.
తెలుగు ఇండస్ట్రీలో హేమ ఓ చిత్రమైన కేరక్టర్… బండ్ల గణేష్‌లాగా ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు కొన్నిసార్లు… ఓ ఫిలిమ్ జర్నలిస్టు వర్సెస్ మంచు లక్ష్మి ఇష్యూలో ఆమె స్పందించింది… (గతంలో కూడా సోషల్ మీడియాలో సినిమా తారల మీద వచ్చే వెకిలి వార్తలు, అశ్లీల థంబ్ నెయిల్స్ మీద ఆమే చాలాసార్లు మాట్లాడింది… అది వోకే)…
‘నీ సోదరికి అన్యాయం జరిగినా నువ్వు స్పందించలేదు, ఇదేం న్యాయం?’ అని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుపై కామెంట్ చేసింది… ఫిలిమ్ ఛాంబర్, మా అసోసియేషన్ ఇంతగా వెబ్‌సైట్లకు భయపడుతున్నాయా అనేది ఆమె మాటల్లో సారాంశం…
Ads
నిజంగానే మంచు విష్ణు నుంచి ఒక్క మాట కూడా స్పందన లేదు… తనే కాదు, తండ్రి మోహన్‌బాబు, సోదరుడు మనోజ్ కూడా స్పందించినట్టు కనిపించలేదు… కానీ హేమ చెబుతున్నట్టు సదరు వదరు జర్నలిస్టు మంచు లక్ష్మి మీద బాడీ షేమింగు కామెంట్స్ ఏమీ చేయలేదు… మీ వయస్సుకు ఈ డ్రెస్ సెన్స్ ఏమిటి? అందరూ మిమ్మల్ని చూసి మేం ఇలాగే డ్రెస్ చేసుకున్నా పర్లేదు అనుకోరా అనడిగాడు…? అదీ అడిగి ఉండాల్సింది కాదు…
కానీ ఆ ప్రశ్నలో బాడీ షేమింగు ఏముంది..? వస్త్రధారణ గురించిన ప్రస్తావన, అంతే… నిజానికి మంచు లక్ష్మి రియాక్షన్ కూడా అలాగే ఉంది… ‘‘నన్ను అవమానించిన వ్యక్తి ఇంట్లో మహిళలు ఎంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారో… ఆ వెబ్‌సైట్ కనీసం జరిగినదానికి చింతిస్తున్నాం అని రాయలేదు… నేను అపాలజీ అడుగుతున్నా, తప్పేముంది..?
సదరు వదరు జర్నలిస్టు తేజ సజ్జను కూడా ఇలాగే అవమానించాడు… తేజ నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు… ఆ మాటలు విని నేను కూడా హర్టయ్యా… ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది అంటాడేమో ఆ జర్నలిస్టు అనుకున్నాను, వైరల్ అయ్యిందిగా అని లైట్ తీసుకున్నాడు…’’ అని ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చెబుతూ పోయింది…
నిజమే… సదరు వెకిలి మాటలు, కూతల జర్నలిస్టు తేజ సజ్జను అవమానించాడనే విషయం తెలుసు కదా, మరి తనకు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చినట్టు..? ఆ జర్నలిస్టు గురించి అందరికీ తెలుసు, వేణుస్వామి విషయంలో కూడా తనకు సంబంధం లేని ఇష్యూను నెత్తిన మోశాడు, తన తీరే అది… మరి తెలిసినప్పుడు తనను మంచు లక్ష్మి అవాయిడ్ చేసి ఉండాల్సింది…
లేదా ఇంటర్వ్యూలోని ఆ భాగం ప్రసారం చేయకూడదు, నాకిష్టం లేదు అని అక్కడే ఖండితంగా చెప్పి ఉండాల్సింది… ఎలాగూ మొహం పట్టుకుని ఇంటర్వ్యూలోనే దులిపేసిందిగా అతన్ని, తను ఎలాగూ లక్ష్మి ఎదురుదాడికి మొహం మాడిపోయి బ్బెబ్బెబ్బె…
అంతా అయ్యాక ఫిలిమ్ చాంబర్‌కు, మా అసోసియేషన్‌కు ఫిర్యాదు లేఖలు పంపించింది… సరే, ఆ జర్నలిస్టు ఇంట్లో మహిళలు ఎన్ని అవస్థలు పడుతున్నారో అని వాళ్లను ఎందుకు ఇష్యూలోకి లాగడం..? సో, ఇంకా ఇంకా కావాలనే లక్ష్మి దీన్ని సాగదీస్తున్నట్టు కనిపిస్తోంది… అలాంటి వెకిలి కూతల జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే తప్పు..!!
Share this Article