Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణ బతికి ఉంటే… నరేష్‌ను ఇంతమాట అనేవాడివా మిష్టర్ శేషగిరీ…

May 27, 2023 by M S R

ఓ వార్త కనిపించింది… సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఏదో యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ… అసలు ఈ నరేష్ ఎవరు..? మా కుటుంబంతో ఏం సంబంధం..? తనకు సంబంధించిన ప్రశ్నల్ని మమ్మల్ని అడుగుతారేం..? అని తన అసంతృప్తిని నవ్వుతూనే వెళ్లగక్కాడు… నిజమేనా..? కృష్ణ కుటుంబంతో ఏ సంబంధమూ లేదా..? ఎందుకు హఠాత్తుగా నరేష్‌ను డిస్ ఓన్ చేసుకుంటున్నారు దేనికి..?

ఎస్, అఫ్ కోర్స్ సీనియర్ నరేష్ అలియాస్ హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ వీకే నరేష్ బాబు మాటలు, చేష్టలు, తన పెళ్లిళ్లు, ప్రేమబంధాలపై ఓ సినిమాతో వెకిలి, వెగటు, చిల్లర దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాడు… విజయనిర్మల, కృష్ణ బతికి ఉన్నన్ని రోజులూ నరేష్ కాస్త అదుపులో ఉండేవాడు… ఇప్పుడు పైలాపచ్చీస్… ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు కదా… ఇక ఇష్టారాజ్యం…

ramya naresh

Ads

తన మాటల ధోరణి, తన చేష్టలు, తన బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పటానికి అయిదారు నెలలుగా మీడియాలో సాగుతున్న సీన్లే తార్కాణం… కన్నడ నటి పవిత్ర లోకేష్‌తో లిప్ లాకులు, లవ్వు లాకులు, మూడో పెళ్లాం రమ్య రఘుపతితో పంచాయితీలు, కేసులు చదువుతున్నవే, చూస్తున్నవే… తద్వారా కృష్ణ కుటుంబం పరువు కూడా పోతుందని కృష్ణ అభిమానులు బాధ… అందుకే మోసగాళ్లకు మోసగాడు రిరిలీజ్ ప్రమోషన్ ప్రెస్ మీట్లలో ఆదిశేషగిరికీ ఈ ప్రశ్న ఎదురవుతోంది…

pavitra lokesh

నిజంగానే తమ కుటుంబానికి నరేష్ ప్రేమ యవ్వారం తలనొప్పిగా మారినట్టు ఆ కుటుంబం ఫీలవుతోంది… అయితే నరేష్‌తో మా కుటుంబానికి ఏం సంబంధం అనే ప్రశ్న మాత్రం అసంబద్ధం… విజయనిర్మలకు కృష్ణకన్నా ముందు సంబంధంతో నరేష్ పుట్టవచ్చుగాక… మరీ మహేష్‌బాబు, మంజుల స్థాయిలో కృష్ణ ప్రేమ నరేష్‌కు దక్కకపోవచ్చుగాక… కానీ నరేష్ పట్ల కృష్ణ ఎప్పుడూ నిరాదరణను కనబరచలేదు… మరీ తన కొడుకుగా గాకపోయినా తన ప్రియమైన విజయనిర్మల కొడుకుగా ప్రేమనే కనబరిచాడు…

naresh pavitra

పలు విషయాల్లో నరేష్ కృష్ణతో తరచూ సంప్రదింపుల్లో ఉండేవాడు… విజయనిర్మల ఆస్తి నుంచి పైసా కూడా కృష్ణ తీసుకోకపోవచ్చుగాక… కృష్ణ ఆస్తిలో కూడా విజయనిర్మల ఎప్పుడూ భాగం కూడా అడగకపోవచ్చుగాక… ఇద్దరి నడుమ ఆస్తుల పంచాయితీలు ఏమీ లేవు… కృష్ణ కుటుంబం నుంచి నరేష్ కూడా ఏమీ ఆశించినట్టు లేడు… తనకే బోలెడంత ఆస్తి ఉంది… అయితే ఈ తాజా పంచాయితీతో అసలు నరేష్‌తో తమ కుటుంబానికి ఏం సంబంధం అనే ప్రశ్న మాత్రం అబ్సర్డ్… నరేష్ మంచి పని చేస్తే ‘తమవాడు’ అయ్యేవాడేమో… నరేష్ తింగరి పనులు చేస్తున్నాడు కాబట్టి ‘కానివాడు’ అయ్యాడా..? కృష్ణ బతికి ఉంటే ఆదిశేషగిరి నోటి వెంట ఈ మాట వచ్చేదా..?

pavitra

ఇప్పుడు కృష్ణ కుటుంబం పరువు గురించి మాట్లాడుతున్న ఈ పెద్ద మనిషి… కృష్ణ మృతదేహానికి సరైన గౌరవం ఇవ్వలేదనీ, అంత్యక్రియల్నీ ఏవో తూతూమంత్రంలా నడిపించేశారనీ, అంత బతుకు బతికిన కృష్ణను మరణానంతరం అవమానించారనే విమర్శలకు మాత్రం సమాధానాలు ఇవ్వలేని దురవస్థ… సో, నరేష్ ఎవరు..? మా కుటుంబంతో ఏం సంబంధం..? అని ఆదిశేషగిరి ఈసడించుకోవడం సబబుగా లేదు… మరీ రాజమౌళి రమ మొదటి సంబంధం కొడుకు కార్తికేయను తన కొడుకుగా దత్తత తీసుకున్నట్టుగా నరేష్ విషయంలో ఏ అధికారిక తంతు జరిగి ఉండకపోవచ్చు, కానీ నరేష్ ఖచ్చితంగా కృష్ణ కుటుంబసభ్యుడే…!!

naresh

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions