ఏదైనా చిన్న తీగె దొరికితే చాలు…. పీకిపీకి పెంట చేయడమే…! కేరళలో క్రిస్టియానిటీ చాలా ఎక్కువ తెలుసు కదా… రెండు పెద్ద చర్చిలున్నయ్… మలంకర అర్దోడాక్స్ ఒకటి, మరొకటి జాకోబియన్ సిరియన్… ఒక్క జాకోబియన్ చర్చి పరిధిలో కేరళలోనే దాదాపు వెయ్యి చర్చిలు, వేల కోట్ల ఆస్తులున్నయ్… దీన్నుంచి అప్పుడెప్పుడో… 1934లో మలంకర గ్రూపు విడిపోయింది… అప్పట్నుంచీ చర్చిలపై, ఆస్తులపై తగాదాలు నడుస్తూ ఉన్నయ్… ఇదీ అసలు కథ…
అన్ని వివాదాలను కోర్టులు, స్థానిక పెద్ద మనుషులు పరిష్కరించలేవు… ప్రత్యేకించి మతాలకు సంబంధించిన ఇష్యూల్లో కోర్టులు వేళ్లు పెట్టడమే కరెక్టు కాదు… కానీ ఇండియా కదా, పలు మతసంబంధ అంశాల్లో వేళ్లు పెట్టి, తమకు పెద్ద మతజ్ఞానం ఉన్నట్టుగా న్యాయమూర్తులు ఎడాపెడా ఇష్టారాజ్యం తీర్పులు ఇచ్చేసి పెంట పెడుతుంటారు, అది వేరే కథ…
Ads
ఇక్కడ కేరళ చర్చిల విషయానికొస్తే… ఆ రెండు గ్రూపులూ కలిసి పనిచేయాలంటూ 2017లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది… అసలు అలా కలిసి పనిచేసే స్థితి లేకనే కదా కోర్టు దాకా వచ్చింది..? సరే, ఇప్పుడు ఆ తీర్పు లోతుల్లోకి వెళ్లడం ఎందుకులే గానీ… సమస్య కేరళ సీఎం దర్బారులోకి వచ్చింది…
సాధారణంగా ఎక్కడా తెగని పంచాయితీలు రాజు గారి దగ్గరకు వస్తాయి కదా… రాజ్యాధికారం అంటే అంతేగా… కేరళ సీఎం పినరై విజయన్ ఏదో ప్రయత్నించాడు… కానీ కుదరలేదు… మరి రాజు గారికి చేతకానిది చక్రవర్తి దగ్గరకు పోవాలి కదా… అలా హస్తిన చేరింది… మోడీ ఆ రెండు వర్గాలతోనూ మాట్లాడుతున్నాడు… సోమ, మంగళవారాల్లో తనే స్వయంగా పంచాయితీ విన్నాడు… వందేళ్ల పంచాయితీ అంత తేలికగా తెగదు కదా… తెగడం లేదు…
ఇక్కడ విషయం ఏమిటంటే..? కొన్ని మీడియా సంస్థలు అప్పుడే మొదలుపెట్టేశాయి… ఆయ్ఁ మా లెఫ్ట్ విజయన్ విఫలమైన తగాదాను పొరపాటున మోడీ పరిష్కరిస్తాడేమో, తనకు పేరు వస్తుందేమో, ఈ చర్చిలు మోడీ పట్ల ద్వేషభావాన్ని తగ్గించుకుంటాయేమో అని భయపడినట్టుగా… వెంటనే స్టార్ట్ చేశాయి…
‘‘చూశారా, చూశారా, ఈ మోడీ అప్పుడే కేరళలో స్టార్ట్ చేశాడు… హిందూ సంఘటన వర్కవుట్ కావడం లేదు కాబట్టి ఇక క్రైస్తవుల మద్దతు పొందే ఎత్తుగడల్లో పడ్డాడు…’’ ఇదీ ఆ వార్తల తీరు… అసలు పంచాయితీ పరిష్కారానికి అప్రోచ్ అయ్యిందే చర్చిలు… సుప్రీం, కేరళ సర్కారు స్థాయిలో ఓ పరిష్కారం దొరకలేదు కాబట్టి, దేశానికి పాలకస్థానంలో మోడీ ఉన్నాడు కాబట్టి అప్రోచయ్యారు… అందులో మోడీ చేసిన ప్లాన్, కుట్ర, ఎత్తుగడ ఏమున్నయ్..? ఐనా ఒక హిందుత్వ కఠోర ప్రతినిధిగా ముద్రపడిన మోడీ నిజంగానే వేల చర్చిలకు సంబంధించిన తగాదాను సామరస్యంగా పరిష్కరిస్తే, ఏ దురుద్దేశానికి పోకుండా సయోధ్యను కుదిరించగలిగితే స్వాగతించాలి కదా… మోడీ ఈ తగాదా తేల్చేయడంలో సక్సెస్ అయినా సరే, కాకపోయినా సరే ఆ ప్రయత్నం మంచిదే కదా… కేరళ సీఎం చేసిందీ ఆ ప్రయత్నమే కదా… సీపీఎం చేస్తే సూపర్, బీజేపీ చేస్తే బ్లండరా..? పొలిటికల్ స్ట్రాటజీయా..? ఏం దొరికారురా తండ్రీ…
Share this Article