ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేర్చినా సరే, కవితను అరెస్టు చేయడానికి మోడీ ప్రభుత్వం వెనకాడుతోంది… అరెస్టు చేస్తే కేసీయార్ దాన్ని సానుభూతి అస్త్రంగా మార్చుకుంటాడని బీజేపీ భయపడుతోంది… ప్రత్యేకించి మహిళల్లో సానుభూతిని పెంచుకుంటుందనీ, ఆ దిశలోనే కవిత ద్వారా మహిళ రిజర్వేషన్ల పోరాటం అనే కొత్త ఆట మొదలెట్టిందనీ బీజేపీ భావిస్తోంది…… ఈ భావన వచ్చేలా ఆంధ్రజ్యోతి రాజకీయ విశ్లేషకుడు రాధాకృష్ణ ఏదో రాసుకొచ్చాడు…
చిత్రవిచిత్రంగా సాగిపోయిన తన ఎడిటోరియల్ వ్యాసంలో… అద్వానీకి, వాజపేయికి సహాయకుడిగా పరిచర్యలు చేసిన సంగతి మరిచిపోకూడదు మోడీ, చాయ్ అమ్మి పొట్టపోసుకున్న నిజాన్ని మరిచిపోకుండా హుందాగా ఉండాల్సిన అవసరం లేదా అనీ ప్రశ్నించాడు… అంటే ఇప్పుడు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు ఆడే ఆటలకు దాసోహం అనాలా..? అదే హుందాతనమా..? ఏం, బీజేపీ రాజకీయ పార్టీ కాదా..? అదేమైనా అహోబిలం మఠమా..? దానికీ రాజకీయ వ్యూహాలు ఉంటాయి కదా…
పోనీ, ప్రస్తుతం ప్రతిపక్ష స్థానాల్లో ఉన్న నాయకుల్లో ఒక్క నవీన్ పట్నాయక్ మినహాయిస్తే, ఇంకెవ్వరికైనా పిసరంత క్రెడిబులిటీ ఉందా..? అన్నింటికన్నా ప్రధానంగా కవితను అరెస్టు చేయడానికి మోడీ భయపడుతున్నాడనే వాక్యాలు మరింత విస్మయకరం… కవితను అరెస్టు చేస్తే తెలంగాణ మహిళా సమాజం యావత్తు అయ్యో అని కన్నీరు పెట్టుకుంటుందా..? ఒక్కసారి పాత ఉదాహరణలు గుర్తుకు తెచ్చుకుంటే తప్పేమిటి రాధాకృష్ణా..?
Ads
తమిళనాట ఊరూరా బలమైన నెట్‌వర్క్, హార్డ్ కోర్ అభిమానగణం ఉంది డీఎంకే పార్టీకి… అంతటి కరుణానిధి బిడ్డ కనిమొళిని జైలులో పారేస్తే ఎవరూ పట్టించుకోలేదు… నా బిడ్డను అన్యాయం జైలులో పెట్టారు అని కూడా కరుణానిధి గాయిగత్తర చేయలేదు… అంతటి జయలలిత తనే జైలులో పడినా తమిళనాడు పట్టించుకోలేదు… తరువాత ఆమె పార్టీని, తన పొజిషన్‌ను చక్కదిద్దుకుని అధికారం సంపాదించింది తప్ప సానుభూతితో కాదు… జయలలిత వారసురాలిగా ఫోజులు కొట్టిన శశికళ జైలుపాలయితే ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకోలేదు… సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న మాయావతికి ఏం సానుభూతి దక్కింది..? సో, కవితను అరెస్టు చేస్తే అదేదో సానుభూతి వెల్లువెత్తుతుందని బీజేపీ భయపడుతోంది అనే వాదనే అబ్సర్డ్…
పోనీ, మరో కోణం చూద్దాం… కేసీయార్‌తో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది… కవిత మెడ మీద కత్తి వేలాడదీసి మరీ ఈ గేమ్ స్టార్ట్ చేసింది… ఈడీ విచారణ అనేసరికి పోలోమంటూ మంత్రులు, పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు… ఏదో కాసింత హడావుడి… ఈ ప్రత్యేక విమానాలు, ఈ గాయిగత్తర ప్రయత్నాలను బీజేపీ హైకమాండ్ తాపీగా చూస్తోంది…
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే కవిత మీద లిక్కర్ కేసు పెట్టిందనే వాదన పెద్దగా జనంలోకి వెళ్తున్న జాడలేమీ లేవు… ఇన్నేళ్లూ కాంగ్రెస్‌ను తొక్కీ తొక్కీ, దారుణంగా దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీతో… ఇప్పుడు అవసరార్థం బీఆర్ఎస్ పొత్తుకు సిద్ధపడుతున్న తీరును… ఎటూ ఏ దిక్కులేక లెఫ్ట్ కూడా కలిసివస్తున్న దృశ్యాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది నిశ్శబ్దంగా… బీజేపీ హైకమాండ్‌తో సహా… ఎటొచ్చీ బీజేపీకి తెలంగాణలో పెద్ద డ్రాబ్యాక్ ఏమిటంటే, సరైన నాయకుడు లేకపోవడం…!!
రాధాకృష్ణ తెగబాధపడిపోయాడు… అరెరె, మా చంద్రబాబు అస్త్రసన్యాసం చేశాడు, తన స్వీయ కారణాల కోసం… చక్రాలు తిప్పిన అనుభవం ఉన్న చంద్రబాబు వంటి ప్రాంతీయ పార్టీల అనుసంధానకర్త లేకపోయాడే, అయ్యో, ఇక ఈ దేశం ఏమైపోవాలీ అని కలంతో కంటతడి పెట్టుకున్నాడు… నిస్వార్థంగా, ఒక్క పదవీ ఆశించకుండా కేవలం దేశం కోసం చక్రాలు తిప్పాడు అని ఓ ఫేక్ సర్టిఫికెట్టు కూడా ఇచ్చుకున్నాడు… చంద్రబాబూ, నువ్వు పూనుకో అని కేవీపీ కోరడాన్ని పదే పదే రాసుకుని మురిసిపోయాడు… కేవీపీయే ఓ ఆండ్రోపాజ్ కేసు… పైగా పత్రికలకు మాత్రమే పరిమితమైన లీడర్… ఏదో వైఎస్ పుణ్యమాని మస్తు వెనకేసుకున్నాడు గానీ, కాంగ్రెస్ అలాంటి నేతల్ని నమ్ముకుంటుంది గానీ… ఈ కేవీపీలతో ఒరిగేదేముంది..? ఊడిపోయేదేముంది..?
Share this Article