.
ఆయన పేరు కేటీయార్… తండ్రి కేటీయార్ నోటి నుంచి ఊడిపడ్డట్లే… దబాయింపు కేరక్టర్… ఎందుకు చెప్పుకోవాలంటే… జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక కాబట్టి… తనకు ప్రతిష్టాత్మకం కాబట్టి…
హరీష్ రావు తండ్రి మరణంతో ప్రచారానికి దూరమై, ఏవో ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్‌లతో నేనూ ఉన్నానోచ్ అని చెప్పుకుంటున్నాడు, కవిత మొత్తం తన ఫ్యామిలీనే నిందిస్తూ కబడ్డీ ఆడుకుంటోంది…. నెవ్వర్, పెద్ద దొర ఫామ్ హౌజు వదిలి ప్రజాజీవితంలోకి రాలేడు… ఏ పశ్చాత్తాపం దహిస్తుందో తెలియదు…
Ads
మిగిలింది కేటీయార్… ప్రచారం చేస్తూ ఉన్నాడు… ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు… సానుభూతి అంటున్నాడు… కానీ ఏ సానుభూతి అంటున్నాడో అదే మాగంటి సునీత మీద ఆరోపణలు… తన భర్త (?) మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా సొంత అత్తను, అనగా మాగంటి గోపీనాథ్ తల్లిని కనీసం చూడటానికి కూడా రానివ్వలేదు…
ఏ పార్టీ వాడో, ఏ రాజకీయ లబ్ధి కోసమో ఆరోపించలేదు… సాక్షాత్తూ ఆయన తల్లి ఆరోపించింది… కేటీయార్ మీద విలన్ అనే ముద్ర వేసింది పరోక్షంగా..! చాలా సీరియస్ ఆరోపణలే… విదేశాల నుంచి కేటీయార్ వచ్చేదాకా తన కొడుకు మరణం ‘స్థంభించిపోయింది’ ఎందుకు అనడుగుతోంది అమ్మ…
అలా అడిగితే… ఇది పొలిటికల్ కుట్ర అని వెంటనే కేటీయార్ క్యాంపు డిఫెన్సులో పడి కొట్టుకుంటోంది… కానీ బీజేపీ, కాంగ్రెస్ రెండూ అందుకున్నయ్… ఆ మరణం వెనుక మిస్టరీ ఏమిటో తేలాలి, కేటీయారే విలన్ అంటూ…
నిల్… బహిరంగ ప్రచారం, ప్రసంగాలు, ప్రెస్ మీట్లు, మీట్ డి ప్రెస్‌లు, సోకాల్డ్ గొప్ప జర్నలిస్టులు ఇంటర్వ్యూలు…. ఈ ఒక్క ప్రశ్నకు మాత్రం కేటీయార్‌ను అడిగినవాడు లేడు, తన దగ్గర జవాబు లేదు, సైలెంట్..,? గోపీనాథ్ మరణంలో మీరు విలన్ అట కదా… మీ రెస్పాన్స్ ఏమిటి..?
విచిత్రం ఏమిటంటే… తెల్లారి లేస్తే రేవంత్ గొట్టంగాడు, త్రీఫీట్ అని నానా బూతులు తిడతాడు కదా… దీనికి జవాబు చెప్పు, దానికి జవాబు చెప్పు అని గోకుతూ ఉంటాడు కదా… మరి కీలకమైన ఈ ప్రశ్నకు జవాబులు లేవెందుకు…?
మాగంటి సునీత కూడా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఇది… ఆ కుటుంబం వెనుక అన్నీ తానై ఉన్నాను అంటున్న కేటీయార్ జవాబు చెప్పాల్సిన ప్రశ్న… కానీ సైలెంట్… ఎందుకంటే..? ఏ సానుభూతి వోట్ల మీద కేసీయార్ ఆశపడుతున్నాడో, ఆ సానుభూతి కొట్టుకుపోతోంది కనుక… 1) కవిత 2) మాగంటి గోపీనాథ్ తల్లి… ఇవీ కారణాలు..,.
1) గోపీనాథ్ మరణం వెనుక మిస్టరీ ఏమిటో జనానికి తెలియనివ్వడం లేదు… 2) ఆ అమ్మను కూడా గోపీనాథ్‌ను చూడనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు, కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు… 3) రెండు రోజులు ఆ మరణాన్ని ఎందుకు స్థంభింపచేశారు..? ఎవరు..? ఎందుకు..?
బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తాం అంటున్నాడు రేవంతం… కరెక్టు కాదు, నడుమ బండి సంజయ్ ఎవరు..? ఒకవేళ గోపీనాథ్ తల్లి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తాం అనాలి… కాంగ్రెస్, బీజేపీ రెండూ కేటీయార్ విలన్ అంటున్నాయి… గోపీనాథ్ మరణం వెనుక ఏదో మిస్టరీ ఉంది… అదేమిటి..? రేవంత్‌తో ఏదో అవుతుందీ అనుకోవడానికి లేదులెండి…
అంతటి కాళేశ్వరం, పవర్ ఇష్యూస్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ వంటి అనేకానేక ఇష్యూస్‌లోనే రేవంత్ కదలిక లేదు… కమాన్, దమ్ముందా, మగోడివేనా..? దా, అరెస్టు చేయి అని సవాల్ విసురుతున్నా రేవంతంలో నో రెస్పాన్స్… అసలు కేసీయార్ దాకా దేనికి..? కేటీయార్ అరెస్టుకు కూడా సాహసించలేని దురవస్థ దేనికి..? అంతా మాయ… అంతా ఓ భ్రమ..!!
.
అన్నట్టూ…. ఈ ఉపఎన్నిక రెఫరెండమ్, ఒప్పుకో, ఒప్పుకో అని మాట్లాడుతున్నాడు కదా… మరి ఈ వాదన ఒక దుబ్బాక, ఒక హుజూరాబాద్ ఎన్నికల్లో…. ఒక్క సీటూ దిక్కులేని లోకసభ ఎన్నికల్లో… మెజారిటీ లేని అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు దేనికి..? మీ పాలన తీరు బాగుంటే అప్పుడే రెఫరెండమ్ అని చెప్పి ఉండాలి కదా…
.
Share this Article