……. హేమిటీ, ఇదంతా నటనా..? కేసీయార్ ఆత్మీయ ఆలింగనం వెనుక ‘‘బిడ్డా, జైలులో పారేస్తా ఏమనుకుంటున్నావో, రా, వచ్చి, నా కౌగిట్లో ఇమిడిపో, చెప్పింది విను, చరిత్ర అడక్కు, కాదంటే కష్టాలపాలవుతవ్’’ అనే బెదిరింపు ఉందా..? ‘‘కేసీయార్, నాకు దేవుడిచ్చిన అన్న, మొన్నటి ఎన్నికల్లో నాకు మస్తు సాయం చేసిండు, కలిసి ప్రాజెక్టులు కట్టుకుందాం, కుమ్మేద్దాం బ్రదర్ అన్నాడు, మై బిగ్ బ్రదర్’’ అన్నట్టుగా కేసీయార్‌ను కౌగిలించుకున్న జగన్ లోలోపల మస్తు భయపడిపోతున్నడా..?
హహహ… ఉండవల్లి అరుణ్‌కుమార్ అనబడే జగన్ పాత అంకుల్ ఇలాగే మాట్లాడుతున్నాడు… ఒకప్పుడు వైఎస్ ఏది చెబితే అది చేసిన సూసైడ్ బ్యాచే ఉండవల్లి కూడా… అఫ్కోర్స్, కేవీపీలాగే తను కూడా… జగన్‌కు దూరమై, చంద్రబాబుకన్నా ఎక్కువ ద్వేషిస్తున్నారు ఇప్పుడు… విషయానికొస్తే… తను ప్రెస్‌మీట్ పెట్టేసి… ‘‘ఏమయ్యా జగనూ, పోలవరం ప్రాజెక్టుపై ఏమిటీ దుర్మార్గం… ఏం, మోడీని నిలదీయలేవా..? భయపడుతున్నావా..? రాష్ట్రానికి ఇంత ద్రోహం చేయడానికి సిద్ధపడతావా..? ఆయ్ఁ’ అని చెడామడా మాటలు వదిలాడు…
Ads
సరే.., కేంద్రం సరిగ్గా స్పందించడం లేదు కాబట్టి… ఆర్అండ్ఆర్ ఖర్చు తగ్గించుకోవడం కోసం పోలవరం ప్రాజెక్టును కేవలం 41.5 మీటర్ల ఎత్తుకు కుదిస్తున్నారనే ప్రచారం ఉన్నమాట వాస్తవమే… అబ్బే, ఇంచు కూడా తగ్గదు, దశలవారీగా మొత్తం ఎత్తుకు కట్టేస్తాం అంటున్నది జగన్ సర్కారు… అసలు మొదటి దశ, రెండో దశ అంటున్నారూ అంటేనే ఏదో పితలాటకం ఉన్నట్టు లెక్క… ఉండవల్లి పోలవరంపై వ్యక్తం చేసే సందేహాలను ఎవరూ వ్యతిరేకించాల్సిన పనిలేదు… రాజకీయంగా, ఏపీ పౌరుడిగా ఆ ప్రశ్న తన హక్కు… అయితే..?
‘‘తెలంగాణ గోదావరిపై బోలెడు ప్రాజెక్టులు అక్రమంగా కట్టేస్తోంది… అనుమతుల్లేవు… తాగునీరు పేరిట తెలంగాణ ప్రాజెక్టులు కట్టేస్తుంటే, మనం మాత్రం ఈ ఒక్క పోలవరంపై రాజీపడటం ఏమిటి…? అసలు కేంద్రం ఏం చెబుతున్నదో ఓ శ్వేతపత్రం విడుదల చేసెయ్ అర్జెంటుగా… తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెబితే జైలులో పెడతానని కేసీయార్ హెచ్చరించాడు… అందుకే జగన్ భయం’’ అంటున్నాడు ఇప్పుడు…
ఇక్కడే ఉంది తిరకాసు… కాలేశ్వరంపై జగన్ ప్రభుత్వం అక్రమమని వాదిస్తూనే ఉంది కదా… కేసీయార్ ఏం చేసుకుంటావో చేసుకోఫో అన్నట్టుగా రాయలసీమ లిఫ్టు చకచకా కట్టేస్తూనే ఉన్నాడు కదా జగన్… అంతేకాదు, ఇద్దరమూ కలిసిమెలిసి ప్రాజెక్టులు కట్టుకుందామోయ్ అన్న కేసీయార్ ప్రతిపాదనను కూడా పవిత్రసంగమంలో కలిపేశాడు కదా… మరిక జగన్ భయపడింది ఏమున్నది..? నిజానికి జగన్‌ను ఏమీ అనలేక కేసీయార్ భయపడుతున్నాడు అని ఉండవల్లి పరోక్షంగా వెక్కిరిస్తున్నాడా..?
పోనీ, జగన్‌ను జైలులో పారేయడానికి కేసీయార్ దగ్గర ఉన్న కేసులేమిటి..? ఎలా జైలులో పెడతాడు..? ఈ క్లారిటీ ఇవ్వాలండీ ఉండవల్లి గారూ… అసలే తమరు కొన్నిసార్లు లాజిక్కులను కౌగిలించుకునే మాట్లాడతారు, కొన్నిసార్లు లాజిక్కులకు ఆమడదూరంలో ఉండిపోతారు… కేసీయార్ తలుచుకుంటే జగన్‌ను ఎలా, ఎందుకు, ఏ బేసిస్ మీద జైలులో పారేస్తాడు..? క్లారిటీ కావాలి ప్లీజ్… తెలంగాణలో, హైదరాబాదులో జగన్ చేసే చట్టవిరుద్ధ అక్రమాలు ఏమిటి..? మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి..? కమాన్, ఈ ముసుగులో గుద్దులాట దేనికి..? కేసీయార్ జగన్‌ను ఎందుకు రక్షిస్తున్నాడో చెప్పేయండి… నేషన్ వాంట్స్ టు నో….
Share this Article