Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్యా ఎక్కడ తప్పు చేసింది..? ఉక్రెయిన్ యుద్ధం ఓ గుణపాఠం… (పార్ట్-2)

September 12, 2022 by M S R

రష్యన్ వ్యూహకర్తల వెన్నుపోటు ? ముందుగా చరిత్రలోకి వెనక్కి వెళ్ళి, ఒక సంఘటనని ప్రస్తావిస్తే కానీ ఇప్పటి రష్యా వెనకబాటుకి కారణం అర్ధం అవదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అడాల్ఫ్ హిట్లర్‌తో యుద్ధ వ్యూహాలని చర్చించే ఒక జనరల్ ఫెడోర్ వాన్ బాక్ [Fedor von Bock] హిట్లర్‌తో గొడవపడ్డాడు. అది ఆపరేషన్ బ్లూ కేస్ [Operation Blue Case (Stalingrad and the Caucasus) కి సంబంధించి వ్యూహ రచన సందర్భంగా… ఈ ఆపరేషన్ రష్యాలోని స్టాలిన్గ్రాడ్ మరియు కాకసస్ పర్వత ప్రాంతం మీద దాడి చేసి స్వాధీనం చేసుకునే ప్లాన్ అన్నమాట.

హిట్లర్ వ్యూహాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఫెడొర్ వాన్ బాక్ ఈ ఆపరేషన్ విజయవంతం కాదు అని హిట్లర్ ఎదుటనే బలంగా వాదించాడు. కానీ హిట్లర్ తన వ్యూహాన్ని అమలుచేయాల్సిందే అని పట్టు పట్టాడు. ఈ సందర్భంలో హిట్లర్ మరియు ఫెడొర్‌లు గట్టిగా అరుచుకోవడంతో పాటు తిట్టుకున్నారు కూడా ! అదే సమావేశంలో ఉన్న మిగతా జనరల్స్ వీళ్ళ సంభాషణ చూసి ఏ క్షణంలో అయినా హిట్లర్ తన రివాల్వర్ తీసి జనరల్ ఫెడొర్‌ని కాల్చేస్తాడు అనుకున్నారు…

కానీ చివరికి హిట్లర్ అలా చేయలేదు సరికదా ఫెడొర్‌ని కౌగలించుకొని… నీ యుద్ధ వ్యూహం మీద నీకున్న విశ్వాసం నన్ను లెక్కచేయకుండా తిట్టించింది… అంటే నీ వ్యూహం మంచిదే అవుతుంది కానీ ఈసారికి నా వ్యూహాన్ని అమలు చేద్దాము అంటూ పంపించేశాడు ఫెడొర్ వాన్ బాక్‌ని.. ఆపరేషన్ బ్లూకేస్‌లో జర్మన్ సైన్యం సోవియట్‌లోకి చొచ్చుకు వెళ్ళి, చివరకి స్టాలిన్ గ్రాడ్ వరకు వెళ్ళగలిగింది… కానీ అప్పటికే తీవ్రంగా మంచు కురుస్తూ ఉండడం చేత అంత చలిని తట్టుకునే సామర్ధ్యం లేని జర్మన్ సైనికులు వేలల్లో మరణించారు, ఐనా సోవియట్ వ్యూహకర్తలు సైబీరియాలో శిక్షణ పొందిన కొద్దిమంది సైనికులని ముందు ఉంచి, చివరికి స్టాలిన్ గ్రాడ్ హిట్లర్ వశం కాకుండా కాపాడుకోగలిగారు…

