Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈనాడు అంటేనే జగన్‌కు కుతకుత… ఆ ఈటీవీ క్యాంపుతో రోజా చెట్టపట్టాల్…

October 6, 2022 by M S R

ఒక ధర్మసందేహం… తప్పుగా భావించవద్దు… తన రాజకీయ జీవితానికి అద్భుతంగా ఉపయోగపడింది, తనను ఎమ్మెల్యేను చేసింది జబర్దస్త్ ప్రోగ్రామేనని రోజా బొచ్చెడుసార్లు చెప్పింది… చెబుతూనే ఉంది… నిజానికి ఆ ప్రోగ్రాం మీద విమర్శలు పక్కన పెడదాం… ఆమె స్కిట్లు చేసే కమెడియన్ కాదు, జస్ట్, ఓ జడ్జి… కాకపోతే అప్పుడప్పుడూ స్టెప్పులు వేసేది… మరి ఆమె చెప్పేదే నిజమైతే, నాగబాబు కూడా అదే ప్రోగ్రాంకు జడ్జి కదా… ఆమెలాగే పడీపడీ నవ్వేవాడు కదా… మరి ఆయనకు వచ్చిన వోట్లెన్ని..? జనం తననెందుకు తిరస్కరించారు..?

మొన్న దసరా స్పెషల్ షోలో రోజాతో ఓ పిచ్చి ప్రోమో కోసం చేయించిన ఓ ఫేక్ డ్రామా నవ్వొచ్చేలా ఉంది… ఒకింత జాలి కూడా కలుగుతుంది… ఆమె ఇప్పుడు మంత్రి… ఆ ఈటీవీ వాడు ఏదో డ్రామా క్రియేట్ చేస్తే ఈమె నటించాలా..? ఒకవైపు జగన్ మన శత్రువులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 క్యాంపులే, మనం పోరాడేది వాళ్లతోనే అని స్పష్టంగా చెబుతుంటాడు ఈనాడు పట్ల తన ధోరణి ఏమిటో… మరి తెల్లారిలేస్తే తనకు సంబంధం లేకపోయినా సరే తెలుగుదేశం మీద విరుచుకుపడే రోజా ఇప్పటికీ ఈనాడు క్యాంపుతో చెట్టపట్టాల్ వేసుకోవడం ఏమిటి..? జగన్ మాట జగన్‌దే, నా బాట నాదే అన్నట్టా..?!!

అప్పటిదాకా రోజా అద్భుతమైన రాజకీయ ప్రస్థానం మీద ఓ స్కిట్ వేశారు… వెంటనే సన్మానం… అక్కడ ఓ కమెడియన్ ఏదో ప్రశ్న వేస్తాడు… ఈమెకు కోపం వస్తుంది… మెడలో దండను విసిరేసి, విసవిసా బయటికి నడిచివెళ్లిపోతున్నట్టు సీన్… అక్కడ కట్ చేసి, వారం పదిరోజులు ఈటీవీ వాడు ప్రోమో వేసుకున్నాడు… కట్ చేస్తే, నిజానికి అదంతా ఉత్తుత్తి నాటకం… దానికి రోజా నటనాసహకారం… అంత అవసరమా..? ఐనా ఈనాడుతో ఆ బంధుత్వం దేనికి..?

Ads

‘‘జబర్దస్త్‌తోనే ఎమ్మెల్యే అయ్యానని గతంలో చెప్పావు, కానీ మంత్రివయ్యాక జబర్దస్త్‌లో నువ్వు లేవు’’ ఇదీ కమెడియన్లు ఆది, నూకరాజుతో సదరు స్పెషల్ షో డైరెక్టర్లు అడిగించిన ప్రశ్న సారాంశం… అంటే, ఇప్పటికీ జబర్దస్త్ ప్రోగ్రాంలో కూర్చుని పకపకా నవ్వుతూ, స్కిట్ల నడుమ ఇంటర్‌ఫియర్ అవుతూ కాలం గడపాలా..? హేమిటో… జస్ట్, ఓమాట… ఆ ప్రోమోలను బట్టి నిజంగానే రోెజా అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయిందని ఎవడైనా నమ్ముతాడా..? ఒకవేళ అదే నిజమైతే అది షోలో ప్రసారం అవుతుందా..? ఎందుకీ ఫేక్ డ్రామాలు..? ఎప్పుడో ఒకసారి చేస్తే కామెడీ… ఎప్పటికీ అదే చేస్తే తుస్…

అవునూ… మొదట్లోని ధర్మ సందేహానికే ఇప్పుడు అదనపు సందేహం… జబర్దస్త్ అనే షో మంత్రదండంలాగా ఏపీలో ఎమ్మెల్యేలను గెలిపించగలదు… మంత్రులనూ చేయగలదు కదా… అదేలెండి రోజా భాషలో… ఇప్పుడు ఇంద్రజ బాగానే క్లిక్కవుతోంది… ఆమె కూడా ఒకప్పటి నటి… వచ్చే ఎన్నికల్లో ఎక్కడైనా పోటీచేసే చాన్సుందా..? ఆమె కూడా జడ్జి మాత్రమే, రోజాలాగే నవ్వుతోంది… పోనీ, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది, గెటప్ సీనులు టికెట్ల కోసం ట్రై చేస్తే వర్కవుట్ కావచ్చా..?! ఎప్పుడూ తను కుతకుతలాడే ఈ ఈటీవీ-ఈనాడు క్యాంపు బ్యాచ్‌ను జగన్ అభిమానించి దగ్గరకు తీయాలా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions