Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జగన్..! నమ్మాడు.., మునిగాడు… ఈరోజుకూ ఆత్మమథనం లేదు ఫాఫం..!!

December 31, 2025 by M S R

.

అరయగ కర్ణుడీల్గె ఆర్వురి చేతన్….. అంటే కర్ణుడు కన్నుమూయడటానికి అనేక కారణాలు… అవి అర్జునుడి బాణం బలం కాదు….. సేమ్, జగన్ మట్టికరవడానికి, ఈరోజుకూ తను మారకపోవడానికీ చంద్రబాబు కాదు కారణం, పవన్ కల్యాణ్ అసలే కాదు, లోకేష్ ఏమాత్రం కాదు…

.

Ads

ఒకాయన ఏ పోస్టు షేర్ చేశాడు…  ఓసారి చదవండి, మాట్లాడుకుందాం…



వైసీపీని నేలమట్టం చేసిన – “Jagan’s Dirty Dozen”

1. సజ్జల రామక్రిష్ణ రెడ్డి – పార్టీ నాయకులకు, MLA, MP లకు జగన్ కు మధ్య అడ్డుగోడగా నిలిచి, communication gap కి కారణం అయ్యాడు… ఏ శాఖ మంత్రిని పని చేసుకోనివ్వకుండా, ప్రతీ అడ్మినిస్ట్రేషన్ వింగ్ మీద తనే ఆధిపత్యం సాగించి, వైసీపీ అంటే ఒక సర్కస్ అని, దాని సజ్జల రింగ్ మాస్టర్ అనుకునేలా చేశాడు…

2. RK రోజా – నీచమైన హావభావాలతో, పబ్లిక్ లో ఎలా మాట్లాడాలి అనే minimum common sense లేకుండా డబుల్ మీనింగ్ మాటలతో, వెగటు పుట్టించే చేష్టలతో.. పార్టీకి ముఖ్యంగా మహిళా ఓటర్లలో వైసీపీ అంటే వ్యతిరేకత కలిగేలా చేసింది..

3. పేర్ని నాని – అడ్డు అదుపు లేకుండా నోటికి వచ్చింది వాగుతూ, అనవసరమైన ఛాలెంజీలు చేస్తూ,, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద అసహ్యంగా బూతులతో దాడి చేసి, మొత్తం కాపు ఓటర్లు వైసీపీకి వ్యతిరేకం కావడానికి కారణం అయ్యాడు..

4. వల్లభనేని వంశీ – చంద్రబాబు గారి కుటుంబాన్ని నీచమైన భాషతో టార్గెట్ చేసి, కార్యకర్తల రక్తం మరిగిపోయేలా చేసి, ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే అని కసి కలిగేలా చేసాడు.. ఒక విధంగా నారా లోకేష్ strong comeback కి ఇతని దుర్మారమైన మాటలే కారణం..

5. కొడాలి నాని – వీధి రౌడీ స్థాయిలో బూతులు, అసహ్యకరమైన భాషతో.. న్యూట్రల్ ఓటర్లలో వైసీపీ రాజకీయాలను అధమ స్థాయికి దిగజారిస్తుంది అనే భావన కల్పించాడు.. తన స్నేహితుడు వలభనేని వంశీతో పోటీలో ఉండాలనే తపనతో చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసి TDP కార్యకర్తలు activate అవ్వడానికి కారణం అయ్యాడు…

6. అనిల్ కుమార్ యాదవ్ – పార్టీకి మొదటి నుండి strong pillars గా ఉన్న నెల్లూరు రెడ్డి సామాజికవర్గం మొత్తం గంపగుత్తగా దూరం కావడానికి ఇతని నోటి దూల కారణం.. బీసీ రాజకీయ ఎజెండా మీద కనీస అవగాహన లేని ఇతన్ని బీసీ నాయకుడిగా ప్రమోట్ చేయడంతో బీసీలలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది..

7. అంబటి రాంబాబు – ఏమి మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో కూడా తెలియకుండా మాట్లాడే ఇతను, గుంటూరు పల్నాడు ప్రాంతం మొత్తం పార్టీ ఖాళీ అవ్వడానికి కారణం అయ్యాడు.. తన కంపరం పుట్టించే గార్ధభ స్వరంతో ఇతను టీవీలలో కనిపిస్తే చాలు జనం irritate అయిపోయేవారు.. లేకి కబుర్లు, కామెడీ డాన్స్ లతో, వైసీపీ అంటే హుందాతనం అంటే తెలియని జోకర్ల పార్టీ అని ప్రజలు గ్రహించే స్థితికి తెచ్చాడు..

8. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి – మైనింగ్, ఇసుక, దందాలను handle చేసి,, రాష్ట్ర వనరులను దోచుకోవడం.. నకిలీ మద్యం దందా నడిపి, ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం కావడం ద్వారా వైసీపీ మొత్తం అవినీతిమయం అని కార్యకర్తలు కూడా గ్రహించే విధంగా చేశాడు..

9. YS అవినాష్ రెడ్డి – సొంత బాబాయి అయిన వివేకానంద రెడ్డిని హత్య చేసి, ఆ కేసులో అడ్డంగా బుక్కవ్వడంతో, అతనికి జగన్ రెడ్డి పూర్తి మద్దతు ఇవ్వడంతో, కడపలో సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు, జగన్ రెడ్డికి కుటుంబ విలువలు కూడా ఉండవు అని బయటపడిపోయేలా చేశాడు..

10. సజ్జల భార్గవ్ రెడ్డి – బూతు వీరులు, ఆకతాయి వెధవలు, పోకిరీలతో వైసీపీ సోషల్ మీడియా నింపేసి, ప్రజలకు YCP అంటే ఒక Yedavalu Criminals Pokiri ల పార్టీ అనే స్థాయికి దిగజార్చాడు.. సోషల్ మీడియా వాడే యూత్ మొత్తంలో వైసీపీ అంటేనే కంపరం పుట్టేలా చేశాడు..

11. ధనుంజయ రెడ్డి – జగన్ పేషీలో కార్యకర్తలకు గానీ,, వైసీపీ నాయకులకు గానీ,, ఒక్క పని కూడా కాకుండా అడ్డుకున్నాడు.. వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వం నుండి బిల్లులు రాక అప్పులపాలు అయిపోయి, ఆత్మహత్యలు చేసుకునే స్థితికి రావడానికి ఇతను ముఖ్య కారకుడు..

12. అనంతబాబు – దళిత డ్రైవర్ ను చంపి, డోర్ డెలివరీ చేసి, అదేదో గొప్ప ఘనకార్యం సాధించినట్టు జైలు నుండి విజయ యాత్రలు పెట్టుకుని ఊరేగుతూ వచ్చి, వైసీపీ పార్టీలో తేలు కుట్టిన దొంగల్లాగా ఉన్న దళిత కార్యకర్తలలో కూడా వ్యతిరేకత రావడానికి కారణం అయ్యాడు.. చాలా వరకు దళితుల తిరుగుబాటుకు, ఇతను incident కారణం అయ్యింది…

.

ఇవే కాదు, ఈ పోస్టుపై వచ్చే మరికొన్ని అభిప్రాయాలు చూద్దాం… అంటే, జగన్ మారతాడని కాదు, మారేవాడు అయితే తనను జగన్ అని పిలవరు…



ప్రవీణ్ ప్రకాష్, KNR, గౌతమ్ సావంగ్, రాజేంద్రనాథ్ రెడ్డి, మనీష్ కుమార్ సిన్హా, విజయసాయి రెడ్డి, YV సుబ్బా రెడ్డి, ధర్మా రెడ్డి, పీఎస్ఆర్…. ప్రధానంగా జీవీడీ… సమాచార కమిషనర్లుగా మారిన అవకాశవాదులు… ఒక్కడి మీదా జగన్‌కు అంచనా లేదు, విశ్లేషణ లేదు, తనకు జరిగే నష్టం మీద సోయి కూడా లేదు…

