‘‘పగటిపూట భేటీ అయితే, మీరు తొడపాశం పెడితే, చింతబరిగెలతో నాలుగు పీకితే, వాతలు పెడితే అందరికీ తెలిసిపోతుంది అని జగన్ ప్రాథేయపడటంతో…. సర్లె అనుకుని అమిత్ షా రాత్రి పదిగంటలకు అపాయింట్మెంట్ ఇచ్చాడు… రాజ్యాంగ వ్యవస్థల జోలికి పోవద్దు అంటే విన్నావా..? ఏదో చెప్పావు కదా అని ఆయన్ని ఈశాన్యానికి పంపించేశాం, అయినా తృప్తి లేదా..? చెప్పు, నిమ్మగడ్డ జోలికి వెళ్తావా..? అంటూ చెడామడా తిట్టేశాడు… సార్, సార్, ఈసారికి తప్పుకాయండి ప్లీజ్ అని జగన్ బతిమిలాడాడు… ఐనా అమిత్ షా ఆగ్రహం చల్లారలేదు…’’……….. రేప్పొద్దున ఏదైనా ప్రముఖ తెలుగు దినపత్రికలో ఇలాంటి స్టోరీ వస్తే లైట్ తీసుకొండి… ఆ దినపత్రిక అలాగే రాస్తుంది, రాయగలదు… మరి సంప్రదాయిక రిపోర్టింగ్ ఏం చెబుతుంది..?
‘‘పోలవరం డబ్బులు అడిగాడు, ప్రత్యేక హోదా అడిగాడు, రెవిన్యూ లోటు భర్తీ చేయమన్నాడు, గుళ్లపై దాడుల విషయంలో నా తప్పేమీ లేదని వివరణ ఇచ్చుకున్నాడు, క్రిస్టియానిటీని వ్యాప్తి చేయడం లేదని చెప్పుకున్నాడు, పెండింగ్ విభజన సమస్యలు ప్రస్తావించాడు, సంగమేశ్వరం లిఫ్టు కొత్తది కాదని వివరణ ఇచ్చాడు…’’….. ఎట్సెట్రా… ఎవరిష్టం వాళ్లు… వాళ్లెందుకు కలుస్తాన్నారో వాళ్లిద్దరికీ ప్లస్ మోడీకి మాత్రమే తెలుసు… బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ఏమడిగాడు, జగన్ ఏం ఫుల్‌ఫిల్ చేశాడో వాళ్లకే తెలుసు… సుప్రీం జడ్జి మీద ఆల్రెడీ కంప్లయింట్ చేశాడు కదా, బాబ్బాబూ, దాని సంగతేమిటీ అనడుగుతాడో వాళ్లకే తెలుసు…
Ads
ఒక ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రిని ఆ దొంగరాత్రి కలవడం అంటే… అల్లాటప్పా రొటీన్ యవ్వారాల మీద చర్చకో… కలిసి భోెజనం చేయడానికో కాదని సగటు మనిషికీ అర్థమయ్యే కామన్ సెన్స్… ప్రధాన మీడియాకు తప్ప..! ఈ ప్రధాన మీడియా కూడా తమ పొలిటికల్ బంధాల్ని బట్టి ఇష్టారాజ్యంగా రాసుకోవడమే తప్ప దానికీ ఏమీ తెలియదు… తెలియనివ్వరు… తెలిస్తే ఇక రాచరహస్యాలకు అర్థమేముంది..? బయటికి చెప్పబడేది, చూపబడేది వేరు… లోలోపల చర్చలు వేరు… ‘‘నాకు ఈ కోర్టుల గొడవ తప్పించండి, ఆ మూడు రాజధానులూ వర్కవుట్ చేసుకుంటాను… ఇదుగో సదరు న్యాయమూర్తి చేసిన నిర్వాకాలు… నేను మీకు కావాలీ అనుకుంటే నన్ను స్ట్రెంథెన్ చేయండి…’’ ఇదుగో ఇలాగే ఉంటయ్ చర్చలు… బెయిల్ రద్దు, మళ్లీ జైలు అనేవి కావు… మీకేం కావాలి, నేను మీకేం ఇవ్వాలి… ఈ దిశలోనే ఉంటయ్ మాటలు… మనం మాత్రం ఏదేదో రాసుకుంటాం, చదువుకుంటాం, చెప్పుకుంటాం, చర్చించుకుంటాం… అంతే, ప్రజలకు మొత్తం తెలిస్తే ఇక రాజ్యం, రహస్యం మాటలకు అర్థమేముంది..?!
Share this Article