ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది… ఆచార్య అట్టర్ ఫ్లాప్ కదా… గాడ్ ఫాదర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కదా… కానీ ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే గాడ్ ఫాదర్ కలెక్షన్లు డిజాస్టర్ ఆచార్య కలెక్షన్లకన్నా తక్కువ అట… ఎవరో చెప్పినట్టు… రెండుమూడు రోజులు గడిస్తే గానీ ఏ సినిమా పరిస్థితి ఏమిటో బయటపడదు… ఇదీ అంతే… నిన్న గాడ్ ఫాదర్ యాక్యుపెన్సీ కొన్నిచోట్ల బాగాలేదని కొన్ని సైట్లు వార్తలు రాస్తే చిరంజీవి ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు… మరి నిజం ఏమిటి..?
గాడ్ ఫాదర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలూ కలిపి 21.4 కోట్ల గ్రాస్ వచ్చిందట… అంటే 12.97 కోట్ల నెట్ షేర్… నైజాంలో 3.29 కోట్లు, సీడెడ్ 3.18 కోట్లు, యూఎస్ 1.26 కోట్లు కలెక్షన్లని ఆ వార్తల సారాంశం… ఆచార్య తొలిరోజు 29.50 కోట్ల షేర్… కానీ గాడ్ ఫాదర్ 12.97 కోట్ల షేర్ మాత్రమే… అయితే ఆచార్యకు కొంత ఎక్కువ హైప్ ఉండింది మొదట్లో… దర్శకుడు కొరటాల శివ కావడం, సినిమాలో రాంచరణ్ కూడా ఉండటం తొలిరోజు కలెక్షన్లను పరుగులు పెట్టించాయి…
గాడ్ ఫాదర్ సినిమాకు సల్మాన్ ఖాన్ ఎంపిక ఏమాత్రం ఉపయోగపడలేదనేది మళ్లీ ఎస్టాబ్లిష్ అవుతోంది… (ఆల్‌రెడీ లాల్‌సింగ్‌చద్దా సినిమాతో చిరంజీవి ఆమీర్ ఖాన్ దెబ్బను రుచిచూశాడు)… సల్మాన్‌తో ఏ ఫాయిదా రాలేదు… సినిమా రెండోరోజు, అంటే గురువారం ఏపీలో కలెక్షన్లు వీక్ అయ్యాయని మరో టాక్… రెండోరోజు కలెక్షన్లు 10 కోట్లకు పడిపోవచ్చునని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి… నిజానికి నిన్నంతా సినిమా మీద పాజిటివ్ టాకే నడిచింది… అయితే… ఆచార్యకన్నా గాడ్ ఫాదర్ కలెక్షన్లు తక్కువగా ఉండటానికి మరో కారణం ఉందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి…
Ads
ఆచార్య సినిమాను భారీ రేట్లకు అమ్మారు… కానీ డిజాస్టర్ అయ్యేసరికి బయ్యర్లు దర్శకుడి ఆఫీసు మీదకు వచ్చి కూర్చున్నారు… మొదటిసారి చిరంజీవి సినిమాకు బయ్యర్లకు ఎంతోకొంత సొమ్మును వాపస్ ఇచ్చారు… ఇది చిరంజీవి ఇమేజీకి దెబ్బ… అందుకని గాడ్ ఫాదర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు…
సినిమాను మొత్తం విక్రయించకుండా… ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో కేవలం అడ్వాన్సులు తీసుకుని విడుదల చేశారుట… అదీ వీలైనంత రీజనబుల్ అడ్వాన్సులు… అందుకే రిలీజ్ నాటికి వచ్చిన అడ్వాన్సులు, నిర్మాణానికి చేసిన ఖర్చుకూ పొంతనే లేదు…. ఐనా సరే, ఇంకోవైపు నాన్-థియేటర్ డబ్బులు రాకపోయినా సరే అలాగే రిలీజ్ చేశారు… పైగా ఆచార్యతో పోలిస్తే గాడ్ ఫాదర్ రిలీజైన థియేటర్ల సంఖ్య చాలా తక్కువ… ఇదీ కావాలనే థియేటర్ల సంఖ్యను తగ్గించారని అంటారు… సో, అలా ఆచార్యతో పోలిస్తే గాడ్ ఫాదర్ కలెక్షన్లు తక్కువగా కనిపిస్తున్నాయి… దీనివల్ల పెద్ద నష్టమేమీ లేదు… శని, ఆదివారాలు దాటితే గాడ్ ఫాదర్ రియల్ స్టామినాపై స్పష్టత రాదు…
Share this Article