ఒకప్పుడు ఖుష్బూకు గుడి కట్టి ఆరాధించారు తమిళజనం… అలాంటి ఖుష్బూను పులుసులో ఈగలా తీసిపారేశాడు దిల్ రాజు… ఇందులో ఆమె పాత్ర ఎంతో గానీ, ఖచ్చితంగా ఇది ఖుష్బూకు అవమానమే… కారణం ఏమిటి..? దీనిపై తెలుగులో ఎవరూ ఏమీ రాయడం లేదు గానీ, తమిళంలో మీడియా భలే చర్చలు సాగిస్తోంది… ఊహాగానాలు చేస్తోంది… నిజానికి ఖుష్బూ వంటి సీనియర్ నటికి జరగకూడని అవమానమే ఇది…
సినిమా తెలుగులో, కన్నడంలో వీర ఫ్లాప్… రకరకాల పాత సినిమాలన్నీ మిక్సీలో వేసి, ఓ పిచ్చి కథను ప్రజెంట్ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి… సరే, ఆ సినిమా విశ్లేషణలోకి వద్దులే గానీ… ఖుష్బూ పాత్ర మొత్తాన్ని ఎందుకు కత్తిరించారు..? ఐనాసరే ఖుష్బూ ఎందుకు ఊరుకుంది..? తమిళ నిర్మాతలు, దర్శకుల వద్ద ఎందుకు రచ్చ చేయలేదు..? అసలు ఆమెను మొత్తానికే ఎందుకు ఎత్తిపారేశారు..? ఇవీ చర్చలు…
నిజానికి ఇందులో ఖుష్బూను రష్మిక మంథాన తల్లి పాత్రకు తీసుకోవాలని నిర్ణయించారు… ఏమైందో ఏమో గానీ, ముందస్తు అగ్రిమెంట్లు ఏమయ్యాయో గానీ ఖుష్బూతో పారితోషికం విషయంలో ఏదో గొడవ స్టార్టయింది… తరువాత రాజీ కుదిరింది… నేను ఈ సినిమాలో నటిస్తున్నాను అని ఖుష్బూ ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది… తరువాత షూటింగులో కూడా పాల్గొంది… తీరా రిలీజు నాటికి ఆమె పాత్ర మొత్తాన్నే లేపేశారు…
Ads
ఇదేమనడిగితే… ‘‘నన్నెందుకు అడుగుతున్నారు..? అసలు నేను ఆ సినిమాలో నటిస్తే కదా..?’’ అని కోపాన్ని, వెటకారాన్ని కలిపి మరీ జవాబులు చెప్పింది మీడియాకు ఖుష్బూ… దీని మీద తమిళ, మలయాళ మీడియాలో పలు కథనాలు వస్తుంటే… నిర్మాత గానీ, దర్శకుడు గానీ, హీరో గానీ ఎవరూ మాట్లాడలేదు… కానీ ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ ఎక్కడో మాట్లాడుతూ… ‘‘సారీ మేడమ్, సినిమా నిడివి ఎక్కువైపోయింది… దాంతో మీ సీన్లు కట్ చేయాల్సి వచ్చింది’’ అని వివరించాడు…
ఇది మరీ అబ్సర్డ్… 1) సినిమా నిడివి అంతగా పెరిగిపోవడం సినిమా ప్లానింగ్ అంత దరిద్రంగా ఉన్నట్టు లెక్క… విజయ్‌కే వంద కోట్లు కట్టబెట్టిన భారీ బడ్జెట్ సినిమా ఇంత అడ్డదిడ్డంగా ఎవడూ స్టార్ట్ చేయడు, సో, అది కారణం కాదు… 2) సినిమా నిడివి పెరిగితే హీరోయిన్ తల్లి పాత్రనే లేపేస్తారా..? అదీ అంతటి సీనియర్ నటి సీన్లను..? ఇదేనా ఎడిటింగ్ అంటే..? ఎవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆ ఎడిటర్ అంత సాహసం చేస్తాడా..? సో, అదీ కారణం కాదు…
3) నిజంగానే నిడివి కారణంగా ఆమె పాత్రను లేపేస్తే ఖుష్బూ అలా సీరియస్‌గా రియాక్ట్ కాదు… ఆమె కస్సుబుస్సుమంటోంది అంటే ఏదో బలమైన కారణం ఉంది… 4) ఆమెతో వేగలేక నిర్మాత దిల్ రాజు ‘‘కత్తిరించి పారేయండి’’ అన్నాడు… నిర్మాతే అన్నింటికీ సిద్ధపడ్డాక ఇక ఆగేదేముంది..? ఎడిటింగ్ కత్తెర చకచకా పనిచేసింది… ఖుష్బూ పాత్ర మొత్తానికే ఎగిరిపోయింది… అవునూ, రాజు గారూ… ఈ జబర్దస్త్ జడ్జి ఖుష్బూతో ఈ గొడవేమిటంటారు..? నిజంగా అంత విసిగించిందా..? ఎందుకని..?! పోతేపోనీ, ఆమె నటించిన సీన్ల విలువ 10 కోట్లు అన్నావుట… ఓహో, సీన్లకు ఇలా కూడా లెక్క కడతారా..? ఇంట్రస్టింగు..!!
Share this Article