.
ముఖచిత్రం చూశారు కదా… అది రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పక్కనే సీఎం రేవంత్, మరికొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలు… బాగా చూడండి, ఫోటోలో వైఎస్ ఆత్మ కేవీపీ కూడా ఉన్నాడు…
వైఎస్ తరువాత ఏమయ్యాడు..? జగన్ నమ్మలేదు… కారణాలు ఆర్థికం.., హార్దికం కాదు… వైఎస్ బినామీ ఆస్తుల వ్యవహారంలో జగన్ నమ్మలేకపోవచ్చు… రాష్ట్ర విభజనవేళ పార్లమెంటులో సమైక్య బ్యానర్ పట్టుకుని స్థంభంలా నిలబడ్డ సీన్లు గుర్తున్నాయి…
Ads
తరువాత..? చంద్రబాబుకు తను అక్కర్లేదు, జగన్‌కు పనికిరాడు… కానీ కేసీయార్‌కు తన సామాజికకోణంలో ఆప్తుడయ్యాడని అంటారు… 75 ఏళ్లు… స్టిల్ యాక్టివ్… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కదా… వచ్చాడు, ఖర్గే దగ్గర హాజరు వేయించుకున్నాడు… స్టిల్ కాంగ్రెస్ మనిషే కదా మరి… రేవంత్ రెడ్డి తనను నమ్ముతున్నాడా..? ఏమోలే… షర్మిల ఏపీసీసీ అధ్యక్ష పదవి, కాంగ్రెస్‌లో చేరిక విషయంలో కేవీపీ చక్రం ఏమైనా తిప్పాడా..? సరే, తనను కాస్త వదిలేస్తే…
రోశయ్యకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం గురించి ప్రశంసించాలి… ఎస్, రోశయ్య నిండు మనిషి, గుంభనం మనిషి… అన్నింటికీ మించి 1000 శాతం పార్టీ కమిటెడ్ కాంగ్రెస్‌వాది… ఎవరెవరు పార్టీలోకి వస్తున్నా, పోతున్నా… పదవులు వస్తున్నా పోతున్నా పార్టీనే అంటిపెట్టుకున్న సిన్సియర్ కాంగ్రెస్‌వాది…
వాక్చాతుర్యం, బ్యాలెన్స్ వంటి సత్లక్షణాల మాటెలా ఉన్నా… తను సీఎం కావడం యాదృచ్ఛికం… తరువాత గవర్నర్ కావడం ఓ కంటితుడుపు… కానీ తను పర్‌ఫెక్ట్ ఆర్థిక మంత్రి… సీఎం ఎవరున్నా సరే, వ్యతిరేకించక, వారి విధానాలకు తగినట్టు ఫైనాన్స్ వ్యవహారాల్ని మేనేజ్ చేసిన సమర్థుడు… అయితే..?
కొన్ని పోస్టులు కనిపించాయి… పొట్టి శ్రీరాములు రాష్ట్ర విభజనకు ఆత్మార్పణ చేశాడు, తను వోకే గానీ రోశయ్య తెలంగాణకు ఏం చేశాడు..? ఎందుకు గౌరవించాలి అని…! కుతర్కం అంటారు దీన్నే… ట్యాంక్ బండ్ మీదున్న బోలెడు విగ్రహాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆంధ్రా నాయకులు ఏం చేశారు తెలంగాణకు..? ఎన్టీయార్, వైఎస్ సహా…
తెలంగాణ జనం ఎందుకు గుర్తుంచుకోవాలి..? ఎస్, రోశయ్య క్రౌడ్ పుల్లర్ కాకపోవచ్చు, సోకాల్డ్ వైఎస్, ఎన్టీయార్ ఛరిష్మా లేకపోవచ్చు… కానీ తను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి… తను కూర్చోవాల్సిన కుర్చీలో తను కూర్చున్నాడని, ఓదార్పు యాత్రలకు బ్రేక్ వేశాడనీ, కేసులు, అరెస్టులకు కారకుడనీ జగన్‌కు కోపం ఉండవచ్చు, కానీ అది సోనియా చేసింది తప్ప ఫాఫం రోశయ్య చెప్పింది చేశాడు తప్ప జగన్ మీద కూడా ప్రత్యేకంగా కోపం లేదు తనకు… సో, జగన్ పట్టించుకోలేదు తనను…
చంద్రబాబు ఎలాగూ పట్టించుకోడు, ప్రత్యర్థి పార్టీ కాబట్టి… తమవాడు కాదు కాబట్టి… కేసీయార్‌కు అస్సలు పట్టదు… సో, రేవంత్ రెడ్డి తన పార్టీ సీనియర్‌ను గౌరవిస్తే ఎవరికైనా ఎందుకు అభ్యంతరాలు ఉండాలి…? కువిమర్శలు దేనికి..?
నిజానికి రోశయ్యను వైశ్య సమాజం ఓన్ చేసుకుంది గానీ తనెప్పుడూ పెద్దగా కులనేతగా ఏ గుర్తింపూ లేదు, కులాన్ని తనెప్పుడూ ఓన్ చేసుకోలేదు, అంతెందుకు మరణించాక సోకాల్డ్ ఆర్య వైశ్య మహాసభకే పెద్దగా పట్టలేదు, అప్పటిదాకా ఆయన పేరు చెప్పుకున్న వైశ్య నేతలు కూడా కనిపించకపోవడం పెద్ద ఎత్తున వైశ్య సమాజంలోనే విమర్శలకు గురైంది…
ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోశయ్య విగ్రహం పెట్టి, తనను గౌరవించిందో ఇప్పుడిక అనేకచోట్ల వైశ్య సంఘాలు ఆయన జయంతిని జరుపుకుంటున్నాయి, గుడ్… అయితే పొట్టి శ్రీరాములు విషయానికి వస్తే, తనకు తెలంగాణకూ సంబంధం లేదు… ఆయన ఆత్మార్పణ చేసిందీ మద్రాస్ నుంచి ఆంధ్రా విముక్తికి మాత్రమే… అప్పటికి తెలంగాణ స్టేట్ వేరు, ఏపీతో ఏ సంబంధమూ లేదు…
సో, పొట్టి శ్రీరాములు గానీ, రోశయ్య గానీ… తమ సామాజికవర్గంలో ప్రఖ్యాతి పొందారు కాబట్టి వైశ్య సమాజం ఓన్ చేసుకుంటున్నదే తప్ప… నిజానికి తెలంగాణ కోసం గానీ, కులం కోసం గానీ వాళ్లు చేసిందేమీ లేదు… నిజం కదా, నిష్ఠురంగానే ఉంటుంది… కానీ నిజం నిజమే..!! కులం విషయంలో ఒక్కసారి కేవీపీని, రోశయ్యను పోల్చి చూడండి ఓసారి..!! సో, ప్యూర్ కాంగ్రెస్ గాకపోయినా సరే రేవంత్ రెడ్డి రోశయ్యను గౌరవించడాన్ని మాత్రం ఖచ్చితంగా అభినందించాలి కదా…!!
Share this Article