నిజమే… సినిమా సర్కిళ్లలో ఇప్పుడు ఓ ప్రశ్న… ఇండియన్ ఆడియన్స్ విరగబడుతున్న సలార్ సినిమాను కన్నడ ప్రజలు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు..? కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది అని చెప్పుకుంటున్న ఈ సినిమా కర్నాటకలో ఎందుకు చతికిలపడింది..?
సలార్ బంపర్ హిట్ అనడంలో ఎవరికీ ఏ సందేహమూ లేదు… నార్త్ సినిమా మాఫియాను మరో సౌత్ సినిమా బద్దలు కొట్టిందనడంలోనూ డౌట్ లేదు… మూడే రోజుల్లో ఈ సినిమా 243 కోట్లు కొల్లగొట్టినట్టు కలెక్షన్ల రికార్డులు చెబుతున్నయ్… మన దేశంలోనే గాకుండా ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా దున్నేస్తోంది సలార్ సినిమా… ఒకరకంగా చూస్తే ఓవర్సీస్ మార్కెట్‌లో దీని విజృంభణ విశేషం అనిపిస్తోంది… మొత్తం 243 కోట్లలో 70 కోట్లు విదేశీ మార్కెటే… అయితే..?
Box Office Collection
World | India Net | India Gross | Overseas | |
---|---|---|---|---|
243.8 Cr | 211.12 Cr | 173.8 Cr | 70 Cr |
ఇది పాన్ ఇండియా సినిమా… అంటే ఇప్పటి ట్రెండ్ ప్రకారం హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు… ప్రభాస్ ప్రధానంగా తెలుగు హీరో… ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువ, తనకు ఫాలోయింగ్ ఎక్కువ… అందుకని తెలుగు మార్కెట్‌లోనే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసిందే… దానికి తగ్గట్టే మొత్తం 243 కోట్లలో 173 కోట్లు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో వచ్చినవే…
Ads
Telugu Net | Day 3 | Day 2 | Day 1 | |
---|---|---|---|---|
137.27 Cr | 36.27 Cr * | 34.25 Cr | 66.75 Cr |
నిజానికి తమిళం, మలయాళం ఇండస్ట్రీల నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలైతేనే ఆ ప్రేక్షకులు చూస్తారు… కన్నడ, తెలుగు, హిందీ ఇండస్ట్రీల నుంచి జనరేటైన పాన్ ఇండియా సినిమాలను ఆ రెండు దక్షిణ రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోవు… ఐనా సరే, పృథ్విరాజ్ సుకుమారన్ ఉన్నాడు కదా, మలయాళం ప్రేక్షకులు కొంత ఓన్ చేసుకున్నారు… అందుకని కేరళ మార్కెట్‌లో 7 కోట్ల వసూళ్లు కనిపిస్తున్నాయి…
Malayalam Net | Day 3 | Day 2 | Day 1 | |
---|---|---|---|---|
6.95 Cr | 1.65 Cr * | 1.75 Cr | 3.55 Cr |
తమిళంలో కూడా గుడ్ కలెక్షన్స్… శృతిహాసన్ మాత్రమే ఈ సినిమాలోని తమిళ ఫ్లేవర్… పైగా కన్నడ ఛాయలు ఎక్కువ… ఈ కేజీఎఫ్ తరహా యాక్షన్ వాళ్లకు కమల్ హాసన్, సూర్య, రజినీ కాంత్ తదితరులు చూపిస్తున్నదే… ఐనా సరే ఈ సలార్ తమిళ మార్కెట్‌లో 10 కోట్లు వసూలు చేసింది… అది విశేషమే…
Tamil Net | Day 3 | Day 2 | Day 1 | |
---|---|---|---|---|
10.02 Cr | 3.22 Cr * | 3.05 Cr | 3.75 Cr |
హిందీ మార్కెట్‌కు వస్తే 53 కోట్ల కలెక్షన్లను రికార్డుగా చెప్పుకోవచ్చు… ఎందుకంటే… హిందీలో సలార్‌కు పోటీ షారూక్ సినిమా డన్కీ… నార్త్ మార్కెట్‌ను ప్రధానంగా నార్త్ సినీమాఫియా ప్రభావితం చేస్తుంటుంది… సలార్ విషయంలో కూడా నార్త్‌లో ఎక్కువ థియేటర్లు దొరక్కుండా ఆ బాలీవుడ్ మాఫియా నానా ప్రయత్నాలూ చేసింది… కానీ హిందీ ప్రేక్షకులు డన్కీకి జెల్ల కొట్టేసి, ప్రభాస్‌కు జై అన్నారు…
Hindi Net | Day 3 | Day 2 | Day 1 | |
---|---|---|---|---|
53.86 Cr | 21.76 Cr * | 16.35 Cr | 15.75 Cr |
Kannada Net | Day 3 | Day 2 | Day 1 | |
---|---|---|---|---|
3.02 Cr | 1.17 Cr * | 0.95 Cr | 0.9 Cr |
ఎందుకిలా అనే ప్రశ్నకు నిజానికి ఎవరి దగ్గరా జవాబు లేదు… ప్రభాస్‌ను యాక్సెప్ట్ చేయకపోవడమేమీ కాదు… తన సాహో, బాహుబలిని కన్నడ మార్కెట్ బాగానే ఆదరించింది… మరి తెలుగు, కన్నడ హైబ్రీడ్ సలార్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు..? ఆ ఉగ్రం సినిమా చూశాం కదా, ఇది జస్ట్ రీమేక్ కదా అనుకున్నారా… ఏమో… ఆ కాటేరమ్మకే తెలియాలి…!!
Share this Article