ఒక వార్త… కర్నాటకలోని హెబ్బాళలో ఓ హైస్కూల్ ఉంది… అది సింధీల స్కూల్… ఇప్పుడది వివాదంలో ఇరుక్కుంది… ఎందుకంటే..? అది తమ విద్యార్థుల సిలబస్‌లో ఏడవ తరగతి పాఠ్యాంశాల్లో ప్రముఖ సింధీ వ్యక్తుల పేరిట రణవీర్‌సింగ్, తమన్నా భాటియా పేర్లను, వారి వివరాలను చేర్చింది…
ఇదీ వివాదం… వెంటనే ఆ స్కూల్‌లో చదివే విద్యార్థులు ఏకంగా బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు… (అందులో సింధీలే గాకుండా ఇతర పిల్లలూ చదువుతారు)… ఏమనీ అంటే… పలు చిత్రాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశం చేయడం ఏమిటీ, నాన్సెన్స్, వెంటనే దాన్ని తీసేయాలి అని…
అంతేకాదు, సింధీ సామాజికవర్గంలో బోలెడు మంది సెలబ్రిటీలు, కళాకారులు ఉన్నారు, వాళ్ల గురించి పిల్లలకు చెప్పండి పర్లేదు, మాకు అభ్యంతరం లేదు అనేది వారి వాదన… మొదట ఇలా వ్యతిరేకించే వాళ్ల పిల్లలకు టీసీలు ఇస్తామని బెదిరించిన యాజమాన్యం ఇప్పుడు ఏకంగా బాల్ బాలల హక్కుల రక్షణ సంఘం దాకా వెళ్లేసరికి తల్లిదండ్రులను బుజ్జగించే పనిలో పడింది…
Ads
అబ్బే, ఇది మెయిన్ సిలబస్ కాదు, ఇది సెలబసేతర అంశం మాత్రమే… దేశవిభజన అనంతరం సింధీ సామాజికవర్గ ప్రజల జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయో పిల్లలకు చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం, ఐనా తమన్నా జీవితం కూడా సినిమా ఫీల్డులో ఓ సక్సెస్ స్టోరీయే కదా అని చెబుతోంది…
ఎస్, సింధీలు దేశవిభజన తరువాత బాగా చెల్లాచెదురైన జాతి… ఎక్కడెక్కడికో వలస వెళ్లారు… మహా అయితే ఇప్పుడు 30 లక్షల మంది ఉంటారేమో… కానీ తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు… వీరిలోనూ వేర్వేరు మతాలున్నయ్… చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులున్నారు ఈ జాతి నుంచి… ఐతే తమన్నాను ఎందుకు వద్దంంటున్నారు..? ఇదీ ప్రశ్న…
అంటే రణవీర్ సింగ్ పాఠం ఉండొచ్చు గానీ తమన్నా గురించి చెప్పకూడదట… ఎలా నటిస్తుందనేది ఆమె వృత్తికి సంబంధించింది… ఆమె మరీ జాతి చీదరగా చూడాల్సిన శృంగార తార ఏమీ కాదు… ఆ ఫీల్డే అలాంటిది, కురచ దుస్తులు, వెగటు స్టెప్పులు గట్రా ఉంటాయి…
ఆమె సరే… వెకిలి వేషాలు, తిక్క తిక్క వెగటు పాటలు పాడిన ఎందరు పాత హీరోలు, హీరోయిన్లు, తారలు సీఎంలు కాలేదు, మంత్రులు కాలేదు, జాతిపురుషులుగా ఈరోజుకూ కీర్తించబడటం లేదు… అంతెందుకు కంగనా రనౌత్ వేసిన వేషాలు తెలియవా..?
కొందరికైతే ఏకంగా భారత రత్న ఇవ్వాలని కూడా డిమాండ్లున్నాయి కదా… తమన్నా భాటియా గురించి సింధీ జాతి తమ బిడ్డ అని చెప్పుకుంటే తప్పేమిటి..? ఎస్, సినిమా ఫీల్డులో ఆ రేంజ్‌కు ఎదగడం మామూలు విషయమేమీ కాదు… కష్టపడకుండా ఆమె ఎదగలేదు… ఏదో ఒక ఇష్యూ కావాలి కొంతమందికి… ఇప్పుడు తమన్నా దొరికింది వాళ్లకు… అంతే..!! ఒక రష్మిక ఒక సక్సెస్ స్టోరీ, ఒక సాయిపల్లవి ఒక సక్సెస్ స్టోరీ… ఏవో మారుమూల ప్రాంతాలకు చెందిన వాళ్ల కులాలకు వాళ్లు స్పూర్తి, తప్పేముంది..? అలాగే తమన్నా భాటియా కూడా..!!
Share this Article