అబ్బబ్బ… ఎంతసేపూ లాక్ డౌన్, వేక్సిన్లు, రెమ్డెసివర్లు, ఆక్సిజన్, శ్మశానాలు, రాజకీయాల గొడవేనా..? కాస్త పక్కకెళ్దాం… దిగువ ఓ ఫోటో ఉంది చూడండి… ఇది సుడిగాలి సుధీర్ జబర్దస్త్ టీం… అందులోనే గెటప్ సీను, ఆటో రాంప్రసాద్, సన్నీ ఉంటారు… పేరుకు సుధీర్ టీం లీడర్… కానీ ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ఈక్వల్… సన్నీ కాస్త వీక్… రాంప్రసాద్ స్క్రిప్టులు రాసేస్తాడు… గెటప్ శ్రీను ఓ కొత్త గెటప్ ట్రై చేస్తాడు, జీవించేస్తాడు… సుధీర్ సంగతి సరేసరి… అయితే అది కాదు చెప్పుకోదగింది… కొన్నిసార్లు విసిగిస్తారు, ఇంకొన్నిసార్లు నవ్విస్తారు, అది వేరే సంగతి… కానీ ఈ నలుగురూ ఎనిమిదేళ్లుగా దోస్తులు… ఒకే టీంగా కలిసి సాగుతున్నారు… లోలోపల కొట్టుకున్నారో, తిట్టుకున్నారో, తన్నుకున్నారో… ఏమీ లేనప్పుడు తిన్నారో, ఆకలితో పడుకున్నారో… ఎట్లా బతికారో… ఈరోజుకూ అలాగే కలిసి ఉన్నారు… అదీ ముచ్చటైన విశేషం… టీముల్లో ఎవరో కొత్తవాళ్తు వస్తుంటారు, కొందరు విడిపోతుంటారు… విభేదాలు వస్తుంటయ్… కానీ వీళ్లు చాలా బెటర్… ఏదో ఓ ఆత్మీయ బంధం వాళ్లను విడిపోనివ్వలేదు… చివరకు త్రీమంకీస్ వంటి సినిమా కూడా ముగ్గురూ కలిసే చేశారు… కానీ…?
ఈమధ్య కొన్ని సైట్లలో ఓ వార్త కనిపించింది… ఏమనీ అంటే..? ‘‘గెటప్ శ్రీను ఇప్పుడు సుధీర్ స్కిట్లలో కనిపించడం లేదు… వాళ్ల నడుమ బేధాభిప్రాయాలు వచ్చాయి… సుధీర్ ఒకవైపు సోలో హీరోగా, ఎక్కువ రెమ్యునరేషన్‌తో ఓ సినిమా కోసం ట్రై చేస్తుంటే… గెటప్ శ్రీను ముగ్గురికీ కలిపి మరో సినిమాకు కమిటయ్యాడు… దాంతో సుధీర్‌కు కోపమొచ్చింది… మాటామాటా పెరిగింది… శ్రీను ఇక రావడం లేదు…’’ ఇదీ వార్త సారాంశం… నిజంగానే గెటప్ శ్రీను చాలారోజులుగా ఏ స్కిట్లలోనూ లేడు… శ్రీదేవి డ్రామా కంపెనీలో లేడు… స్పెషల్ షోలలోనూ కనిపించడం లేదు… నిజంగా ఏమైంది తనకు..? ఈ వార్త నిజమేనా..? సుధీర్, రాంప్రసాద్‌ను అడక్కుండా శ్రీను ఒక సినిమాకు కమిటవుతాడా..? ఇలాంటి తత్వాలు అయితే ఎనిమిదేళ్లుగా కలిసి ఉండేవాళ్లేనా..? డౌటొచ్చింది… తీరా ఆరా తీస్తే…
Ads
గెటప్ శ్రీను చాలారోజులుగా షూటింగులకు రావడం లేదన్నది నిజమే… ఎందుకంటే..? కరోనా భయం… ఇంట్లో పిల్లలున్నారు… ఈ వైరస్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరో ఒకరికి సోకుతూనే ఉంది… అందుకని రెండు డోసులూ పూర్తయ్యాక షూటింగులకు వస్తాను… వచ్చే నెల నుంచి మళ్లీ యథాతథంగా వర్క్‌లో మునిగిపోతాను అని చెబుతున్నాడట… నెల రోజులుగా అందుకే దూరం ఉన్నాడట… మరి సుధీర్‌తో విభేదాలు, తగాదాలు, ఈ వార్తలు గట్రా ఏమిటట..? భలేవారే… నలుగురిలో ముగ్గురు కనిపిస్తూ ఒకరు కనిపించకపోతే విశేషమేగా… ఏదో రాసేసుకోవడమే… అసలే వీళ్లు కాస్త పాపులర్ ఆర్టిస్టులు కదా…! రీడబులిటీ ఉంటుంది మరి…! అబ్బే, మరీ చిన్నాచితకా సైట్లలో కాదు సార్, పెద్ద సైటు రాసినట్టుంది అంటారా..? హహహ… ఇలాంటివి పెద్ద సైట్లలోనే ఎక్కువగా వస్తున్నయ్… లైట్ తీసుకో…!!
Share this Article