.
నేనిక్కడ అంకెల జోలికి పోవడం లేదు… క్రికెెట్‌లో వన్డేలు, టెస్టులు, ఫస్ట్ క్లాస్ క్రికెట్, టీ20, ఐపీఎల్… ఇలా సవాలక్ష రికార్డులు, అంకెలు కనిపిస్తాయి… చెప్పుకోవాల్సింది శుభమన్ గిల్ గురించి… తను ఇండియన్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్…
ఈ టెస్టు మ్యాచులో మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ… రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ… మొత్తానికి ఈ ఫీట్ ఏ ఇతర తోపు క్రికెటర్ వల్ల కూడా కాలేదు… అయితే అదొక్కటేనా ఈ పంజాబీ సిక్కు అందగాడు, హీరో లుక్కు ఆటగాడి విశేషం..?
Ads
గ్రాహమ్ గూచ్ అని 1990 ప్రాంతంలో ఓ ఆటగాడు… ఒకే టెస్టు మ్యాచులో 456 కొట్టాడు… ట్రిపుల్ ప్లస్ సెంచరీ… ఎస్, అప్పటి నుంచీ ఇప్పటికీ మరే ఆటగాడికీ ఆ ఫీట్ సాధ్యం కాలేదు… అనితరసాధ్యం… అయితే మన శుభమన్ ఈ టెస్టులో తనొక్కడే సొంతంగా రెండు ఇన్నింగ్స్ కలిసి 430 రన్స్ చేశాడు…
సోకాల్డ్, గావస్కర్, టెండూల్కర్, కోహ్లీ, సెహ్వాగ్ ఎట్సెట్రా తోపులకు సాధ్యం కాలేదు ఈ ఫీట్… ఈ నలుగురికీ బోలెడు రికార్డులున్నయ్ ఇండియన్ క్రికెట్ కోణంలో… కానీ గిల్ అలవోకగా వాళ్లను దాటేసి, తనకుంటూ ఓ చరిత్ర లిఖించుకున్నాడు…
ఇక్కడ గ్రాహం గూచ్‌తోనూ ఓ పోలిక అవసరం… తను గ్రేట్, డౌట్ లేదు… కానీ 1990లో టీ20 లేదు, ఈ స్పీడ్ లేదు, ప్రతి బాల్‌ను దంచే ట్రెండూ లేదు… శుభమన్ వన్డేలు, టీ20లు, ఐపీఎల్‌లు ఆడుతూ… టెస్ట్ మ్యాచ్ అనగానే హఠాత్తుగా తన ఆటతీరును టెస్ట్ మ్యాచుకు సరిపడా మార్చుకున్నాడు…
ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కళాత్మకం… మంచి బాల్ గౌరవించాలి, ఓపికగా క్రీజులో నిల్చోవాలి, అనుకూల బాల్ వచ్చినప్పుడు దంచాలి… అందుకే నేనంటాను… గ్రాహమ్ గూచ్‌కన్నా కూడా గిల్ చాలా నయం అని… అఫ్‌కోర్స్, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి… తప్పనిసరై తక్కువ సమయంలో ఎక్కువ టార్గెట్ ఫిక్స్ చేయాలనే అవసరంలో తను మళ్లీ వన్డే ఆటతీరుకు వచ్చేశాడు, కొన్నిసార్లు టీ20 షాట్స్ కూడా…
ఐనాసరే, తోటి వికెట్లు పడిపోతున్నా సరే, త్వరపడలేదు… రాహుల్, పంత్, యశస్వి తదితరులు సుదీర్ఘమైన ఇన్నింగ్స్ నిర్మించుకోలేేని స్థితిలో… గిల్ ఒక్కడే దాన్ని సాధించాడు… ఎక్కడా బ్యాడ్ షాట్ లేదు దాదాపుగా… అందుకే శుభమన్ గిల్ ఈ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్ ఇండియన్ క్రికెట్ రికార్డుల్లో చిరస్మరణీయం… స్పూర్తిదాయకం… జాన్దేవ్… మ్యాచు గెలుస్తామా ఓడతామా… మనం ఎలా పోరాడాం అనేదే ముఖ్యం..!!
అన్నింటికీ మించి గిల్ కెప్టెన్ ఏమిటీ అని పలువురు స్పోర్ట్స్ జర్నలిస్టులు, రివ్యూయర్లు, సీనియర్లు చేసిన వెక్కిరింపులకు తను పక్కాగా తన పరుగులు రికార్డులతోనే సమాధానం చెప్పిన తీరు సూపర్…
Share this Article