.
భద్రాచలం ఏడు మండలాలను ఏపీలో కలిపారు కదా… అవి పోలవరంలో మునిగేవే కదా… మరెందుకు అక్కడ కొత్తగా 60 నిర్మాణాలు వచ్చాయి… వందల ఎకరాల దేవుడి భూమిని ఆక్రమించుకున్నవారు ఏకంగా భద్రాచలం ఈవోపైనే దాడికి దిగారు…
ఎవరి భరోసా..? ఇన్నేళ్లూ కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఆక్రమణల జోలికి వెళ్లగానే దాడులు… మా భూముల జోలికొస్తే ఖబడ్దార్ అంటున్నారు… కాసేపు జగన్‌ను వదిలేయండి, అదొక తిక్క ప్రభుత్వం…
Ads
మరి ఇప్పుడు సనాతన ధర్మ వీరపరిరక్షకుడు పవన్ కల్యాణుడు ఏం చేస్తున్నాడు ఏపీలో..? సారు గారికి హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనుల బిజీ… మోడీ ప్రభుత్వం రాగానే పట్టుబట్టి, వెంకయ్యనాయుడితో జట్టుకట్టి, ఫస్ట్ బిల్లే ఈ ఏడు మండలాల బిల్లు పెట్టించిన శ్రీమాన్ చంద్రబాబునాయుడికి ఎలాగూ పట్టదు… సారు గారు బనకచర్ల అనే ఏటీఎం మీద కాన్సంట్రేట్ చేశాడు…
అల్లూరి జిల్లా, పురుషోత్తమపట్నం… అక్కడే భూముల కబ్జా… వందల ఎకరాలు… ఇన్నేళ్లూ చూసీచూడనట్టు నటించింది కదా… సోకాల్డ్ కేటీయార్, కేసీయార్, హరీష్, కవితకు నోటమాట పెగలదు… పీడీ యాక్ట్ పెడతాం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెదిరిస్తున్నా సరే, అది చాలదు…
ఎండోమెంట్స్ ఈవో స్పృహ కోల్పోయేలా దాడి జరిగిందీ అంటే ఇష్యూ సీరియస్… ఇలాగే ఉపేక్ష వహిస్తే, చూశారా, బీజేపీ రేవంత్ ఒకటే, బాబు రేవంత్ ఒకటీ అని కొత్త పాట ఎత్తుకుంటుంది బీఆర్ఎస్… అదే జరిగితే అది రేవంత్ కే పొలిటికల్‌గా నష్టదాయకం…
అది 889 ఎకరాల భూమి… ఏపీ హైకోర్టు కూడా దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది… దేవస్థానానికి పాస్ బుక్కులు కూడా ఉన్నాయి… మరి ఆక్రమణదారుల మీద కఠినంగా ప్రొసీడ్ కావడానికి ఏమిటి జంకు..? నో, కొండా సురేఖ మంత్రిత్వ శాఖతో కాదు, నేరుగా రేవంత్ రెడ్డే ఇన్వాల్వ్ కావాలి…
మరి రాష్ట్ర హోం శాఖ, డీజీపీ ఏం చేస్తున్నారో అర్థం కాదు…ఈవో రమాదేవిపై దాడిచేసిన వారిని శిక్షించాలి, ఖండిస్తున్నామనే ఉద్యోగ సంఘాల ప్రకటనలతో ఏమీ ఒరగదు… ప్రభుత్వం సీరియస్ యాక్షన్ మొదలు పెడితే తప్ప…! మరెందుకు భయపడుతోంది..!!
ఇదుగో ప్రతి విషయంలోనూ చంద్రబాబు అండ్ కో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు, ఆస్తులకు వ్యతిరేకంగా దూకుడుగా ముందుకొస్తూనే ఉంది, ఉంటుంది… ఇక్కడ జగన్‌కూ చంద్రబాబుకూ తేడా ఉండదు… మరి రేవంత్ రెడ్డి నిజంగానే ఏం చేస్తున్నట్టు..!?
Share this Article