.
బ్రేక్ ఫాస్ట్ అంటే… పొద్దున్నే ఉపాహారం, అల్పాహారం, టిఫిన్లు… అనగానే గుర్తొచ్చేవి ఏమిటి మనకు..? ఇడ్లీ, ఉప్మా, దోశ, పోహా (ఉగ్గాణి), అట్లు, పూరీ… ఈమధ్య బోండా… అంతే కదా దాదాపుగా… సౌత్ ఇండియాలో దాదాపు అంతే కదా…
ష్… చాలా ఇళ్లల్లో రాత్రి మిగిలిపోయిన అన్నాన్నే ఫ్రై చేసి ఫాస్ట్‌ను బ్రేక్ చేయడమే ఎక్కువ… బిర్యానీలు, నాన్స్ గట్రా పారేయలేం కదా, వేడి చేసుకుని లాగించడమే… ఇప్పుడు మధుమేహం బాగా పెరిగిపోయాక, ఒబేసిటీ తరుముతుంటే మళ్లీ మన పాత గట్క, మన పాత సంకటి కూడా ప్లేట్లలో కనిపిస్తున్నాయి… సరే, అది వేరే సంగతి…
Ads
నార్త్ స్టేట్స్‌లో కాస్త డిఫరెంట్… పావ్ బాజీ వంటివి… మనలో చాలామందికి అనిపిస్తుంది, అరె, పొద్దున్నే ఆ డబుల్ రొట్టె, బన్ను ఏమిట్రా బాబూ అని… సరే, ఎక్కడి అలవాటు అక్కడిది… మీ పూరీ, వడ, బోండా వంటి ఆయిల్ ఫుడ్‌కన్నా మేమే నయం కదాని వాళ్లు అంటారేమో మనల్ని…
మరి వేరే కంట్రీస్..? అనేక రకాలు… వరల్డ్ ఫేమస్ రెసిపీ ర్యాంకింగ్ సైట్ తెలుసు కదా, టేస్ట్ అట్లాస్… వాడి గుర్తింపు, ర్యాంకులు విస్మయం కలిగిస్తాయి అదేమిటో గానీ…
తాజాగా వాడు బ్రేక్ ఫాస్ట్‌లకు టాప్50 ర్యాంకింగ్స్ ఇచ్చాడు… అందులో పైన మనం చెప్పుకున్నవాటిల్లో ఒక్కటీ లేదు… మరి వాడి ఎంపికకు ప్రాతిపదిక ఏమిటో తెలియదు గానీ… టాప్ 18 స్థానంలో మన ఇండియాకు చెందిన పావ్ బాజీ పేరు కనిపించింది… పావ్ అంటే డబల్ రొట్టె, బాజీ అంటే కూర…
వోకే, బాగానే ఉంటుంది… వడ పావ్, పావ్ బాజీ అనేవి బాగానే ఉంటాయి గానీ… మరీ పొద్దున్నే చేసుకునే టిఫినీలు కావు కదా అవి… పైగా ఇది ప్రధానంగా స్ట్రీట్ ఫుడ్ ఐనా వాడికెందుకు అవన్నీ… 23వ స్థానంలో పరాఠా పేరు కనిపించింది… ఇదీ అంతే… పొద్దున్నే హెవీ టిఫిన్… పరాఠా టిఫినీ మాత్రమే కాదు, చాలాసార్లు మెయిన్ కోర్స్ కూడా…
ఛోలే బతురే 32వ ప్లేసులో ఉంది… ఇదీ కాస్త హెవీ అనిపించినా… పంజాబ్, ఢిల్లీ, హర్యానా వంటి ప్రాంతాల్లో చల్తా… అవునూ, ఈ ఎంపికలకు పాపులారిటీ ప్రాతిపదికా..? టేస్టా..? వోటింగా..? ఏది..? అదే తెలియదు… పాపులర్, మోస్ట్ కన్జ్యూమ్‌డ్ ప్రాతిపదికలు అయితే మాత్రం ఇడ్లీలు, దోశెల్ని కొట్టే బ్రేక్ ఫాస్ట్ లేదు… అఫ్‌కోర్స్, ఇండియాలో… ఎక్కడెక్కడో ఉన్న ఇండియన్ డైనింగ్ హాళ్లలో..!
Share this Article