Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వై నాట్… మన సినిమాల్ని నార్త్ మార్కెట్‌లో అమ్మేస్తాం, తప్పేమిటి..?!

March 15, 2025 by M S R

.
విశీ (సాయివంశీ) …. ..‘దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష అయిన హిందీని తమిళ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరహా వాదనలు తప్పు. హిందీ వద్దనుకున్నప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దు మరి! హిందీ భాష వద్దనుకున్నప్పడు, ఆ భాష మాట్లాడే రాష్ట్రాల నుంచి డబ్బులెందుకు ఆశిస్తారు?’ – పవన్‌కల్యాణ్, డిప్యూటీ సీఎం, ఏపీ.

PS: కింది ఫొటో 2017 నాటిది. అదేంటని, ఎందుకని మీరు అడగొద్దు. గప్‌చుప్! త్యాగరాజ కీర్తన పాడాలనిపిస్తోంది.. ‘సమయానికి తగు మాటలాడెనే.. సమయానికి తగు మాటలాడెనే..’

pk

Ads

… ‘నీరా ఔర్ నందా’ అని ఓ హిందీ సినిమా ఉంది. దాన్ని ‘ఆహుతి’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. 1950లో విడుదలైన ఆ సినిమాకు శ్రీశ్రీగారు డబ్బింగ్ మాటలు, పాటలు రాసి వెండితెరకు పరిచయమయ్యారు.

… ఏం లేదు! హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదమవ్వడం 1950 నుంచే ఉందని ఓ చిన్న హింట్!అవును.. మరి హిందీ వాళ్లకు మన సంధులు, సమాసాలు, జాతీయాలు, సామెతలు, లఘువు, గురువు, డుమువులు ప్రథమ విభక్తి.. ఇవన్నీ వచ్చా? మరి, వాళ్ల సినిమా మన భాషలోకి తీసుకొస్తుంటే మన భాష వాళ్లకు కచ్చితంగా వచ్చి ఉండాలి కదా?

ఇది నా మాట కాదు.. పవన్ గారి మాట. తమిళ సినిమాలు హిందీలోకి డబ్బింగ్ చేస్తున్నారు కాబట్టి హిందీ నేర్చుకోవాలంట! ‘ఛావా’ కూడా తెలుగులోకి డబ్బింగ్ అయ్యింది. ఆ సినిమా హీరోకి, దర్శకుడికీ ‘మా తెలుగు తల్లికి’ పాడటం వచ్చా? కనుక్కోవాలి మరి!



ఇదే కాదు… పవన్ కల్యాణ్ హిందీ రుద్దుడు వ్యతిరేక గొంతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు… గతంలో హిందీ గోబ్యాక్, ఇప్పుడు హిందీ సపోర్ట్… ఎందుకు..? ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉన్నాడు కాబట్టి… వీర సనాతన ధర్మపరిరక్షకుడి పాత్ర చేస్తున్నాడు కాబట్టి…

పోనీ, తన అభిప్రాయాలు మారాయి, సిద్ధాంతాలు మారాయి… వోకే… కనీసం తన శాఖ పరిధిలోని కాశినాయన కూల్చివేతల మాట్లాడడేమిటి వీర సనాతన్..?

మరో క్లారిటీ… అవును, తనకు తెలియాలనే… సౌత్ సినిమాల్ని ఖచ్చితంగా హిందీ ప్రాంతాల్లో రిలీజ్ చేస్తారు, సో వాట్..? చూసేవాడు ఎక్కడుంటే అక్కడ రిలీజ్ చేస్తారు, తప్పేముంది..? అది మార్కెట్… మన సరుకును ఎక్కడైనా అమ్ముకుంటాం… అంతేకాదు, ఉత్తర రాష్ట్రాల ప్రజలు ఏ పనికోసం ఇక్కడికి వచ్చినా స్వీకరిస్తాం, పనులు చేయించుకుంటాం, వాడి కడుపు నింపుతాం…

దానికీ హిందీ రుద్దుడుకూ లింకేమిటి అసలు..? ఇన్ని దశాబ్దాల టీడీపీని మనం నిలబెట్టాం అని మాట్లాడితే ఎలా స్వీకరించాలో ఫాఫం చంద్రబాబుకు, లోకేష్‌కు తెలియాలి… కానీ సౌత్ రాష్ట్రాలు ఖచ్చితంగా హిందీ రుద్దుడును వ్యతిరేకిస్తాయి, కించాలి… హిందీ ఏమీ జాతీయ భాష కాదు, అది మన కడుపూ నింపదు… దేశంలోని అనేక భాషల్లో అదొక భాష… దట్సాల్…

మీ హిందీని మేం నేర్చుకుంటాం… సరే, కానీ సౌత్ రాష్ట్రాల్లో ఉపాధి కోసం వస్తున్న వారిలో ఎందరు ఇక్కడి భాషలను నేర్చుకుంటున్నారు..? మాకెందుకు మీ హిందీ..?! హిందీని రుద్దడానికి స్వాతంత్ర్యం వచ్చిన్నాటి నుంచి నార్త్ ప్రయత్నిస్తూనే ఉంది… ఆనాటి నుంచీ తమిళనాడు వ్యతిరేకిస్తూనే ఉంది…

ఇది 1965 నాటి ఒక ఫోటో… రీసెంటుగా కర్నాటక కూడా ప్రతిఘటిస్తోంది… నెక్స్ట్ కేరళ, తెలంగాణ… ఏపీని కొన్నాళ్లు వదిలేయండి… అవునూ, త్రిభాషా సిద్ధాంతం పాటిద్దాం… మాతృభాష, ఇంగ్లిషు, మూడో భాష హిందీయే కావాలని ఏమీ లేదు… నార్త్ స్టేట్స్‌లో తెలుగు కూడా ప్రవేశపెట్టాలి… లేదా జర్మనీ, లేదా మాండరిన్, లేదా ఫ్రెంచ్… వై ఓన్లీ హిందీ..!!

hindi

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
  • విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
  • వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?
  • సత్సంగత్వే నిస్సంగత్వం… పలు భ్రమల్ని బద్దలుకొట్టే ఆత్మవైరాగ్యం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions