తమ టీం పట్ల మల్లెమాల శ్యాంప్రసాదరెడ్డి ఫుల్ ఫైర్ అవుతున్నాడు… దీన్ని ఎలా చల్లబరచాలో తనకే అర్థం కావడం లేదట… ఏమిటి..? హైపర్ ఆది మంచు విష్ణును టార్గెట్ చేస్తూ ఓ పండుగ స్పెషల్ షోలో చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు, తరువాత ఉత్పన్నమవుతున్న తల్నొప్పి… హైపర్ ఆది మీద మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫుల్లు గరం మీద ఉన్నారనేది కరెక్టు… అది ఇప్పుడప్పుడే చల్లారదనేదీ నిజం… ఇప్పటికే దాడికి ప్రయత్నించారా, దాని మీద ఆది స్పందన ఏమిటో కాసేపు పక్కన పెడదాం… దాడి అబద్దం… కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు… ఆదికి బాడీ షేమింగ్ ఇష్టం… విష్ణుప్రియ ముక్కు, నరేష్ పొట్టితనం, రోహిణి బరువు, ఫైమా కలర్… అలా అందరి మీదా పంచులు వేస్తుంటాడు, జబర్దస్త్, ఈటీవీ షోలలో ఆది హవా నడుస్తుంది కాబట్టి వాళ్లు సహిస్తున్నారు, మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తన నత్తి మాటల్ని వెక్కిరిస్తే ఎందుకు సహిస్తాడు..? అయితే…
- ఒక ప్రోగ్రాంలో ఓ స్క్రిప్టు రైటర్ కమ్ టీం లీడర్ తన వ్యక్తిగత రాగద్వేషాలను గుమ్మరిస్తే అది ఈటీవీకి, మల్లెమాల సంస్థకు వోకేనా..? (ఆ ప్రోమో ఆధారంగా ఓ టీవీ ఒక స్పెషల్ బిట్ ప్రసారం చేయడంతో అది విస్తృతంగా జనంలోకి వెళ్లిపోయింది… కానీ అది లీగల్ చిక్కుల్ని సందేహించిందో, ఈటీవీ నుంచి ఏమైనా గట్టిగా చెప్పారో గానీ, యూట్యూబ్‌లో పెట్టిన సదరు బిట్‌లో, ఆ వివాదాస్పద ప్రోమోలోని అంశాలు కట్టయిపోయాయి ఇప్పుడు… చాలా సైట్లలో కూడా ఆ ప్రోమో మొత్తానికే అంతర్ధానమై పోయింది…)
- ఆది గతంలో కూడా మహేశ్ కత్తి సహా నాగబాబుకు పడని వాళ్లందరి మీదా ఇలాగే పంచులు వేసేవాడు… అప్పట్లో నాగబాబు జడ్జి, తను ఏది చెబితే అదే, సో, చూసీచూడనట్టుగా వదిలేశారు…
- ఇప్పుడు మంచు విష్ణు మీద వెక్కిరింపు వ్యాఖ్యలు చేస్తుంటే రోజా ఎందుకు నవ్వినట్టు..? మంచు విష్ణుకు జగన్‌కు నడుమ చుట్టరికం తెలియదా ఆమెకు..? ఇండస్ట్రీ జగన్ పట్ల ద్వేషభావనతో ఉన్నప్పుడు మోహన్‌బాబు ఫ్యామిలీయే తనతో సత్సంబంధాల్ని మెయింటెయిన్ చేశారనేదీ తెలియదా..? ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉంది..? పోనీ, మోహన్‌బాబు టెంపర్‌మెంట్ గురించి తెలియదా..? కమెడియన్లు ఏం రాసుకొచ్చి, ఎవరి మీద, ఏం చదివినా టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ అన్నట్టేనా..? యాంకర్ ఏం చేస్తున్నట్టు..?
