Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!

October 1, 2026 by M S R

.

ఎందుకు రేవంత్ రెడ్డి భిన్నమైన, విజయవంతమైన నాయకుడు..? ఈ ప్రశ్నకు నిన్న సిరిసిల్ల మరోసారి జవాబు ఇచ్చింది… ఇది మా గడీ, ఇది మా అడ్డా అనే శుష్క దొరతనాల్ని అక్కడికే వెళ్లి, అదే జనం ఎదుట నిగ్గదీసిన తీరు రేవంత్ రెడ్డి స్పెషాలిటీ… ఈ నయా దొరల దోపిడీని అక్కడే ప్రశ్నించి, అక్కడి జనానికి చెప్పి, నిలదీయడం గతంలో కాంగ్రెస్ నాయకుల నుంచి చూడలేదు మనం…

ఇది గొప్ప అని కాదు… ఇదీ ఓ స్ట్రాటజీ… కాకపోతే స్ట్రెయిట్ ఫైట్… అదేదో తెలుగు సినిమాలో డైలాగులాగా… ‘నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా’ టైపు… రేవంత్ రెడ్డిని కేసీయార్ అంచనా వేయగలిగాడు, అందుకే మొదట్లోనే తొక్కాలని విశ్వప్రయత్నం చేశాడు… ‘నీ బాంచెన్’ కల్చర్ ఎప్పుడూ ప్రశ్నను సహించదు, ప్రత్యర్థే ఉండకూడదు అనుకుంటుంది…

Ads

అందుకే బోలెడన్ని కేసులు… కేసులు పెట్టేకొద్దీ రేవంత్ బలపడ్డాడు… చివరకు దొర కుర్చీ కూలబడ్డది… అప్పటి నుంచి మొదలు… రేవంత్ రెడ్డి వరుసగా కేసీయార్ కుటుంబ దోపిడీపై రోజుకో బాగోతం బయటపెడుతూనే ఉన్నాడు… కమిషన్లు, విచారణలు… శిక్షల సంగతి తరువాత, ఆ కుటుంబాన్ని బజారులో నిలబెట్టి కడిగేయడం తన లక్ష్యం…

మొన్న ఆ కుటుంబం ప్లస్ బీఆర్ఎస్ ముఖ్యనేతల భూకబ్జాలు, భూబాగోతాల్ని అసెంబ్లీలోనే చెప్పాడు కదా… జనంలోకి బాగా వెళ్లింది… ఇప్పుడు సిరిసిల్లలో నిలబడి… కేటీయార్, ఆయన భార్య పేరిట ఉన్న ఫామ్ హౌజులు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, భూములు, ఫైవ్ స్టార్ హోటళ్ల గురించి మచ్చుకు కొన్ని చెప్పి, ఇంకా ఉన్నాయ్, అసెంబ్లీలో చెబుతా అంటూ ఝలక్ ఇచ్చాడు… మీ ఆస్తుల గురించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా అని సవాల్ విసిరాడు…

ఇది ఊపిరాడనివ్వని దాడి… ప్రజాస్వామిక వాతావరణంలో గడీలు, అడ్డాలు, గడ్డాలు గట్రా ఏమీ ఉండవనీ, ఏ స్థానమూ ఎవరికీ సురక్షితం కాదనీ చాటడానికి ఫస్ట్ సిరిసిల్ల… 3 కిలోమీటర్ల పాదయాత్ర… వేలాదిగా జనం… తరువాత సిద్దిపేట… ఆ తరువాత గజ్వెల్..?

అవును, ఈ దూకుడే రేవంత్ రెడ్డిని నిలబెట్టింది… దానికి మరింత పదును పెడుతున్నాడు… రేపు ఏమిటనేది జానేదేవ్… గతంలో ఈ ధోరణి కాంగ్రెస్‌లో కనిపించేది కాదు, పైగా కొందరైతే దొరవారికి లోలోపల సహాయకారులనే విమర్శ కూడా ఉన్నదే కదా… అందుకే కాంగ్రెస్‌లోనే రేవంత్ రెడ్డి భిన్నంగా కనిపిస్తున్నాడు…

తను ముఖ్యమంత్రిగా ఛలో సిరిసిల్ల అన్నాక ఇక ఆగేదేముంది..? పీసీసీ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు జెండాలు పట్టుకుని సిరిసిల్ల వీథుల్లో ‘మార్చ్’ నిర్వహించారు…

దీంతో తను ప్రజల్లోకి పంపించే సంకేతాలు… జనానికి కేసీయార్ కుటుంబ దోపిడీని అవగతం చేయడం, ప్రశ్నించడం, నిజాలు చెప్పాలంటూ సవాళ్లు విసరడం, బీఆర్ఎస్‌ను నిలువరించే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని చాటడం, తద్వారా బీజేపీ కూడా బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయలేక డిఫెన్సులో పడిపోవడం, పార్టీలో తన పట్టును కూడా పదే పదే నిరూపించుకోవడం, పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడం… మొత్తానికి అనుముల రుద్రారెడ్డి అసాధ్యుడే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!
  • మీడియా మాయ – కల్కి మహత్యం… రెండింటిదీ సేమ్ ఫార్ములా దందా !!
  • వంద ‘కాదు’లు ఒక ‘అవును’ కంటే ఎక్కువ నేర్పిస్తాయి!
  • సగటు తమిళుడికి తన భాష, సంస్కృతిపై ఓ ‘పిచ్చి ప్రేమ’… అంతే!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions