Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెఠీలో స్మృతి జోలికి పోవద్దు సరే… రాయబరేలీయే ఎందుకు..?

May 3, 2024 by M S R

Nancharaiah Merugumala……… అమెఠీలో గుజరాతీ పార్శీల కోడలు స్మృతి చేతిలో రెండోసారి ఓడిపోవడం మరో పార్శీ ప్రముఖుడు ఫిరోజ్‌ గాంధీ మనవడు రాహుల్‌ కు ఇబ్బందికరమే మరి!

‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే అత్యంత సురక్షిత స్థానం
––––––––––––––––––––––
ఒక గుజరాతీ జొరాస్ట్రియన్‌ (జుబిన్‌ ఇరానీ) భార్య స్మృతి ‘మల్హోత్రా’ ఇరానీ చేతిలో వరుసగా రెండోసారి బాబాయి ఒరిజినల్‌ సీటు అమేఠీలో ఓడిపోవడం ఎందుకో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఇష్టం లేదనుకుంటా… తొలి ప్రధాని పండిత నెహ్రూ ఏకైక అల్లుడిగానే గాక యూపీలో స్థిరపడిన గుజరాతీ జొరాస్ట్రియన్‌ గా కూడా భారత ప్రజలకు తెలిసిన ఫిరోజ్‌ ‘జహంగీర్‌’ గాంధీ మనవడిగా రాహుల్‌ కు మరో జొరాస్ట్రియన్‌ జుబిన్‌ రెండో భార్య, ప్రఖ్యాత నటి స్మృతి చేతిలో పరాజయం పాలవడం అవమానకరంగా కనిపించి ఉండాలి..
(ఫిరోజ్‌ గాంధీ అసలు పేరు ఫిరోజ్‌ ఖాన్‌ అని 70 ఏళ్ల నుంచీ సంఘ్‌ పరివారం పగలనకా రేత్తిరనకా దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే) అందుకే ఆయన ‘అమ్మ ఒడి’ గా పరిగణించే రాయ్‌ బరేలీ (తల్లి సోనియా మొన్ననే వదిలి రాజ్యసభకు పోయిన సీటు) నుంచి ఈరోజు నామినేషన్‌ వేయాలని నిర్ణయించుకున్నాడు. నాయనమ్మ ఇందిరా ప్రియదర్శిని మూడుసార్లు (1967, 1971, 1980) గెలిచి, ఒక్కసారి మాత్రమే ఓటమిపాలైనా రాయ్‌ బరేలీ మాత్రం తన తల్లి సోనియాకు పోటీచేసిన ప్రతిసారీ విజయాన్నే అందించింది.
గుజరాతీ కుటుంబంలో నాటి బొంబాయి నగరంలో పుట్టిన గొప్ప పార్లమెంటేరియన్‌ ఫిరోజ్‌ గాంధీ తర్వాత యూపీ ప్రధాన నగరం అలహాబాద్‌ లో స్థిరపడడంతో ఇందిరతో పెళ్లి అయింది. అక్కడికి దాదాపు 125 కి.మీ ఎగువన ఉన్న రాయ్‌ బరేలీ నుంచి 1952, 1957 నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌ సభకు ఎన్నికై దేశానికి ఎనలేని సేవ చేశారు ఫిరోజ్‌ సాహబ్‌. మామ పాలనలోని రెండు భారీ ఆర్థిక కుంభకోణాలు వెలికి తీసి నెహ్రూ కేబినెట్లో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి గారి రాజీనామాకు కారకులయ్యారు ఫిరోజ్‌.
ఒకవేళ నెహ్రూ– గాంధీ కుటుంబానికి కొత్త తరం అల్లుడు రాబర్ట్‌ వాడ్రాకు అమేఠీ నుంచి పోటీచేసే అవకాశం ఇస్తే– ప్రియాంక ప్రియ భర్త కూడా ఆమె తాత ఫిరోజ్‌ గాంధీ దారిలో పార్లమెంటరీ రాజకీయాల్లో పైకొచ్చేవాడేమో. 25% కశ్మీరీ, 25% గుజరాతీ పార్శీ, 50 శాతం ఇటాలియన్‌ రోమన్‌ కేథలిక్‌ శారీరక వారసత్వం ఉన్న వాయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీతో పోల్చితే అంత కంటే ఎక్కువ విభిన్నమైన కుటుంబ నేపథ్యం స్మృతి ఇరానీది. అలాంటి పూర్వ టెలివిజన్, సినీనటి స్మృతి ముందు రాహుల్‌ గాంధీకి పరాజయ భారంతో రెండోసారి తలొంచడం కాస్త ఇబ్బందికరమే మరి.
May be an image of 1 person and beard
స్మృతి ఇరానీ తండ్రి అజయ్‌ కుమార్‌ మల్హోత్రా ముందే చెప్పినట్టు పంజాబీ ఖత్రీ కాగా, ఆమె తల్లి బెంగాలీ బ్రాహ్మణ మహిళ శిబానీ బాగ్చీ. ఇంకా ఆమె నాయనమ్మ మరాఠీ బ్రాహ్మణ స్త్రీ అయితే, అమ్మమ్మ అస్సామీ మహిళ అని ఎప్పుడో చదువుకున్నా. అందుకే స్మృతికి మతమేగాని కులం లేదంటారు.
తన స్నేహితురాలు మోనా ఇరానీ ద్వారా జుబిన్‌ ఇరానీతో ఆమెకు పరిచయం అయింది. అది పెళ్లికి దారితీసింది. మోనా, జుబిన్‌ లు స్నేహపూర్వకంగా విడిపోయారట. జుబిన్‌ తో పరిచయమైన ఏడాది లోపే 2021 మార్చిలో స్మృతికి ఆయనతో బెంగాలీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహమైంది. భర్త జుబిన్‌ విశ్వాసాలు, ఆచరణలో జొరాస్ట్రియన్‌ కాగా, స్మృతి పాపిట సింధూరంతో నిత్యం దర్శనమిచ్చే హిందూ మహిళ. ఆమె తల్లి శిబానీ నాటి భారతీయ జనసంఘ్‌ సభ్యురాలు. తాత రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నేత అని ఇప్పుడే నాకు తెలిసింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేయ్ ఎవుర్రా మీరంతా… ఈ పాదపూజలు, నాగభజనలూ ఏమిటర్రా…
  • అదనపు అమ్మ స్తన్యం… ఎందరెందరో బిడ్డలపై ‘అమ్మతనం’…
  • చందమామపై ఓ విల్లా… ఎట్‌లీస్ట్ ఓ డబుల్ బెడ్‌రూం ఫ్లాట్…
  • కాళేశ్వరంపై కేసీయార్ క్యాం‘పెయిన్’… ఓ పే-ద్ద కౌంటర్ ప్రొడక్టివ్…
  • ఇక్కడ సుహాసిని- విజయశాంతి… అక్కడ జయప్రద – శ్రీదేవి…
  • బాలీవుడ్‌పై అండర్ వరల్డ్ తుపాకీ నీడ… ఓ దర్శకుడి స్టోరీ ఇది….
  • మనసున్న వార్త… ఓ ముసలాయనకు ప్రాణం పోసిన ఓ మనస్విని సేవ…
  • ఎఐసీసీ మంత్రి పదవిని ప్రామిస్ చేస్తే… రేవంత్ రెడ్డిని ఎందుకు అడగడం..!?
  • తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!
  • సీఎం సాబ్… తమరు జర్నలిస్టుగా ఉన్న కాలం కాదు… జమానా బదల్ గయా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions