరు ఈ తారిక్ రెహమాన్..! బంగ్లాదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్..!!
  • వైష్ణవీ శర్మ..? ఎందుకంత జనం ఆసక్తి…?! తెగ వెతికేస్తున్నారు..!
  • పరుచూరి బ్రదర్స్ చెప్పి ఉండాల్సింది… సినీరంగ నైజం చెప్పనివ్వదు…
  • రాముడు కృష్ణుడు అనగానే ఎన్టీయార్ గుర్తొచ్చినట్టు… క్రీస్తు అనగానే…!!
  • బుక్ ఫెయిర్ సందర్భం చూసి మరీ వదిలినట్టుంది యండమూరి ఈ పోస్టు..!!
  • మెప్పించావు దర్శకా..! చాలా క్లిష్టమైన ప్రయోగాన్ని ఛేదించావుపో…!!
  • రోషన్… హీరో మెటీరియలే…! కానీ ఈ పాత్ర మోయలేనంత బరువు..!!
  • ‘మగ శివాజీ’ లీడ్ రోల్… దండోరా ఓ మంచి ప్రయత్నమే… కానీ..?!
  • ఈషా (Eesha) – ఈ దెయ్యం భయపెట్టలేదు… చిరాకెత్తించింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions