HIV -AIDS….. ఎప్పుడో High School ఏజ్ లో తొమ్మిదో తరగతిలో ఈ పాఠం ఉండేది. అయ్యవార్లు దీన్ని Optional గా వదిలేసే వారు. అయినా స్వతహాగా ఆ వయసులో ఉండే లైంగిక అంశాలపై ఆసక్తి మూలంగా చదివినా అంత అర్థం చేసుకునే వయసు కాదు అది…
ఒక పది రోజుల క్రితం Dr Yanamadala Murali Krishna సార్ నుండి ఈ పుస్తకం అందుకున్నాను… ఆసక్తి తో కాదు గానీ కేవలం మురళీ సార్ కోసం చదవటం స్టార్ట్ చేసినా… ముందు మాట పూర్తయ్యి AIDS ప్రారంభం చాప్టర్ స్టార్ట్ చేయగానే సార్ ను మర్చిపోయి పుస్తకంలో లీనమై పోయాను.
కొన్నేళ్లుగా ఏకబిగిన వెబ్ సిరీస్ లు మాత్రమే చూడటం అలవాటు అయిన నాకు ఇలా నాన్ స్టాప్ గా బుక్ చదవటం కొత్త అనుభూతి… ఎన్నెన్ని కొత్త విషయాలు… అసలు ఈ సైన్స్ బుక్ లో అసలు AIDS అనేది ఖండాలు దాటి ఎలా వ్యాప్తించింది, అందులో రాజకీయాల పాత్ర గురించి చాలా సునిశితంగా రాయటం నాకైతే భలే ఆశ్చర్య పరిచింది..
Ads
మతం లేదా మత ఆచారాలు కూడా AIDS ను స్ప్రెడ్ చేశాయి లేదా ఆపాయి అని ఈ పుస్తకం ద్వారా తెలిసింది. హిందూ మతంలో ఉన్న బసివిని వ్యవస్థ దేశంలో AIDS కేసులు పెంచగా, సున్తీ చేసే మతాచారం ఆఫ్రికాలో కొన్ని దేశాలను కాపాడటం విశేషం.. అసలు ఆఫ్రికా దేశాల స్థితి వారిని చేసిన ప్రభావితం అయ్యేలా చేయటం నాకైతే చాలా బాధను కలిగించింది…
AIDS గురించిన పుస్తకాన్ని ఇంతలా ఆసక్తి గా చదివేలా చేయటంలో నా చిన్ననాటి రోజుల్లో చూసిన పరిస్థితులు కూడా కారణమేమో. నాకు చాలా దగ్గరైన కుటుంబంలో ఒకతను 2006 ప్రాంతంలో ఈ AIDS కు లోనై తీవ్రమైన వివక్షకు గురై చనిపోయాడు. ఆయన పిల్లలు నేటికీ వివక్ష ఎదుర్కొంటూ ఉండటం నేను స్వయంగా చూస్తున్నాను.
విశేషం ఏమంటే ఆయనకు HIV -AIDS రావటానికి కారణమైన వ్యక్తి నేటికీ Possitive, అయినా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండటం ఈ పుస్తకం చదవటానికి మరింత ఆసక్తి పెంచింది.. ఆ వ్యక్తి ఇంకా బ్రతికి ఉండటానికి కారణం మా RDT సంస్థ వారు AIDS వ్యాధిగ్రస్తులు సాధారణ జీవితం గడపటానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు..
ఈ పుస్తక రచయిత స్వయానా డాక్టర్ అయిన యనమదల మురళీ కృష్ణ గారు తెలుగు వారు కాకుండా ఏదైనా అభివృద్ది చెందిన దేశాలకు చెందిన వారు గనక అయ్యుంటే వారి కీర్తి చాలా గొప్ప గా ఉండేది. వారు తెలుగు వారు అవ్వటం వారి దురదృష్టం కాగా మన అదృష్టం. వీరు ఆరు వేలకు పైగా HIV -AIDS బాధితులకు తమ వైద్యం ద్వారా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఇచ్చారు..
మీ అందరికీ మిత్రుడిగా సూచిస్తున్నాను, ఈ పుస్తకం ఖచ్చితంగా మనం అందరూ చదవాల్సిన పుస్తకం. ఖచ్చితంగా కొనండి చదవండి.. సాయి నాథ్
Share this Article