కల్కి మీద బోలెడు నెగెటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి… అందరికీ ఒక సినిమా నచ్చాలని లేదు, అది సహజం… పాతాళభైరవి, మాయాబజార్‌లను కూడా విమర్శించేవాళ్లు, తప్పులెన్నువాళ్లు ఉంటారు, ఉండాలి, సహజం… కాకపోతే స్థూలంగా ఏమిటీ రిజల్ట్..?
అది నాణ్యతతో పనిలేనిది… లక్, సిట్యుయేషన్… ప్రస్తుతం కల్కి సినిమాకు దేశంలో ఎక్కడా, ఏ ఇండస్ట్రీలోనూ పోటీగా పెద్ద సినిమా లేదు, అది అతి పెద్ద ప్లస్ సినిమాకు… సరే, వాళ్ల భాష, వాళ్ల పైత్యం తప్ప మరొకడిని ఇష్టపడని తమిళనాడు, కేరళ ఇండస్ట్రీలను అలా వదిలేద్దాం… అవి మరీ సెంటినలీస్ టైపు…
తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్‌కు ఇంకాస్త టైమ్ తప్పదు… అంతగా బిజినెస్ జరిగింది… సాహసించి అశ్వినీదత్ దాదాపు ప్రతిచోటా సెల్ఫ్ రిలీజ్‌కు దిగాడు… మొండి ప్లస్ సినిమా మీద నమ్మకం… నిజానికి ఇది అమెరికా, నార్తరన్ స్టేట్స్‌లో దుమ్ము రేపుతోంది… తెలుగు, తమిళ భాషల్లో మహారాజ నిన్నామొన్నటి దాకా కాస్త నడిచింది… కల్కి వచ్చాక వెళ్లిపోయింది… మరేముంది..? ఏ భాష ఇండస్ట్రీలోనూ ప్రస్తుతం కల్కికి పోటీ ఇవ్వగల సినిమా లేదు… అది ప్రభాస్‌కు ఉపయోగం…
Ads
కరణ్ జోహార్ భాషలో చెప్పాలంటే… ఇన్నాళ్లూ ఒకే తరహా సినిమాలు చూసీ చూసీ విసిగిపోయిన బాలీవుడ్ ప్రేక్షకులకు కల్కి కొత్తగా ఉంది, కనెక్టవుతోంది… పైగా నార్తరన్ ట్రెండ్ ఇప్పుడు మైథాలజీ ప్లస్ ఫిక్షన్… కల్కి సరిగ్గా ఆ జానరే… పైగా దీపిక, అమితాబ్ ఉండనే ఉన్నారు… మరో కొత్త వార్త ఏమిటంటే..?
ఒక్క గంటలో అమ్ముడైన టికెట్లు అనే కోణంలో జవాన్ (షారూక్ ఖాన్ సినిమా) 86 వేల టికెట్లతో రికార్డు అట… కానీ కల్కి నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు ఏకంగా 93.77 వేల టికెట్లు అమ్ముడయ్యాయట… వారెవ్వా, వాట్ ఏ రికార్డ్… ఒక్కో హిందీ స్టార్ హీరో కుళ్లుకుంటున్నారన్నమాట… ప్రభాస్ అదృష్టమా, ప్రతిభా, పరిస్థితులా అనేది వదిలేయండి, వాటీజ్ రియాలిటీ అనేదే ముఖ్యం… రియల్లీ ప్రభాస్ లక్కీ ఫెలో…
వసూళ్ల విషయానికి వద్దాం… సాక్‌నిల్క్ రికార్డుల ప్రకారం ఇప్పటికి 369.5 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్… చూడబోతే బాహుబలి-2 రికార్డులన్నీ, అంటే ఇండియన్ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసేట్టు కనిపిస్తోంది… సరే, నిర్మాత చెప్పే 650 కోట్ల నిర్మాణవ్యయం ఫేక్ లెక్కలనే అనుకుందాం… ఇండస్ట్రీలో ఇలాంటి మాయలెక్కలు సహజం… అది పరిగణనలోకి తీసుకున్నా సరే, శాటిలైట్ హక్కులు, ఓటీటీ హక్కులు, ఓవర్సీస్ హక్కులు, ఆడియో హక్కులు అన్నీ లెక్కేస్తే… మొత్తమ్మీద 100 నుంచి 200 కోట్ల ప్లసులో ఉంటాడు నిర్మాత…
తనే చెప్పాడు 60 శాతం కల్కి-2 కూడా పూర్తయిందీ అని… అంటే మరో 100- 150 కోట్లతో చాపచుట్టేస్తారు… ఇక ఆ కల్కి-2 నెట్ వసూళ్లన్నీ ప్రాఫిటే… మొత్తానికి అశ్వినీదత్తుడు, నాగ్ అశ్వినుడు ఇద్దరూ ప్రభాస్ తోక తొక్కారు… అబ్బే, ఈ లెక్కలదేముంది..? బోర్ సినిమా అనేవాళ్లూ ఉంటారు… ఉండనివ్వండి… ఒక వంట అందరికీ రుచించాలని ఏమీ లేదు… వాళ్లకు టేస్ట్ లేదని కాదు, అది సహజం అని వదిలేయడమే..!!
Share this Article