Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్లాక్ బస్టర్… ఎందుకు హనుమాన్ మూవీ ఈ రేంజులో హిట్టయ్యింది..?!

January 16, 2024 by M S R

అమెరికాలో 3 మిలియన్లు ప్లస్ వసూళ్లు… ఇంకా జోరు… ఒక వార్త… గుంటూరుకారం, సైంధవ, నాసామిరంగ సినిమాల టికెట్లు ఒక ఎత్తు, హనుమాన్ టికెట్లు మరో ఎత్తు… మరో వార్త… దాదాపు 100 సింగిల్ స్క్రీన్లలో హనుమాన్ షోలు… ఇంకో వార్త… నార్త్‌లో దుమ్మురేపుతున్న హనుమాన్… ఇదింకో వార్త… నేడో రేపో వంద కోట్ల క్లబ్బులో హనుమాన్… దాదాపు అన్ని వార్తలూ హనుమాన్ అనే సినిమా విజృంభణను సూచిస్తున్నాయి… ఈ జోరు ఇప్పట్లో ఆగదు…

క్లియర్… సంక్రాంతి పోటీలో హనుమాన్ మాత్రమే డిస్టింక్షన్… గుంటూరుకారం జస్ట్, పాస్… సైంధవ ఫెయిల్… నాసామిరంగ పాసో ఫెయిలో కూడా ఎవరూ చెప్పలేని స్థితి… అయితే నాగార్జున, వెంకటేష్‌లకు పెద్దగా షాకులేమీ కాదు, వాళ్లకు పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఏమీ లేవు… ఆ సినిమాలే సోది రొటీన్ బిల్డప్పులు… నాసామిరంగ ఏదో సౌత్ సినిమాకు టిపికల్ తెలుగీకరణ… అంటే తెలుసుగా, ఒరిజినల్‌కు మన వాసనలన్నీ రుద్దుతాం… అందరూ యాక్షన్ సినిమాలు తీస్తున్నారని వెంకటేష్ వీర వయెలెన్స్ ఆశ్రయించి అడ్డంగా బోల్తాకొట్టాడు…

వీళ్లకన్నా పెద్ద షాక్ మహేశ్‌బాబుకు… భాారీ ఖర్చులు, భారీ ప్రమోషన్లు, భారీ ప్రచారాలు, భారీ తారాగణం ఎట్సెట్రా ప్రేక్షకుడికి అక్కర్లేదు… వాడికి కంటెంటులో దమ్మున్న సినిమా కావాలి… కానీ త్రివిక్రమ్ ఏమిచ్చాడు..? దిక్కుమాలిన కథ… తల్లితో సంబంధం లేదని కొడుకు బాండ్ పేపర్ రాసివ్వడమే సెంట్రల్ పాయింట్ చుట్టూ కథనాన్ని గిరగిరా తిప్పాడు… పైగా మానవాతీత ఫైట్లు, హీరోయిన్‌తో రికార్డింగ్ డాన్సులు, కుర్చీ మడతపెట్టిన వెగటుతనం ఎట్సెట్రా… మాస్ మసాలా అంటే గుంటూరు మిర్చి వ్యాపారి ఎల్లప్పుడూ లుంగీతో, బీడీలు కాల్చుకుంటూ తిరుగుతాడా..?

Ads

హనుమాన్ గొప్ప సినిమా ఏమీ కాదు… అందులోనూ సగటు తెలుగు సినిమా అవలక్షణాలు లేక కాదు… కానీ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు 24 గంటల వ్యవధిలో హనుమాన్ కు బుక్ మై షో లో 3.96 లక్షల టికెట్లు అమ్ముడైతే.. మహేష్ బాబు మూవీ గుంటూరు కారం టికెట్లు లక్షన్నర సేల్ అయ్యాయి. నాగార్జున సినిమా నా సామి రంగకు 96 వేల టిక్కెట్లు.. వెంకటేష్ మూవీ సైంధవ్ కు 47 వేల చొప్పున టిక్కెట్లు తెగాయి. బడ్జెట్, బిజినెస్, స్టార్ కాస్ట్ పరంగా హనుమాన్ కంటే పెద్ద సినిమాలు అయిన గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్ మూడు కలిపినా కూడా టికెట్ల అమ్మకాలు మూడు లక్షలు లోపే ఉన్నాయి. కానీ హనుమాన్ 24 గంటల వ్యవధిలో వీటి కంటే లక్ష టికెట్లు ఎక్కువే సేల్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

