.
‘‘రామన్నా, మీ తోబుట్టువుపై ఎవడెవడో అవాకులు చవాకులు పేలుతుంటే… కేరక్టర్ అసాసినేషన్ చేస్తుంటే… ఎందుకు మాట్లాడటం లేదు..? కవితక్కపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై నోరెందుకు మెదపడం లేదు..?’’
…. అని తెలంగాణ జాగృతి సూటిగా కేటీయార్‌ను ప్రశ్నించింది… నిజమే… ఈ ప్రశ్న బీఆర్ఎస్ ఓనర్ కేసీయార్‌కు కూడా వర్తిస్తుంది… కవిత సొంత బిడ్డ, సొంత నెత్తురు… కవిత మీద సాగుతున్న డర్టీ క్యాంపెయిన్ మీద కేసీయార్ సమాధానం ఏమిటి..? సీరియస్ ప్రశ్నే ఇది..,
Ads
రాజకీయాలు వేరు… అన్నాదమ్ముళ్లకు, అన్నాచెల్లెళ్లకు, తండ్రీబిడ్డలకు పడాలని ఏమీ లేదు… రాజకీయాల్లో ఘర్షణలూ సహజం… ఆమెకు పొలిటికల్ యాంబిషన్స్ ఉండటంలో కూడా తప్పులేదు… తండ్రి రాజకీయ వారసత్వాన్ని కోరుకోవడం నేరమేమీ కాదు, అది కుటుంబ ద్రోహం కూడా కాదు… కానీ ఈ డర్టీ క్యాంపెయిన్ ఏమిటి..?
కానీ ఆమెను సాక్షాత్తూ తండ్రే దూరం పెట్టాడు… ఓరకంగా పార్టీ నుంచి వెలివేశాడు… కేటీయార్ కూడా అలాగే ఉంటున్నాడు… కానీ ఎండ్ ఆఫ్ ది డే… కవిత ఓ చెల్లె, ఓ బిడ్డ… అది మరిచిపోతే ఎలా..? ఎవడెవడో ఏదో రాస్తున్నాడు, కూస్తున్నాడు… దాన్ని ఈరోజుకూ కేసీయార్ గానీ, కేటీయార్ గానీ ఖండించలేదు… చివరకు పార్టీకి సంబంధించిన నేతలు పిచ్చి కూతలు కూస్తున్నా సరే అడ్డుకోలేదు… అంటే అందరి కూతలనూ ఎండార్స్ చేస్తున్నట్టా..? దారుణం కాదా..?
కేసీయార్, కేటీయార్ సోషల్ గ్రూపులు చేస్తున్నాయనే విమర్శ కూడా ఉంది… కవితే గతంలో చెప్పింది నామీద అధికార సోషల్ గ్రూపుల్లోనే దుష్ప్రచారం చేస్తున్నా కేటీయార్, కేసీయార్ వారించలేదు అని..! సొంత బిడ్డపై ఏమిటీ విపరీత ధోరణి కేసీయార్..?
ఆమెపై మద్యం స్కాం మరక ఉండొచ్చుగాక… ఆమె ఓవర్ యాంబిషియస్ కావచ్చుగాక… ఐతేనేం, అధినేత కూతురు మీదే ఎవరో ఏదో బురద జల్లుతుంటే… అది పడుతోంది కేసీయార్ కుటుంబంపైనే… అదీ అర్థం కావడం లేదా..? ఆపాల్సిన, ఖండించాల్సిన బాధ్యత లేదా..?
నటి రకుల్ ప్రస్తావన గానీ, సమంత ప్రస్తావన గానీ వస్తున్నప్పుడు నామీద వ్యక్తిగత దాడి జరుగుతోందని కేటీయార్ బాధపడలేదా..? మరిప్పుడు కవిత మీద జరుగుతున్నది కేరక్టర్ అసాసినేషన్ కాదా..?
ఎప్పుడో హరీష్‌రావు సోదరుడితో ఆమెకు పెళ్లి ఖాయమైతే, తరువాత అది వర్కవుట్ కాకపోతే… ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత దాన్ని తెరపైకి తీసుకొచ్చి డిబేట్లు పెట్టాలా..? పార్టీ నేతలు పిచ్చి కూతలు కూయాలా..? పైగా ఆమెకు ఇప్పుడు ఇద్దరు కొడుకులు… పెళ్లీడుకొచ్చిన కొడుకులున్నారు… ఆమెపై సాగే డర్టీ క్యాంపెయిన్‌ను అడ్డుకోకుండా, ఖండించకుండా ఉన్న పార్టీ ముఖ్యులకు బిడ్డలు లేరా..?
ఎస్, తెలంగాణ సమాజం ఇలాగే భావిస్తుంది… చివరగా… అయుత చండీయాగాలు, గణపతి హోమాలు, సుదర్శన పూజలు, రాజశ్యామల అర్చనలు… ఎన్ని చేసినా సరే… బిడ్డ కన్నీళ్లు పడిన ఇంట అవేవీ ఫలించవు… 80 వేల పుస్తకాల సారాంశమూ అదే… ఆమె నీ కన్నకూతురు, ఏదైనా జరిగితే మీద పడి ఏడ్చేదీ ఆమె… రాజకీయానికీ రక్తానికీ నడుమ గీతను గౌరవించాలి… అదే సరైన పెద్దరికం..!!
Share this Article