- ఆది వ్యాఖ్యలను యథాతథంగా ప్రోమోలో పెట్టేసి రిలీజ్ చేశారు… (వివాదం రేగడంతో తరువాత ప్రోగ్రాంలో, యూట్యూబ్‌లో తీసేసినట్టున్నారు) అంటే, మొదట మల్లెమాల టీం వాటిని ఎండార్స్ చేసినట్టే కదా..? మంచు విష్ణు మీద వెక్కిరింపు వ్యాఖ్యలకు శ్యాంప్రసాదరెడ్డి బాధ్యత వహించాలా..?
- టీవీలో ప్రసారమయ్యే ప్రతి బిట్‌కూ, ప్రతి మాటకూ, ప్రతి సీన్‌కూ సదరు టీవీ యాజమాన్యమే బాధ్యత వహించాలి… ఎవరో నిర్మించారు, జస్ట్ మేం ప్రసారం చేశాం అంటే కుదరదు… ఈటీవీలో ఈ షోలను చూసే టీం ఎవరో, బాధ్యులు ఎవరో గానీ… ఈ బేసిక్స్ తెలుసా..?
- ఆమధ్య సద్దాం టీంలోని పొట్టి రియాజ్‌తో సీఎం జగన్ మీద ఇమిటేషన్ కామెడీ చేయిస్తే అదెంత వివాదానికి దారితీసిందో తెలుసా ఈటీవీ వాళ్లకు..? (అది బహుశా జీతెలుగులో కావచ్చు, ఎప్పుడూ కామెడీ కేవలం కామెడీగానే ఉండిపోదు, కొన్నిసార్లు మంట రాజేస్తుంది…)
విన్నమాట ఏమిటంటే… ఒకానొక కాలంలో చిరంజీవితో తీసిన అంజి అనే గ్రాఫిక్ బేస్డ్ సినిమా డిజాస్టర్ అయ్యాక శ్యాంప్రసాదరెడ్డి ఆరిపోయే స్థితి… అప్పుడు నైతికంగా కూడా మోహన్‌బాబు మాత్రమే అండగా నిలబడ్డాడనీ.., నాతో సినిమా తీస్తున్నట్టు ప్రకటన చేసుకో, తదుపరి సినిమాకు ఫైనాన్షియర్స్ వస్తారు, గెటాన్ అయిపోవచ్చు అని సలహా కూడా ఇచ్చాడని అంటారు… మరి ఆ మోహన్‌బాబు ఫ్యామిలీ పట్ల మల్లెమాల చూపించే కృతజ్ఞతా ఇది..? సరిగ్గా ఈ భావనే, ఈ ప్రశ్నే శ్యాంప్రసాదరెడ్డికి కూడా సమర్థించుకోలేని విధంగా మారిపోయిందనీ, తనూ పెయిన్ ఫీలవుతున్నట్టు సమాచారం… మోహన్‌బాబు అంత తేలికగా ఎవరినీ క్షమించడు… మల్లెమాల మీద ప్రెజర్ పెరిగే చాన్స్ కూడా ఉండొచ్చు… సో, మల్లెమాల బాస్ తన సంస్థలోని బాధ్యుల మీద ఏం చర్యలు తీసుకుంటాడు, ఏం చేస్తాడనేది పక్కన పెట్టేస్తే… హైపర్ ఆది పట్ల ఎలా వ్యవహరించబోతున్నాడు, ఆ సంస్థ తీసే టీవీ ప్రోగ్రాముల్లో ఆది కొనసాగుతాడా అనేది ఇప్పుడు టీవీ సర్కిళ్లలో సాగుతున్న చర్చ…!! ఈ వివాదాల సంగతెలా ఉన్నా సరే, హైపర్ ఆది మెరిట్ ఉన్న కళాకారుడు… స్పాంటేనియస్ పంచులు వేయగలడు, రాయగలడు… స్వయంగా నటిస్తాడు… తను ఓ అసెట్… ఆదిని మల్లెమాల వదులుకోగలదా..?!
Ads
Share this Article