మరోవైపు నార్త్‌లో కాంతారా, కేజీఎఫ్, కార్తికేయ-2 వంటి సినిమాలను దాటేసింది జోరు… నార్త్‌లో విజృంభణకు హనుమంతుడు, అయోధ్య టైమింగ్ గట్రా కారణాలు అనుకుందాం… మరి తెలుగులో..? ఆ సినిమాను తొక్కాలని విశ్వప్రయత్నాలు చేసినా సరే, ఆ నిర్మాత గట్టిగా, తిరస్కారంగా నిలబడి ఫైట్ చేయడం… దాన్ని తొక్కాలనుకున్న పెద్దల మాటలు… గుత్తాధిపత్య పోకడల్ని గమనిస్తున్న ప్రేక్షకుడు ఆ మొహాలు పగిలిపోయేలా తీర్పు చెప్పాడు… కావాలనే హనుమాన్ సినిమాకు వెళ్తున్నారు… టాలీవుడ్ మాఫియా ఇజ్జత్ పోగొట్టుకుంది ఇక్కడే…

ఆ మూడు సినిమాల్లో కనిపించే వెకిలితనం లేకపోవడం కూడా హనుమాన్ ప్లస్ పాయింట్… ఎంచక్కా ఫ్యామిలీతో, పిల్లలతో వెళ్లేలా ఉండటం అడ్వాంటేజీ దానికి… అన్నింటికీ మించి ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర వంటి వందల కోట్ల గ్రాఫిక్స్‌తో పోల్చితే, వాటిల్లో పదోవంతు ఖర్చుతో మంచి క్రియేటివ్ గ్రాఫిక్ సీన్లు రూపొందించడం… ప్రత్యేకించి సినిమా క్లైమాక్స్ బాగా కుదిరింది… ఇలా అనేక కారణాలు… గుడ్… ఇకనైనా మన సిండికేట్లు కాస్త సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతారని ఆశిద్దాం… కుర్చీలు మడతపెట్టి ఏదో చేసేట్టు కాదు… కుర్చీల్లో నిమ్మలంగా కూర్చుని సినిమా ఎంజాయ్ చేసేట్టు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘నాకు ఇండియాతో అనుబంధం ఉంది… హైదరాబాద్‌లో వర్క్ హేపీ…’’
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…
  • మీకు తెలుసా..? ఇండియాలో ఫస్ట్ మొబైల్ కాల్ ఎప్పుడు, ఎవరు, ఎవరికి..?!
  • ఈ ట్రంపరి వేషాలతో… నాటి జార్జి ఫెర్నాండెజ్ మళ్లీ గుర్తొస్తున్నాడు…
  • ఆహా… కడుపు పండిన ఓ కొత్త కథ…! 30 ఏళ్ల పిండం ప్రాణం పోసుకుంది..!!
  • హవ్వ… KCR పార్టీ ఫిరాయింపులు, రాజకీయ నైతికతలపై మాట్లాడడమా..?!
  • ట్రంపు దుర్బుద్ది, ఆంక్షల విషం వెనుక ‘అణువార్ హెడ్స్’… పార్ట్-3…
  • పాకిస్థాన్‌లోని ఆ అణు వార్‌హెడ్స్ అమెరికావే… ఎందుకంటే..? (పార్ట్-2)
  • ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న అణు వార్‌హెడ్స్ అమెరికావే..! (Part-1)
  • అల్లు అర్జున్ తొలి సినిమా ఇది… ఇక్కడే పడింది అసలైన పునాది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions