ఈరోజు పత్రికల్లో ప్రధాన వార్తల్లో ఒకటి… ఆదానీ విదేశాల నుంచి బొగ్గు తీసుకొచ్చి, దేశంలోని పవర్ జనరేటింగ్ యూనిట్లకు తప్పుడు లెక్కలతో ఎక్కువ ధరలకు అంటగట్టి వేల కోట్లు అక్రమంగా దండుకున్నాడని సారాంశం… రాహుల్ గాంధీ కూడా ఇదే ఆరోపణల్ని చేశాడు… బాలకృష్ణ తాజా సినిమా నేలకొండ భగవంత్ కేసరి చూస్తుంటే ఆదానీ గుర్తొచ్చాడు… ఈ సినిమా నిర్మాతలకు ఆదానీ మీద ఇదేం వ్యతిరేకత అనీ అనపించింది ఒకింత… ఎందుకంటే..?
ఆదానీ అనగానే గుర్తొచ్చేది మోడీకి, బీజేపీకి తనకు ఉన్న సాన్నిహిత్యం… అఫ్‌కోర్స్, పార్టీలకూ ప్రధాన వ్యాపారులకూ బంధాలు కొత్తేమీ కాదు… కాకపోతే బీజేపీ ప్రభుత్వం ఆదానీకి అనుచిత ఫాయిదాను కలిగించడానికి దేనికైనా తెగిస్తుందనేది కదా ఆరోపణ… ప్రత్యేకించి ఈ బొగ్గు కథకన్నా ఆదానీ పేరు వినగానే స్పురించేది తను దేశంలోని అన్ని ప్రధాన పోర్టుల మీదా కన్నేసి హస్తగతం చేసుకోవడం… మన కృష్ణపట్నం పోర్టు మీద అన్నిరకాల ప్రయత్నాలు చేసి తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ఆదానీ పోర్టుల నిర్వహణ పేరిట దాదాపు అన్ని పోర్టుల మీద తన జెండా ఎగరేశాడు…
ఎస్, బాలయ్య కేసరి సినిమాలో విలన్ కూడా సేమ్… అన్ని పోర్టుల మీదా పెత్తనం… ఏకంగా విలన్‌కు ఆదానీ మీద వచ్చే విమర్శల్ని లక్షణాలుగా పెట్టడం, ఒకరకంగా ఆదానీని ప్రాజెక్టు వి పేరిట విలన్‌గా చూపించడం ఎందుకు..? అసలు ఈ నిర్మాతలు, హీరో, దర్శకుడి ఉద్దేశం ఏమిటి..? బాలయ్య టీడీపీ… ఇప్పుడు బీజేపీతో గోక్కునే స్థితిలో లేడు… పైగా బాబ్బాబూ అంటూ మోడీ కరుణ కోసం వెంపర్లాడుతున్నారు… నిర్మాతల పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ తెలియదు… దర్శకుడికి ఈ రాజకీయాలు పెద్దగా పట్టవు… మరేమిటిది..? నంబర్ వన్ రిచ్ స్థానం కోసం తాపత్రయపడే వ్యక్తులు ప్రస్తుతం దేశంలో ఉన్నది ఒకరు అంబానీ, దీటుగా ఆదానీ… వాళ్లే కదా…
Ads
ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే అంబానీలు, ఆదానీలు తమ లబ్ది కోసం ఆయా పార్టీల ముఖ్యులతో బాగానే ఉంటారు… పార్టీలకు కావల్సింది డబ్బు… ఏ పార్టీకైనా ధనసేకరణ తప్పదు… రేప్పొద్దున ఇదే రాహుల్ ప్రధాని అయితే, నాలుగు రోజులకే ఆదానీ తనతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటాడు… అది అవసరం…
అవసరమైతే ఏ కన్నడ రాజకీయ వ్యాపారి డీకే శివకుమారో మధ్యవర్తి అవుతాడు… అంతేతప్ప ఇప్పుడు బీజేపీతో అంటకాగుతున్నాడు కదాని కాంగ్రెస్ తనను వదిలేయదు… అవసరమైతే మెడపై కేసుల కత్తులు వేలాడదీసి మరింత ఒత్తిడి పెట్టి కాస్త ఎక్కువే గుంజుతారు… ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే… హఠాత్తుగా ఆదానీ మీద పడ్డారెందుకు అని..! సినిమాలో ఆదానీ దోస్త్ జగన్ మీద కూడా ఏదో ఓ సెటైర్ డైలాగ్ కూడా ఉంది…
విలన్ పాత్రధారి పేరు రాహుల్ సింఘ్వీ… ఈ సర్‌నేమ్ ఉన్నవాళ్లు ఎక్కువగా గుజరాతీలు… జైన వైశ్యులు… సేమ్, ఆదానీ కూడా అదే… సో, ఆదానీ కుల, ప్రాంత, మత నేపథ్యమూ ఇలా కలిపాడా అనిల్ రావిపూడి… అబ్బే, యాదృచ్ఛికం, ఉద్దేశపూర్వకం కాదు అంటారేమో… ఆ సమర్థన అతకదు రావిపూడీ… ఐనా కేసీపీడీ మార్క్ సినిమాలు తీసుకోక నీకెందుకు ఈ గోకుడు యవ్వారం..?!
Share this Article