ఎంతసేపూ కమ్మ వ్యతిరేకత, సంపాదన కక్కుర్తి తప్ప ఇంకేముంది అన్నాడు ఓ మిత్రుడు… అఫ్‌కోర్స్, చంద్రబాబు భిన్నమేమీ కాదు… కానీ జనంలోకి ఎలా వెళ్తుందో సోయి లేనివాడు జగన్… జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకున్నవాడు చంద్రబాబు…


ట్రూ… ఏపీలో మరొకడు లేడు, ఆల్టర్నేటివ్ లేదు… చంద్రబాబు వేగంగా భ్రష్టుపట్టడానికి పెద్దగా సమయం అక్కర్లేదు… కానీ తన తప్పులు సరిదిద్దుకుని… ఓ కొత్త జగన్‌ను జనానికి పరిచయం చేస్తానని చెప్పడానికి జగన్ రెడీగా ఉన్నాడా…?

లేడు… అస్సలు లేడు… ఏమాత్రం పరివర్తన లేదు, ప్రక్షాళన లేదు… ఫాఫం, జగన్ గత పాలన తీరే చంద్రబాబుకు అసలు బలం… అంతకుమించి పవన్ కల్యాణ్, చంద్రబాబుకు వేరే బలం కూడా లేదు… అది గుర్తించకపోవడమే జగన్ అసలు శాపం..!!



చివరగా........ జగన్, నీ తండ్రి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ ఎందుకు ఆరాధ్యుడయ్యాడు..? నువ్వెందుకు మట్టిగలిసిపోయావు..? ఓ పెద్ద సబ్జెక్టు... అడుగు, అరగంటలో చెబుతాను.... ప్రజానాయకుడు కావడం అనేది డబ్బుతో పనికాదు... మైండ్ అప్లయ్ చేయాలి, వెధవ కోటరీని తరిమేయాలి... ఆర్ యూ రెడీ..!! 

ఒక్కమాట... రాష్ట్ర విభజన జరిగాక నువ్వెందుకు పవర్ లోకి రాలేదో ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకున్నావా..? కేసీయార్‌తో అక్రమ సంబంధం నిన్నెక్కడికి దిగజార్చిందో ఆత్మమథనం చేసుకున్నావా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జగన్..! నమ్మాడు.., మునిగాడు… ఈరోజుకూ ఆత్మమథనం లేదు ఫాఫం..!!
  • గల్వాన్ ‘సినిమా’ సెగ…! మన తెలంగాణ బిడ్డ వీరగాథపై చైనా అక్కసు..!
  • తెలంగాణ డీజీపీ భలే దాటేశాడు… నిజమే, ఇప్పుడు అప్రస్తుతం కూడా..!!
  • విజయశాంతి భారతనారి… మరో ప్రతిఘటన… ‘ఖతం సిద్ధాంత’ బోధన…
  • కీలకమైన నదీజలాల వివాదాలపై… హరీష్‌రావు అబద్దపు బాష్యాలు…
  • చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది, ఓ ఆరాటం..!!
  • అవీవా బేగ్..! ఎవరీమె..? ఎందుకు వార్తల్లో వ్యక్తి..? మరో గాంధీ..?!
  • మీరు జ్ఞానులే…. కానీ మన బ్యూరోక్రాట్లతో పోలిస్తే.., జస్ట్, చలిచీమలు…
  • ఇండియా వదిలేసి, లక్షల మంది దేశదేశాలకు వలస.., ఎందుకు..?!
  • SIR … వోట్ల ప్రక్షాళన తరువాత ఏమిటి..? ఇదీ ఓ క్లారిటీ..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions