Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బో… కేజ్రీవాల్ కథ పెద్దదే… తవ్వేకొద్దీ చాలా యవ్వారాలు…

March 28, 2024 by M S R

భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నది బ్రిటన్, జెర్మనీ, అమెరికాలలో అన్నది తెలిసిందే! అయితే ఇప్పటివరకు రాహుల్ మాత్రమే ఈ దేశాలతో కలిసి పని చేయడం తెలుసు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కేజ్రీవాల్ కూడా చేరిపోయాడు! అలా అని కేజ్రీవాల్ కి సంబంధం లేదు అని కాదు, కానీ ఇన్నాళ్ళూ ఒక రూమర్ ప్రచారంలో ఉండేది, ఇప్పుడు బయటపడిన వైనం వెలుగులోకి వచ్చింది!

ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ అవకముందే కవిత అరెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే! ఆప్ రాజ్యసభ సభ్యుడు, కొత్త పెళ్లికొడుకు అయిన రాఘవ్ ఛద్ధా మార్చి 8 న లండన్ వెళ్ళిపోయాడు. ఏదో కంటి చికిత్స కోసం లండన్ వెళ్ళాడు అని ఉవాచ! ఢిల్లీలో రాజకీయం రసకందాన పడ్డా రాఘవ్ చద్దా లండన్లోనే ఉండిపోయాడు తప్పితే ఢిల్లీ రాలేదు. మరీ అంతగా ఢిల్లీలో కాని శస్త్ర చికిత్స లండన్లో ఏముందబ్బా?

రాఘవ్ చద్ధా with ప్రీత్ కౌర్ గిల్ !
Yes! రాఘవ్ చద్దా బ్రిటీష్ లేబర్ పార్టీ ఎంపీ అయిన ప్రీత్ కౌర్ గిల్ ను కలిశాడు. ఒక భారత ఎంపీ ఒక బ్రిటన్ ఎంపీని కలవడం అనేది ఏదో మర్యాదపూర్వకంగా కలిశారు అని అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే ప్రీత్ కౌర్ గిల్ బహిరంగంగానే ఖలిస్థాన్ వేర్పాటు వాదాన్ని బలపరిచారు! అలాంటి ప్రీత్ కౌర్ గిల్ ను పంజాబ్ నుండి రాజ్యసభకు ఎన్నికయిన రాఘవ్ చద్దా కలవడం అనేది అనుమానించాల్సిందే!

Ads

కేజ్రీ వాల్ అరెస్ట్ అవవచ్చు అని ముందే ఊహించి రాఘవ్ చద్దా ముందుగానే లండన్ వెళ్ళాడు. లేబర్ పార్టీ ఎంపీ అయిన ప్రీత్ కౌర్ గిల్ చేత కేజ్రీవాల్ అరెస్టు మీద ఒత్తిడి చేయించే విధంగా ప్రకటన చేయించాలనే ప్రయత్నంలో భాగంగా రాఘవ చద్ధ లాబీయింగ్ చేస్తున్నాడు. దాని కోసం ఖలిస్థాన్ ను బహిరంగంగానే సమర్థించే ప్రీత్ కౌర్ గిల్ తో సమావేశం అయ్యాడు!

అనవసరంగా EAM జైశంకర్ తో ఎందుకూ అని అనుకున్నట్లున్నారు బ్రిటన్ పెద్దలు, ప్రకటన అమెరికా చేత చేయించారు. కానీ EAM జైశంకర్ అమెరికాకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. So! ఖలిస్తాన్ వేర్పాటు వాదుల నుండి గట్టిగానే తీసుకున్నాడు కేజ్రీవాల్!

*******”
రాఘవ్ చద్దా with టైగర్ హనీఫ్ ! రాఘవ్ చద్దా లండన్లో టైగర్ హనీఫ్ తో కూడా భేటీ అయ్యాడు! టైగర్ హనీఫ్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు! ఈవార్త నిన్న వెలుగులోకి వచ్చింది! So! కేజ్రీవాల్ – జార్జ్ సోరొస్ – ఖలిస్థాన్ – లండన్ – కెనడా – జెర్మనీ – అమెరికా. ఇదొక గొలుసుకట్టు వ్యవహారం! మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఆప్ కేజ్రీవాల్! 9సార్లు సమన్లు ఇచ్చినా నిబ్బరంగా ఉన్నాడు అంటే తన వెనక ఉన్నవారి బలం తోనే అన్నది స్పష్టం!

********
కానీ ఇక్కడ ఒక విషయం గురించి చెప్పుకోవాలి ! CIA కావొచ్చు, జార్జ్ సోరోస్ కావొచ్చు, ఏమాత్రం పరిస్థితులు తమకి అనుకూలంగా లేకపోయినా అప్పటి వరకు తాము అండగా నిలిచిన వాళ్ళని ఒదిలేసి పక్కకి తప్పుకోవడం ఆనవాయితీ!

*********
బహుశా గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటన CIA చేతులు ఎత్తేయడం వల్ల అనుకోవచ్చు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్ (Sikh for Justice) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్ను తాను 2014 నుండి 2022 వరకూ 16 మిలియన్ డాలర్లు కేజ్రీవాల్ కి ఇచ్చామని బహిరంగ ప్రకటన చేశాడు.

ఖలిస్థాన్ కి మద్దతు ఇవ్వడంతో పాటు టెర్రరిస్టు భుల్లార్ ను విడిపిస్తాను అని హామీ ఇచ్చి డబ్బు తీసుకున్నాడు అని కూడా ప్రకటించాడు. 2014 లో కేజ్రీవాల్ అమెరికా వచ్చినపుడు న్యూయార్క్ నగరంలో ఉన్న రిచ్మండ్ హిల్స్ (Richmond Hills NY) లో ఉన్న గురుద్వారాలో ఖలిస్తానీ గ్రూపుల సమావేశంలో ఒప్పందం జరిగినట్లు గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటన చేశాడు!

దేవిందర్ పాల్ సింగ్ భూల్లార్ ను జైలు నుండి బయటకి తెస్తాను అని హామీ ఇచ్చాడు కేజ్రివాల్ ఖాలిస్థాన్ గ్రూపులకి! ఎవరీ దేవిందర్ పాల్ సింగ్ భుల్లార్? భుల్లార్ ఢిల్లీ లో 1993 లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఆ పేలుళ్లలో 9 మంది చనిపోయారు మరియు 31 మంది గాయపడ్డారు. నేరం నిరూపించబడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

కేజ్రీవాల్ కి ఇచ్చిన 16 మిలియన్ డాలర్లలో భుల్లర్ నీ విడిపించే కాస్ట్ కూడా కలిసి ఉంది. అయితే కేవలం ప్రకటన చేసినందున భారత్ లో కేసు నమోదు చేయలేరు! ఆప్ పార్టీకి ఏ ఏ మార్గాల ద్వారా ఎలా డబ్బు పంపించారో డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఇస్తేనే కానీ కేసు నమోదు చేయలేరు. ఈ పని పన్ను చేయగలడా?

అసలు కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటన ఎందుకు చేశాడు? ప్రకటన చేసే ముందు CIA కి చెప్పాడా? ప్రకటన చేయడానికీ అమెరికా కానీ కెనడా కానీ అనుమతి ఎందుకు ఇచ్చాయి? గురుపత్వంత్ ను RAW హత్య చేయడానికి ప్రయత్నించడం వల్ల అమెరికా MQ9B UAV ల అమ్మకాన్ని నిలిపివేసింది అంటూ ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం అబద్దం అని తేలిపోయినట్లేగా?

ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే RAW భయంతో 5 గురు బౌన్సర్లని పెట్టుకొని తిరుగుతున్నాడు పన్ను! కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ప్రకటన చేశాడు అంటే ఇక వీడితో మన పని కాదు అని నిర్ధారణ చేసుకొని, నీ రక్షణ నువ్వే చూసుకో అని సలహా ఇచ్చి ఉంటుంది CIA. రాహుల్ వల్ల కానిది కేజ్రీవాల్ తో అవుతుంది అని ఇన్నాళ్ళూ చాటుగా సహాయం చేసిన అమెరికా, కెనడా , బ్రిటన్ దేశాలు ఇక కాపాడుకోవడం తమ వల్ల కాదని నిర్ధారణకి వచ్చి కేజ్రీవాల్ ను కూడా పక్కన పెట్టీ ఉంటాయి.

