.
వై నాట్..? రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీగా తెలంగాణ అభివృద్ధి చెందలేదా..? సంకల్పం, సరైన ప్రణాళిక, తగిన అడుగులు పడితే ఖచ్చితంగా సాధ్యమే… ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఏకంగా 6 ట్రలియన్ల ఎకానమీని టార్గెట్ పెట్టుకున్నాడు…
సంకల్పానికి దరిద్రం దేనికి ఉండాలి..? రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ సందర్భంగా ఓ మాట చెప్పాడు… చైనా ఉత్తర తీర ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సును, దాని రాజదాని గ్వాంగ్‌జౌ… వాటిని ఆదర్శంగా తీసుకుంటున్నామని వివరించాడు… ఎకానమీ వృద్ధికి అదొక మోడల్… సరైన ఉదాహరణ తీసుకున్నాడు…
Ads
వివరాల్లోకి వెళ్తే… ఈ ప్రావిన్స్ మొత్తం వైశాల్యం 179,800 కి.మీ… 127.06 మిలియన్ల జనాభాతో (2023 నాటికి) గ్వాంగ్‌డాంగ్ చైనాలో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ గా పేరుపొందింది… దేశంలో వైశాల్యం ప్రకారం 15వ అతి పెద్ద ప్రావిన్స్..,
దీని ఆర్ధిక వ్యవస్థ చైనాలోని అన్ని ప్రావిన్సుల్లోకెల్లా పెద్దది.., 2024లో జీడీపీ 14.16 ట్రిలియన్ల ( యూఎస్ డాలర్లలో 2.0 ట్రిలియన్లు)తో సాకారం చేసుకుంది… చైనా ప్రధాన భూభాగం స్థూల ఉత్పత్తిలో ఇది దాదాపు
10.5 శాతం…
దీని రాజధాని గ్వాంగ్‌జౌ విషయానికి వద్దాం… చైనా మిగతా నగరాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది… దీనిని గతంలో కాంటన్ (Canton) అని కూడా పిలిచేవారు…
-
శాస్త్ర, సాంకేతిక, విద్యా రంగాల్లో పురోగతి…: గ్వాంగ్‌జౌ హై-టెక్ పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకు (ఉదాహరణకు, సన్ యట్-సెన్ విశ్వవిద్యాలయం) నిలయం…
-
దేశ జీడీపీకి అత్యుత్తమ పాత్ర…: ఇది చైనాలోని నాలుగు టైర్-1 నగరాల్లో ఒకటి (బీజింగ్, షాంఘై, షెన్‌జెన్, గ్వాంగ్‌జౌ)… గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ చైనా జీడీపీలో అత్యధిక వాటాను అందిస్తుంది, అందులో గ్వాంగ్‌జౌ ప్రధాన ఆర్థిక కేంద్రం…
-
దిగుమతి, ఎగుమతుల కేంద్రం (కాంటన్ ఫెయిర్)…: చైనా దిగుమతి- ఎగుమతి ఉత్సవం (China Import and Export Fair).., దీన్ని సాధారణంగా కాంటన్ ఫెయిర్ (Canton Fair) అని పిలుస్తారు… ఇది గ్వాంగ్‌జౌలోనే నిర్వహిస్తారు… ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఉత్సవాలలో ఒకటి…
-
ప్రపంచ దేశాలకు దిక్సూచి (గ్లోబల్ హబ్)..: ఉపాధి, పారిశ్రామికం, టెక్నాలజీ రంగాలలో గ్వాంగ్‌జౌ ఒక ముఖ్యమైన అంతర్జాతీయ వాణిజ్య, రవాణా కేంద్రంగా ఎదిగింది…
ఈ నగరం వైవిధ్య భరితమైన ఆర్ధిక వ్యవస్థను కలిగి ఉంటుంది… దీన్ని పురాతన చైనాకు చెందిన మారిటైమ్ సిల్క్ రోడ్ ప్రారంభ కేంద్రంగా పిలుస్తారు… ఇది విస్తృత శ్రేణి చైనీస్, విదేశీ సంస్థల ఉత్పత్తి సౌకర్యాలు, కార్యాలయాలకు నిలయం… గ్వాంగ్ డాంగ్ దక్షిణాన సరిహద్దుగా ఉన్న హాంకాంగ్ ఆర్థిక కేంద్రానికి సమీపంలో ఉంటుంది… అందుకే ఈ నగరానికి అత్యంత ప్రాధాన్యత…
- సో… రేవంత్ రెడ్డి తెలంగాణ- హైదరాబాద్ అభివృద్ధికి, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ (Global Manufacturing), ట్రేడ్ (Trade), లాజిస్టిక్స్ హబ్ (Logistics Hub) అభివృద్ధి కోసం గ్వాంగ్‌జౌ నమూనాను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు చెప్పుకోవాలి…

.
ఈ గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ ఇతర విశిష్టతలను చెప్పుకుంటే.,. మిగతా చైనాకు కాస్త భిన్నం… ఇలా…
-
అద్భుతమైన వంటకాలు (Cantonese Cuisine)…: గ్వాంగ్ డాంగ్ వంటకాలు (కాంటోనీస్ లేదా యుయ్ వంటకాలు) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి…
-
డిమ్ సమ్ (Dim Sum)…: ఉదయం టీతో తీసుకునే వివిధ రకాల స్నాక్స్ (ఉదాహరణకు, రొయ్యల డుంప్లింగ్స్, పోర్క్ బన్స్) చాలా ఫేమస్…
-
రోస్ట్ గూస్/ రోస్ట్ డక్ (Roast Goose/Roast Duck), వైట్-కట్ చికెన్ (White-Cut Chicken), క్లే పాట్ రైస్ (Clay Pot Rice) వంటివి కూడా ఇక్కడి ప్రత్యేకతలు…
-
ముఖ్యంగా సముద్రపు ఆహారం (Seafood) , బీఫ్ హాట్ పాట్ (Beef Hot Pot) లకు కూడా చాలా ప్రసిద్ధి…
-
-
బలమైన ఆర్థిక వ్యవస్థ (Strong Economy)… ఇది ఉత్పత్తి (Manufacturing), అంతర్జాతీయ వాణిజ్యం (International Trade), హై-టెక్ పరిశ్రమలకు ప్రధాన కేంద్రం…
-
షెన్‌జెన్ (Shenzhen) , గ్వాంగ్‌జౌ (Guangzhou) వంటి ప్రధాన నగరాలు ఈ ఆర్థిక వృద్ధికి కీలక కేంద్రాలు…
-
-
లింగ్నాన్ సంస్కృతి (Lingnan Culture)…: ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన సాంస్కృతిక సంప్రదాయాలు ఉన్నాయి…
-
భాష…: ఇక్కడ ప్రధానంగా కాంటోనీస్ (Cantonese), హక్కా (Hakka) , చావోఝౌ (Chaozhou) వంటి మాండలికాలు మాట్లాడతారు…
-
ఆర్కిటెక్చర్…: లింగ్నాన్ ఆర్కిటెక్చర్, కైపింగ్ డియావోలౌ (Kaiping Diaolou) వంటి భవన నిర్మాణ శైలులు చాలా ప్రత్యేకమైనవి…
-
Share this Article