Ads

***********

పైన పేర్కొన్న ఆపరేషన్ బ్లూ కేస్‌కి సంబంధించి జనరల్ ఫెడొర్ వాన్ బాక్ ఖచ్చితంగా అంచనా వేసింది తీవ్రమయిన చలి కాలం గురించే ! ఫెడొర్‌కి తెలుసు రష్యన్‌‌లు ఆ చలికి అలవాటు పడి ఉంటారు, కానీ జర్మన్లు ఆ చలికి చనిపోతారు అని… పైగా జర్మన్ సప్లై ట్రక్కులు 5 అడుగుల మంచులో కూడా ముందుకు వెళ్ళగలిగే సామర్ధ్యం కలవి కావు… కాబట్టి జర్మన్ సైనికులకి ఆహారం, ఆయుధాలు, ఇంధనం సరఫరా చేయడం కష్టం అవుతుంది. ఫెడొర్ వాన్ బాక్ వ్యూహం ఏమిటంటే చలికాలం తగ్గాక దాడి చేయాలి అని…

అంతే కాదు సైనికులని పాకెట్స్‌గా విభజించి, ముందుగా రెండు పాకెట్స్, తరువాత సప్లై వాహనాలు, ఆ తరువాత మిగతా సైన్యం వెళ్ళాలి అని ప్లాన్… అలా చేసి ఉంటే జర్మనీ సోవియట్ యూనియన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఉండేది… అదే జరిగి ఉంటే హిట్లర్ మరింత బలంగా తయారయ్యేవాడు… హిట్లర్ వ్యూహం తప్పు అని తెలుసుకునేలోగా అంతా అయిపోయింది. జనరల్ ఫెడొర్ వాన్ బాక్ మాత్రం ఆపరేషన్ బ్లూ కేస్‌లో పాల్గొన్నాడు, తన కళ్ళారా తన సైనికులు మరణించడం చూశాడు.

**********

ఫిబ్రవరి 23 కి ముందు పుతిన్ వ్యూహకర్తలలో ఇద్దరు జనరల్స్ కూడా పుతిన్ ఆమోదించిన వ్యూహాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తున్నది. ఆపరేషన్ మొదలవక ముందే ఇది విఫలం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పారు… కానీ పుతిన్ ఆ ఇద్దరు జనరల్స్‌ని బయటికి పంపించేశాడు… తరువాత వాళ్ళు ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. ఇంతకీ ఆ ఇద్దరు [పేర్లు బయటికి రాలేదు] జనరల్స్ కూడా ఉక్రెయిన్ 2014 స్థితిలో లేదని, నాటోతో పాటు అమెరికా కూడా జెలెన్స్కీతో ఎప్పటి నుండో వ్యూహ రచనలో ఉన్నారని… కాబట్టి ముందుగా ఆయుధాలు పెద్ద సంఖ్యలో తయారు చేసుకొని, తరువాత ఆపరేషన్ చేద్దామని, అదీ సాంప్రదాయక ఆపరేషన్ కాకుండా గెరిల్లా తరహాలో కొద్ది కొద్దిగా చొచ్చుకువెళ్ళి కీవ్‌ని స్వాధీనం చేసుకున్న తరువాత పెద్ద మొత్తంలో సైన్యాన్ని తరలించాలని సలహా ఇచ్చారు… కానీ పుతిన్ వాళ్ళ మాట వినకుండా తన మిగతా వ్యూహకర్తలతో ఆపరేషన్ మొదలుపెట్టి ఇప్పుడు చేతులు కాల్చుకున్నాడు…

**********

చైనా చేసిన మోసం కూడా రష్యా కి పెద్ద దెబ్బ తగిలింది !

