.
అన్న సింహం, పులి, ఏనుగు, తిమింగలం, షార్క్… ఇలాంటి ఉదాహరణలన్నీ వేస్ట్… అదేనండీ… జగన్ ప్రతిపక్ష హోదా గురించి అడుక్కోవడం దేనికి అని… సింహం ఏదీ అడుక్కోదు, వేటాడి చిక్కించుకుంటుంది…
బహుశా జగన్‌కు ఎవరూ చెప్పలేదేమో,., అఫ్‌కోర్స్, ఎవరు చెప్పినా తను వినడు… కానీ తనకైనా తెలిసి ఉండాలి కదా… సింహం ఎవరినీ ఏదీ అడుక్కోదు అని… 11 సీట్లకు పడిపోవడం అంటేనే తన అపరిపక్వ పాలన మీద ఆంధ్రాజనం అత్యంత దారుణమైన తిరస్కరణ వోటు వేసినట్టు…
Ads
గౌరవించాలి, కారణాలు తెలుసుకోవాలి, ఆత్మమథనం, ఎవడెవడు పార్టీని, సర్కారును అమ్ముకున్నాడో తెలుసుకోవాలి, మారాలి, మార్చుకోవాలి, జనానికి నచ్చే మార్గంలోకి అడుగుపెట్టాలి, జనంలో ఉండాలి, జనం కోసం కదలాలి…. ఏదీ అది..?
నిజానికి తను రాష్ట్రం విభజించబడినప్పుడే తను గెలిచి ఉండాలి…. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరి చిప్పల సిద్ధాంతం దారుణంగా తిరస్కరించబడి ఉండాలి… కానీ తనను జనం తనను నమ్మారు, సీఎంను చేశారు, అంటే, జగన్‌కు జనంలో యాక్సెప్టెన్సీ లేదు అని అర్థం…
సరే, ఐదేళ్లు తిరిగాడు, జనంలో ఉన్నాడు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలాడు… దీనికితోడు చంద్రబాబు దిక్కుమాలిన పాలన కూడా తోడై, జనంలో అసహ్యం పెరిగి… తరువాతి ఎన్నికల్లో జగన్ గెలిచాడు… ఇక్కడ వచ్చింది సమస్య… తను వైఎస్ కొడుకు కావచ్చుగాక, వైఎస్ కాదు కదా…
అడ్డదిడ్డం పాలన… అపరిపక్వ పాలన… అవినీతి పాలన… అక్రమాలకు పెద్దపీట వేసిన పాలన… ఏమైంది..? జనంలో తన పాలన తీరు మీద అసహ్యం పెరిగి, మరీ 11 సీట్లకు పరిమితం చేసి… ఈ కొత్త దేవుడికన్నా ఆ పాత దెయ్యమే మేలు అనుకుని చంద్రబాబుకు జై అన్నారు జనం…
ఇక్కడ పవన్ కల్యాణ్ ప్రభావం ఏమీ లేదు… బీజేపీ ప్రభావం అసలే లేదు… జస్ట్, జగన్ వ్యతిరేక వోటు… బలమైన వ్యతిరేకత… ఆ రియలైజేషన్ ఇంకా జగన్‌కు రానట్టుంది… తన తత్వానికి రాదు కూడా… ఇప్పటికీ నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరుబే అనడుగుతాడు… ఎందుకివ్వాలి..?
నీకున్న 11 సీట్లకు అసలు అసెంబ్లీలో ఎక్కడో వెనుక వరుసలు ఇవ్వాలి… అసలు నువ్వు అసెంబ్లీకే రావు, పోనీ, అనర్హత వేటు వేస్తారని భయంతో వచ్చావు సరే మొన్న… బహిష్కరణ, నినాదాలు, అత్యంత నాసిరకం ప్రవర్తన…
స్పీకర్‌కు ధైర్యం చాలడం లేదు… ఈ స్థితిలో మా కేసీయార్ గనుక ఉండి ఉంటే తక్షణం జగన్‌పై వేటు పడేది… చంద్రబాబుకు ధైర్యం లేదు, కేసీయార్ కాదు కదా… విజయసాయి వదిలేశాడు, బీజేపీ వదిలేసింది, రాబోయే రోజుల్లో తనను ఫిక్స్ చేయడానికి ఏం దొరుకుతుందా అని చూస్తోంది చంద్రబాబు క్యాంప్… కాదు, లోకేష్ క్యాంపు…
ఇది వైఎస్ జమానా కాదు, చంద్రబాబు జమానా అసలే కాదు… పవన్ కల్యాణ్‌ను వదిలేయండి, ఆటలో అరటిపండు… కానీ లోకేష్ చాలా స్ట్రాటజీలు ప్లే చేయబోతున్నాడు… అదే చెప్పదలుచుకున్నది… అంతే…
ఇప్పటికీ జగన్ మారడం లేదు… మారడానికి ఇష్టపడటం లేదు… నీ పీఆర్ టీమ్స్, నీ సోషల్ మీడియా టీమ్స్, నీ కోటరీని దాటి బయటికి రావయ్యా మహానుభావా….? ఒక జీవీడీ, ఒక వాసిరెడ్డి వంటి వాళ్లెందరో… అర్థం చేసుకో, నీవాళ్లు ఎవరో, వాడుకుని జంప్ అయ్యేవారెవరో…
(ప్రతిపక్ష హోదా మీద పవన్ కల్యాణ్, జగన్ వ్యాఖ్య, ప్రతి వ్యాఖ్యల తరువాత స్ఫురించిన అభిప్రాయం ఇదే… అవునూ, సింహానికి హోదా కావాలా..? ఎవరో ఇవ్వాలా..? నువ్వు పరదాల సంస్కృతి దాటేసి జనంలోకి రావయ్యా మహానుభావా…? కాస్త ఎవడైనా ఏదైనా చెబితే విను… చెప్పేవాడిని చేరదీయి…)
Share this Article