*******
PMLA ( Prevention of Money Laundering Act) అనేది మన దేశంలో మాత్రమే ఉంది అనుకుంటే పొరపాటే! FATF (Financial Action Task Force) అనేది అంతర్జాతీయ సంస్థ. FATF ఉగ్రవాద కార్యకలాపాలకు మనీ లాండరింగ్ ద్వారా డబ్బు అందకుండా చేయటం కోసం విధి విధానాలు రూపొందించింది. FATF కి అనుగుణంగా అన్ని దేశాలు చట్టాలు చేశాయి. ఈ చట్టాలు సక్రమంగా అమలు చేయని దేశాలని FATF Grey, Black లిస్టులో పెట్టీ అప్పులు పుట్టకుండా చేస్తున్నది. ఇప్పుడు కేజ్రీవాల్ కేసు మనీ లాండరింగ్ కి సంబంధించింది కాబట్టి గట్టిగా మాట్లాడలేరు!

********
సునీతా కేజ్రీవాల్ ప్రకటన! నిన్న సునీతా కేజ్రీవాల్ ఒక ప్రకటన చేస్తూ మద్యం స్కాంలో డబ్బులు ఎక్కడికి వెళ్లాయో వెల్లడిస్తానని తెలిపింది! కానీ ఈ రోజు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. బహుశా అమెరికా నుండి ఏదో సందేశం వచ్చి ఉంటుంది!

*********
అమెరికా మళ్లీ ఈ రోజు కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ ల గురుంచి జోక్యం చేసుకొని నోరు పారేసుకుంది. ప్రజాస్వామ్యం, హక్కులు అంటూ తెగ మాట్లాడింది. నిన్న అమెరికన్ దౌత్యవేత్తను పిలిచి క్లాస్ తీసుకున్నారు EAM జైశంకర్. కానీ ఈ రోజు మళ్లీ పాత పాట పాడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అకౌంట్లని ఇన్కమ్ టాక్స్ విభాగం సీజ్ చేసిన సంగతి తెలిసిందే! అలా చేయటం అప్రజాస్వామికం అట.

మూడు సంవత్సరాల ఆదాయ పన్ను కట్టకుండా కాలయాపన చేయడం మళ్లీ మళ్లీ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఇన్కమ్ టాక్స్ విభాగం పార్టీ అకౌంట్లను సీజ్ చేసింది. ఈ విషయం మీద కోర్టులో పిటిషన్ వేసింది కాంగ్రెస్ కానీ కోర్టు కొట్టివేసింది. సో! జో బిడెన్ మంత్రాంగం ఆసియాలో ఉన్న మరొక మిత్రదేశంను కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలను ఇస్తున్నది.

మరోవైపు ఫార్మా రంగంలో జెర్మనీతో చేస్తున్న వాణిజ్యం తగ్గించుకొని రష్యాతో దానిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది భారత్! ఇది జెర్మనీకి పెద్ద దెబ్బ! కేజ్రీవాల్ కోసం, కాంగ్రెస్ కోసం జో బిడెన్ భారత్ తో శతృత్వం కోరి కొనుక్కుంటున్నాడు! ఇంత పిచ్చి విదేశాంగ విధానం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారిగా చూస్తున్నాము!

******
ఆప్ పార్టీ కి కొత్త గండం!
ED కస్టడీ లో ఉన్న కేజ్రీవాల్ ఢిల్లీ మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా రెండు పత్రాలను మీడియా ముందు చూపెట్టారు. వాటిలో ముఖ్యమంత్రి సంతకం ఉంది. మరో వైపు కస్టడీ లో ఉన్న కేజ్రీవాల్ కి లాప్ టాప్ కోసం అనుమతి ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు అధికార పత్రాల మీద కేజ్రీవాల్ సంతకం ఎలా వచ్చింది?

టెక్నికల్ గా చూస్తే అది ఫోర్జరీ కిందకి వస్తుంది. ఆఫ్కొర్స్ డిజిటల్ సిగ్నేచర్ ను వాడారు ఆప్ మంత్రులు. కానీ అలా చేయడం నేరంగా పరిగణిస్తారు! కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయలేడు! దీని మీద దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

*********
అసలు విషయానికి వద్దాం! లిక్కర్ కుంభకోణం అనేది ఒక కారణం మాత్రమే! పాకిస్థాన్, ISI, ఖలిస్థాన్, CIA, జార్జ్ సోరోస్ లింకులు బయటపెట్టడం ప్రధాన లక్ష్యం! అప్పటి వరకూ కేజ్రీవాల్ బయటకి రాడు. ఈ రోజు CBI తన కస్టడీకి ఇవ్వమని కోరింది. CBI కస్టడీ ఆయన తరువాత NIA కస్టడీలోకి తీసుకుంటుంది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions