.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుడిని పార్టీ శ్రేణులు మళ్లీ ఎన్నుకున్నాయి… నిజానికి ఈ వార్త పెద్ద ఆశ్చర్యమూ కాదు, విశేషమూ కాదు… ఆయన పేరుకు బదులు మరో పేరు వినిపించే సవాలే లేదు… తను ఉన్నన్ని రోజులూ పార్టీకి తనే సర్వాధ్యక్షుడు…
ఒకవేళ తను ఎన్టీయార్ నుంచి పార్టీని లాక్కున్నట్టుగా ఎవరైనా లాక్కుంటే తప్ప… అలాంటి ప్రమాదాన్ని చంద్రబాబు ఎలాగూ రానివ్వడు… తనెవరినీ నమ్మేది లేదు… ఒకవేళ కుటుంబంలోనే ఎవరైనా అలా చేస్తారని అనుకున్నా… అంత సీన్ ఉన్న లీడర్ ఎవరూ లేరు కుటుంబంలో…
Ads
ఆ పాపులారిటీ ఉన్న బాలకృష్ణది నిజానికి పొలిటిషియన్ తత్వం కాదు… అంటే, ఓ పార్టీని ఈ రోజుల్లో లీడ్ చేయడం తనతోకాదు… పైగా బాలయ్యతో వియ్యం పొంది అలాంటి అవకాశాలు, ప్రమాదాలకు పురిట్లోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు చంద్రబాబు…
సో, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అనేది ఓ ఫార్మాలిటీ మాత్రమే… గతంలో ఉమ్మడి ఏపీలో తను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా సరిపోయింది… కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలు, ఎలాగూ ఏపీ తన సొంత రాష్ట్రం, తన కార్యక్షేత్రం… తెలంగాణ మీద కూడా కన్నున్నా సరే, రెండు పడవల మీద అధ్యక్ష స్వారీ చేయలేడు కదా…
అందుకని జాతీయ అధ్యక్ష పదవి తెరపైకి వచ్చింది… జాతీయ పార్టీగా అధికారిక గుర్తింపు లభించేంత సీన్ లేకపోయినా సరే, పార్టీని జాతీయ పార్టీగానే పరిగణిస్తున్నారు… కానీ అధికారికంగా జాతీయ పార్టీ కావాలంటే ఇతర రాష్ట్రాల్లోనూ వోట్లు, సీట్లు రావాలి, దానికీ లెక్కలున్నాయి…
నిజంగా పాపులర్ పార్టీలతో గనుక అవగాహనో పొత్తో కుదుర్చుకుని మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఒకటీరెండు సీట్లు, కాసిన్ని వోట్లు వస్తాయి, కనీసం తెలంగాణలో కూడా ఆ ప్రయత్నం లేదు… వెరసి ఎన్నికల సంఘం దృష్టిలో అది జాతీయ పార్టీ కాదు… అది అటు ఉంచితే…
తెలుగుదేశానికి అండమాన్‌లో బేస్ ఉంది… ప్రయత్నిస్తే బళ్లారి, బరంపురం, చెన్నె, ఏపీ సరిహద్దు తెలంగాణ ప్రాంతాల్లో సొంత వోట్లున్నాయి, ఎంతోకొంత బలముంది… పార్టీ శాఖలు కూడా ఉన్నట్టున్నాయి… సరే, అవన్నీ జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్ర శాఖలు అనుకుందాం… కానీ అమెరికాలో, కెనడాలో, లండన్ తదితర తెలుగువారు అధికంగా ఉన్న దేశాల్లో కూడా పార్టీ విభాగాలున్నాయి… రకరకాల పేర్లతో…
అలాంటప్పుడు పార్టీని అంతర్జాతీయ పార్టీగా ఎందుకు చెప్పుకోకూడదు… జాతీయ అధ్యక్షుడిగా లోకేష్‌ను పెట్టేసి, తన మీద మరిన్ని బాధ్యతలు మోపి, తనెందుకు అంతర్జాతీయ అధ్యక్షుడు కాకూడదు… ఎలాగూ తెలంగాణ, ఏపీలకు వేర్వేరు అధ్యక్షులను పెడతారు కదా… ఇదీ ఓ మిత్రుడి ప్రశ్న… విలువైనదే..!!బాబు గారూ, మీరేమంటారు..?
Share this Article