పోయిన మే నెలలో కావచ్చు… Sai Vamshi వాల్ మీద పోస్ట్… ఈసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు ఎవరికి రావచ్చు…? ఇదీ ప్రశ్న… గంగూభాయ్ ఆలియా భట్‌కా..? విరాటపర్వంలోని సాయిపల్లవికా..? తనే కాదు, చాలామందిలో ఈ రెండు పేర్లే… ఒకసారి ఆ పోస్ట్ ఇక్కడ యథాతథంగా…
అబ్బే! తను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది. రాకపోవచ్చు అన్నారొకరు. తనలా మాట్లాడిందనేది ఫేక్ న్యూస్. దానికి ఆధారం లేదు అన్నాను. అయినా కూడా.. అని ఒకరు నసిగారు. అయితే ‘విరాటపర్వం’లో సాయిపల్లవికీ అవకాశం ఉంది అన్నాను.
అవునా? అంత బాగా చేసిందా అన్నారు ఇంకొకరు. చాలా బాగా చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన నటన చూడాలి. అలాంటి ఎమోషనల్ పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. కాబట్టి జాతీయ ఉత్తమ నటి అయ్యే అవకాశం ఉంది. కానీ తనూ బీజేపీకి ఏదో వ్యతిరేకంగా మాట్లాడిందంట కదా అన్నారు.
Ads
ఆమె అభిప్రాయం ఆమె చెప్పింది. దానికీ, అవార్డులకీ సంబంధం ఏమిటి అన్నాను. అయినా తెలుగు వాళ్లకి ఇస్తారా? అన్నారొకరు. చెప్పలేం! ఏమైనా జరగొచ్చు. ఈ ఇద్దరూ కాకుండా మరెవరైనా ఇంకా బాగా చేసి ఉండొచ్చు. వాళ్లకే ఇవ్వొచ్చు. ఏం చెప్తాం? అన్ని గొప్ప సినిమాలూ OTTల దాకా రావు. వచ్చినా మనం చూడము అన్నాను. ఇదీకాక, తెలుగు నుంచి ఆ సినిమా ఎంట్రీగా వెళ్లాలి కదా అని ముగించాను.
టక్కున ఒక మిత్రుడు అందుకొని, “అంతా బాగానే ఉంది కానీ, గంగూబాయ్‌లో అలియాభట్ పాత్ర వేశ్య, విరాటపర్వంలోనేమో సాయిపల్లవి నక్సలైటు.. అలాంటి పాత్రలు చేస్తే అవార్డులు ఇస్తారా?” అని సందేహం వ్యక్తం చేశాడు. కాసేపు నో ఆన్సర్!
గతంలో కొన్నిసార్లు వేశ్య పాత్ర చేసినందుకూ ఇచ్చారు. ‘మౌసమ్’లో షర్మిలా టాగూర్, ‘చాందినీ బార్’లో టబులకు జాతీయ అవార్డులు ఇచ్చారు. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో నక్సలైటు పాత్ర చేసిన విజయశాంతి చివరి రౌండ్ దాకా వెళ్లినా అవార్డు రాలేదు. ఏం తెలియాలన్నా ఆగాల్సిందే అన్నాను.
ఇదీ చర్చ… ఇక్కడ రెండు అంశాలు… ఆలియా భట్‌కు బాలీవుడ్ మద్దతు ఉంది… ఆ మాఫియా చాలా పవర్‌ఫుల్… అఫ్‌కోర్స్, ఆలియా మంచి నటి, కానీ సాయిపల్లవిని కూడా తీసేయలేం… ఈమెకు బలమైన లాబీయింగు లేదు… ఎక్కడైనా ఎవరికైనా లాబీయింగ్ ఉంటేనే కదా అవార్డులు, ఆస్కార్లు, పద్మాలు కూడా… మరో అంశం… వేశ్య, నక్సలైట్ వంటి పాత్రలు… ఎస్, అవి పాత్రలే… ఆ పాత్రల్లో వారి నటనను ఆబ్జెక్టివ్‌గా కొలిస్తేనే కదా అవార్డులకు సార్థకత…
ఇంకో అంశం… బీజేపీని ఏదో అన్నారని… సాయిపల్లవి బీజేపీని ఏమీ అనలేదు… తన మాటల్లో పెద్ద పరిపక్వత, అవగాహన లేకపోవచ్చుగాక కానీ దురుద్దేశాలు లేవు… పైగా ఆమె మాటల్ని బీజేపీ తనకు రుద్దుకోవడం కూడా దండుగ… ఆలియా భట్ నటన నేర్చిన ఓ మైనపు బొమ్మ… ఆమె మాటల మీద, తెలివితేటల మీద ఉన్న జోక్స్ బోలెడు… సో, ఆమెనూ బీజేపీ పెద్దగా సీరియస్‌గా ఎందుకు తీసుకుంటుంది..? ఐనా ఇలాంటి విషయాల్లోనూ బీజేపీ తలదూర్చాలా ఏం..?! ఆలియాకు, సాయిపల్లవికీ సంయుక్తంగా ఇస్తే బాగుండేదేమో…
Share this Article