మిగతా దేశాలతో పాటు చైనా కూడా రష్యాని మోసం చేసింది. మార్చి నెల మొదటి వారంలో దాదాపుగా 25 కిలోమీటర్ల పొడవునా రష్యన్ సప్లై వాహనాలు ఉక్రెయిన్‌లోకి వచ్చి హైవే మీద నిలిచిపోయిన సంగతి మనం చూశాం. కానీ అప్పటికే మంచు కరిగిపోయి, దాని వల్ల బురద ఏర్పడి, రష్యన్ సప్లై వాహనాలు బురదలో కూరుకుపోవడమే కాదు… దాదాపుగా కొన్ని వందల మిలటరీ ట్రక్కుల టైర్లు బరువుని భరించలేక పేలిపోయాయి. కొన్ని వందల ట్రక్కులు గేర్ బాక్సులు స్ట్రక్ అయి దారిలోనే నిలిచిపోవడం, దాంతో ఉక్రెయిన్ రైతులు తమ ట్రాక్టర్స్‌తో వాటిని తీసుకెళ్లడం జరిగింది. టైర్లు, ట్యూబులు, గేర్ బాక్స్‌లకి సంబంధించి స్పేర్ పార్టులు చైనా సరఫరా చేసింది. మిలటరీ గ్రేడ్ టైర్లకి బదులు మామూలు ట్రాన్స్పోర్ట్ ట్రక్కులకి వాడే టైర్లని సరఫరా చేసింది చైనా !

**********

యుద్ధం అంటే చాలా వ్యయప్రయాసలకి సిద్ధపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సైన్యానికి కావాల్సిన ఆయుధాలు, ఆయిల్, మందులు, ఆహారం నిరంతరం ఆగకుండా అందించాలి… కానీ రష్యా ఈ విషయంలో పూర్తిగా విఫలం అయ్యింది. పుతిన్‌తో సన్నిహితంగా ఉండే జనరల్స్ తప్పుడు సలహాల వల్లే రష్యాకి డబ్బు పోయి, అదనంగా శని పట్టినట్లుగా అయ్యింది.

**********

ప్రస్తుతం అంచనాలని పరిశీలిస్తే 2014 లో స్వాధీనం చేసుకున్న క్రిమియాని కూడా రష్యా కోల్పోవచ్చు ! దీనికి సమయం పడుతుంది కానీ ఉక్రెయిన్‌ది క్రమేపీ పైచేయి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు! 200 రోజులుగా సాగుతున్న యుద్ధం వలన తక్కువలో తక్కువగా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది రష్యాకి. చైనా ఆంటీ అంటనట్లుగా సహకరిస్తున్నది రష్యాకి… రష్యాని చూసి యుద్ధం అంటే ఆర్ధికంగా ఎంత నష్టపోతామో చైనా గ్రహించింది. అమెరికా ఆంక్షలు, అదీ గత పదేళ్లుగా రష్యా వెన్ను విరిచింది అనే చెప్పాల్సి ఉంటుంది. ఈ స్థితి తమకి రాకూడదనే చైనా భావిస్తున్నది… డాలర్‌తో వాణిజ్యం చేయకుండా అమెరికా, యూరోపు దేశాలు ఆంక్షలు విధిస్తే మాత్రం రష్యా కంటే చైనా ముందుగా కుప్పకూలుతుంది.

***********

1 September 1939 – 2 September 1945: ఇది రెండవ ప్రపంచ యుద్ధము మొదలయ్యి అంతం అయిన తేదీలు… ప్రతి వంద సంవత్సరాలకి చరిత్ర పునరావృతం అవుతున్నది అని స్పానిష్ ఫ్లూ – కోవిడ్‌లు నిరూపించాయి కదా ? నిరాశ, నిస్పృహలతో పుతిన్ కనుక ఉక్రెయిన్ మీద అణు దాడి చేస్తే, అది ప్రపంచ వినాశనానికి దారి తీస్తుంది. లేదా తైవాన్ మీద చైనా దాడి చేసినా, ఉక్రెయిన్ విషయంలో రష్యాకి ఎలా జరిగిందో చైనాకి కూడా అలాగే జరుగుతుంది. ఉక్రెయిన్ నాటో, అమెరికాల సహాయంతో క్రిమియాని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం అణు యుద్ధం జరిగి తీరుతుంది. అలా జరగకూడదు అని ఆశిద్దాం ! కానీ జరిగేది జరగక మానవు కదా ?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions