ఎలాగూ వెళ్లిపోయాడు కదా… ఇంకా వాడి గురించి చెప్పుకోవడం దేనికి అనకండి… అసలు బిగ్‌బాస్ గేమ్‌ను, షోను ఎలా భ్రష్టుపట్టిస్తున్నారో చెప్పుకోవడానికి నాగమణికంఠ ఎంపిక, తన ఆట, తన ప్రవర్తన పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్… తను ఇంటికి రాగానే స్వాగతాలు, కేకలు, ఏదో సాధించుకుని వచ్చినట్లు ఆలింగనాలు, అభినందనలు… అది చూశాక ఇది రాయాలనిపించింది…
వెరీ ఫస్టవర్… తను హౌజులోకి వచ్చిన తొలిరోజే అనిల్ రావిపూడితో ఓ ప్రాంక్ ఎలిమినేషన్ చేయించి బిగ్‌బాసే ఓ చెత్తా ఆటకు తెరతీశాడు… అసలే అది మెంటల్ కేసు, దానికితోడు ఈ ప్రాంక్ ఎఫెక్ట్… అప్పట్నుంచే మొదలయ్యాయి మణికంఠలోని అపరిచితుడి విన్యాసాలు…
గుర్తుందా..? ఇంతకన్నా ట్రాన్స్‌పరెంటుగా ఉండలేను బిగ్‌బాస్ అంటూ తన విగ్గు పీకిపడేశాడు… బాగా వైరల్ అయ్యింది… పదే పదే సింపతీ కార్డు ప్లే చేయసాగాడు… నా పెళ్లాం వదిలేసింది, కానీ నాకు ప్రేమ, నా బిడ్డ కూడా నా దగ్గరకు రావాలి, కన్నవాళ్ల అంత్యక్రియలకూ డబ్బుల్లేని దుస్థితి అంటూ ఏడుస్తూ కొన్నిరోజులు నడిపించాడు… తను ఏ పాయింట్ మాట్లాడతాడో కూడా తెలియక, ఎప్పుడెలా బిహేవ్ చేస్తాడో తెలియక తోటి కంటెస్టెంట్లు కూడా భయంభయంగానే మెదలసాగారు…
Ads
అసలు బిగ్‌బాస్ విజేతగా నిలిస్తే పెళ్లాంబిడ్దలు తిరిగి తన దగ్గరకు వస్తారనే వాదనే ఓ మూర్ఖత్వం… అది నమ్మేసి ప్రతిసారీ ఎలిమినేషన్‌లో ఉన్నా సరే ప్రేక్షకులు వోట్లేసి సేవ్ చేశారట… అది అసలు దరిద్రం… అవునులే, గత సీజన్2లో పల్లవి ప్రశాంత్‌కు వోట్లేసి గెలిపించలేదా..?
లేడీ కంటెస్టంట్ల దగ్గరకు వెళ్లి హగ్ చేసుకోవాలనే పిచ్చి మఠికంఠకు… యష్మి అయితే దులపరించుకుంది… బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేసింది… నాగార్జున సుతిమెత్తగా క్లాస్ పీకాడు కూడా… వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక వెనుక నుంచి వాటేసుకోవడం అలవాటు చేసుకున్నాడు… వెళ్లి, ప్లీజ్ ఓ హగ్ ఇవ్వవా అనడుగుతాడు… క్లియర్ కట్ ఎర్రగడ్డ కేసు…
నేను విన్ అయితేనే నా ఫ్యామిలీ నిలబడుతుంది అని మొత్తుకున్నాడా..? 50 రోజులు కూడా నిండకముందే… నా మెంటల్ ఫిట్‌నెస్ సరిగ్గా లేదు, పంపించేయండి అని మొదలుపెట్టాడు… పరీక్షలు చేయించాడు బిగ్‌బాస్… ఫిజికల్లీ వోకే… కానీ నవ్వితే గుండెల్లో నొప్పి వస్తుంది, గేమ్స్ ఆగితే కాళ్లూ చేతులూ విరిగితే నా ఫ్యూచర్ ఏమిటీ అంటాడు… మిగతావాళ్లవి కాళ్లూచేతులు కావా ఏం..?
నాకు వోట్లేయకండి ప్లీజ్ అని ప్రేక్షకులకు హౌజ్ నుంచే దండం పెట్టి విజ్ఞప్తి చేశాడు… రియల్లీ, తనను ఈ రియాలిటీ షోల హౌజులకు కాదు, హాస్పిటల్స్‌కు, సైకియాట్రిస్టుల దగ్గరకు పంపాల్సింది… చివరకు నేను పోతా నేను పోతా అంటున్నా సరే, తనకు గౌతమ్ కృష్ణకన్నా ఎక్కువ వోట్లే పడ్డాయి… సరే, సెల్ఫ్ ఎవిక్షన్ కదా… అర్జున్ నిర్వహించే బజ్ ఇంటర్వ్యూలో మళ్లీ అదే కూత… నేను గెలవడానికి రాలేదు అని… అర్జున్ నోటమాట రాక నిశ్చేష్టుడయ్యాడు కాసేపు…
తన జర్నీ చూపించలేదు, సీక్రెట్ రూంలో పెట్టారు అనే వార్తలొచ్చాయి గానీ… తను ఇంటికి చేరుకున్నాడు… కథ ముగిసిపోయింది… రీ-ఎంట్రీ కూడా సందేహమే… అదే జరిగితే మరీ దరిద్రం… అసలే నయని పావని, గౌతమ్, పృథ్వి వంటి మరికొన్ని తిక్క కేరక్టర్లు అలాగే ఉన్నాయి.., ఈసారి ఎంపికలు పూర్తిగా తప్పు… పలు కోణాల్లో… ప్రేరణ, యష్మి, విష్ణు, నిఖిల్, నబీల్, అవినాష్, హరితేజ, రోహిణి వరకూ వోకే… నిఖిల్ ప్లే కూల్‌గా, స్ట్రాటజిక్‌గా సాగుతోంది… అవినాష్ నుంచే బలమైన పోటీ తనకు…!! అవునూ, ఎందుకు బిగ్‌బాస్‌కు రేటింగ్స్ రావడం లేదా అర్థమైందా స్టార్ మా టీవీకి..? నాగార్జునకు..?
Share this Article