.
అనుకుంటాం గానీ… బయట రాజకీయాల్లోకన్నా సెలబ్రిటీల అసోసియేషన్లలో టన్నుల కొద్దీ బురద ప్రవహిస్తూ ఉంటుంది… దాష్టికం, కుల వివక్ష, లింగ వివక్ష, దోపిడీ, అక్రమాలు చాలా ఎక్కువ… ఉదాహరణకు సినిమా అసోసియేషన్లు… అందులోనూ సినిమా నటుల అసోసియేషన్లు…
తెలుగులో ‘మా’ అని నటీనటుల సంఘం ఒకటి ఉంది… పెద్ద పెద్ద తోపు స్టార్లు దాన్ని ఏమాత్రం దేకరు… అదొక అంటరాని సంస్థ వాళ్లకు… మీరు ఎన్నడైనా గమనించారా, వందలు, వేల కోట్లకు ఎదిగిన ఓ స్టార్ కూడా తోటి నటీనటుల కోసం సాయం చేసిన ఉదంతాలు..? అసోసియేషన్‌లో యాక్టివ్ పార్టిపిసేషన్? నెవ్వర్…
Ads
సరే, విషయానికొద్దాం… కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఏదో బొందవుడ్, అన్ని వుడ్లూ, అనగా చెక్కలు ఒకే తీరు… ఆమధ్య కేరళలో నటీనటుల సంఘానికి ఓ కొత్త వెలుగు వచ్చింది… ఆ సంఘం పేరు అమ్మ… అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్…
దీనికి కొత్త అధ్యక్షురాలిగా ఎన్నికైంది ఆమధ్య ఒకామె… అదీ బలమైన పోటీ నడుమ… ఆమె పేరు శ్వేతా మేనన్… హీరోల పాదాక్రాంతాల వద్ద పాకులాడే సినిమా ఇండస్ట్రీలో… ఆర్టిస్టుల అసోసియేషన్‌కు ఒక నటుడితో పోటీపడి మరీ ఓ లేడీ ఆర్టిస్టు గెలవడం ఖచ్చితంగా చెప్పుకోదగిన విశేషమే…
అంతకుముందు దీనికి మోహన్‌లాల్ అధ్యక్షుడు… కానీ కొందరు నటులు, దర్శకులపై కొందరు తారలు లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో తను రాజీనామా చేశాడు… మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళ ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టుల్లో చైతన్యం కాస్త ఎక్కువే… నోరు విప్పి బజారుకు లాగి నిలదీస్తారు… అఫ్‌కోర్స్, అదే సమయంలో వివక్ష, మగపెత్తనాలు, దాష్టికాలూ ఎక్కువే… బోలెడు కేసులు నడుస్తున్నాయి కూడా కోర్టుల్లో…
ఆ ఎన్నికకు ముందు కూడా ఆమె మీద ఓ కేసు పెట్టారు… తన పాత సినిమాలు, యాడ్స్‌కు సంబంధించిన అశ్లీల బిట్స్‌ను ప్రచారంలోకి తీసుకువచ్చిందని..! ఆమెను డీమోరల్ చేసి, ఆమె ఎన్నిక గాకుండా నిలువరించేందుకు అన్నమాట… కానీ ఆమె సహజంగానే ఫైర్… తిప్పికొట్టింది, నిలిచింది, అమ్మకు తొలి లేడీ ప్రెసిడెంటుగా గెలిచింది…

ఆమె ఒకటీ అరా తెలుగు సినిమాల్లో కూడా అతిథి పాత్రల్లోనో, చిన్నాచితకా పాత్రల్లోనో కనిపించినట్టు గుర్తు… ప్రస్తుతం 51 ఏళ్ల వయస్సు… మలయాళం సినిమాలే అధికం… కొన్ని హిందీ…
చండీగఢ్‌లో పుట్టిన మలయాళీ… తండ్రి ఎయిర్‌ఫోర్స్ ఎంప్లాయీ… తను మొదట్లో మోడల్… 1994 మిస్ ఇండియా పోటీల్లో ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్‌లతో పోటీపడింది… పలు హిందీ చిత్రాల్లో నటించి, ఇక మాలీవుడ్‌కు మళ్లింది… మంచి పాత్రలూ చేసింది, కొన్ని బోల్డ్ సినిమాలు కూడా…
వెబ్ సీరీస్, టీవీ షోలు, ప్రజెంటర్, హోస్ట్… వివాదాలు కూడా ఎక్కువే… భయపడదు, ఏదైనా ఇష్యూ వస్తే ముందుకొచ్చి నిలబడుతుంది… ఎవరికీ భయపడకుండా ఆమె పెట్టిన కేసులూ ఉన్నయ్, ఆమెపై పెట్టిన కేసులూ ఉన్నయ్…

అందుకే ఆ ఇండస్ట్రీలోని మగపెద్దలకు ఆమె అంటే మంట, కంటగింపు… సో, మోహన్‌లాల్ ఖాళీ చేసిన ఆ అమ్మ ప్రెసిడెంట్ కుర్చీలో ఆమె కూర్చోవడం తట్టుకోలేకపోయారు… ఆమె ఎన్నికైన దగ్గర్నుంచీ గొడవలు క్రియేట్ చేస్తూనే ఉన్నారు…
పాత కార్యవర్గం తప్పుల్నీ ఈ కార్యవర్గం మీదకు నెట్టేసి బదనాం చేయసాగారు… దీంతో ఆమె ప్లస్ మొత్తం కార్యవర్గం నిన్న రాజీనామాలు చేసి, మీ చావు మీరు చావండర్రా, ఈ సంఘాన్ని ఎవడూ చక్కదిద్దలేరు అని తేల్చేసింది… ఆమె ఎన్నికై ఏడాది కూడా కాలేదు, తనంటతానే దిగిపోవాల్సిన స్థితి క్రియేట్ చేశాయి మగ పెత్తనాలు… పెద్ద కుర్చీల్లో మహిళలను ఆమోదించే లిబరల్ కల్చర్ ఇప్పట్లో రాదు, రాదు..!!
Share this Article