.
ముందుగా ఓ వార్త చదవండి… నటుడు రామ్ చరణ్ (Ram Charan) మణికట్టు ఆపరేషన్ కోసం కోయంబత్తూరు బయల్దేరాడు… పెద్ది సినిమా షూటింగులో తన మణికట్టుకు గాయం తగిలింది… సినిమా అలాగే నొప్పి భరిస్తూ కంప్లీట్ చేశాడు, ప్రమోషన్లలో పాల్గొన్నాడు… రిలీజైంది, అయిపోయింది… ఇక తదుపరి సినిమాకు ఇది అడ్డుగా ఉండకుండా, మణికట్టు సర్జరీ కోసం హాస్పిటల్‌కు వెళ్లాడు… సర్జరీ పూర్తయ్యేవరకు తన కుటుంబం తనతోపాటు అక్కడే గడపనుంది…
తనతోపాటు తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన తదితరులు కూడా బయల్దేరారు… కోయంబత్తూరులో అత్యంత ప్రసిద్ధి చెందిన గంగా ఆసుపత్రిలో తనకు ఈ ఆపరేషన్ జరగనుంది. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలకు పేరుగాంచిన ఈ హాస్పిటల్‌లో ప్రముఖ డాక్టర్ ప్రవీణ్, సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నిపుణులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించనుంది… గుడ్, త్వరగా కోలుకుని, మళ్లీ బిజీ అయిపోవయ్యా చరణ్, విష్ యు స్పీడీ రికవరీ !
Ads

పెద్ది సినిమా తరువాత రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు… ఇప్పటికే స్క్రిప్ట్ పనులతో ఆయన బిజీగా ఉన్నాడు… ఈ సర్జరీ కోసమే సుక్కు సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. సర్జరీ తరువాత చరణ్ కొన్నిరోజులు రెస్ట్ ఎలాగూ తప్పదు… ఆ తరువాతే ఆ సినిమా పట్టాలెక్కనుంది…
……. ఇదీ వార్త… అయితే వచ్చిన డౌటనుమానం ఏమిటంటే..? అత్తగారి అపోలో అక్కరకు రాలేదా..? కోయంబత్తూరు దాకా ఎందుకు..? సహజంగానే ఈ డౌట్లు వస్తాయి… అపోలో ప్రతాప్ రెడ్డి మనమరాలు ఉపాసన రాంచరణ్ భార్య… ప్రఖ్యాతి చెందిన అపోలో గ్రూపు హాస్పిటల్స్‌కు ఆమె ప్రమోటర్, వాటాదారు, వారసురాలు, అంతేకాదు, ఆ గ్రూపు సీఎస్ఆర్ వ్యవహారాలు ఆమే చూస్తుంది, ‘ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ TPA’ (FHPL) సంస్థలో ప్రధాన బాధ్యతలు…

మరో ప్రముఖ హాస్పిటల్స్ కామినేని కూడా వీళ్లదే… వైద్యంలో అన్నిరకాల నైపుణ్యాలు కలిగిన బోలెడు విభాగాలు, డాక్టర్లు ఉన్నారు… అప్‌డేటెడ్ పద్ధతులన్నీ అడాప్ట్ చేసుకుంటారు… హైదరాబాదులో మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాల్లోనూ ఫేమస్ హాస్పిటల్ గ్రూప్స్ అవి… మరి చిన్న మణికట్టు సర్జరీకి కోయంబత్తూరు వెళ్లడం ఏమిటి..?
ఎస్, గంగా హాస్పిటల్ ఫేమసే… అందులో సందేహం లేదు… కానీ ఆ గ్రూపుల ‘అల్లుడు’ ఆ హాస్పిటల్స్ వదిలేసి, ఎక్కడో ఉన్న కోయంబత్తూరు హాస్పిటల్‌కు వెళ్లడం వల్ల స్వయంగా అపోలో, కామినేని హాస్పిటల్స్ కీర్తిప్రతిష్టల్ని పలుచన చేయడం కాదా..?! ఒకరకంగా ఆ హాస్పిటల్స్ మీద నమ్మకం లేనట్టుగా సమాజంలోకి వాటిపై రాంగ్ సిగ్నల్స్ వెళ్లవా..? ఏమో ఈ పెద్దవాళ్ల వ్యవహారాలు అస్సలు అర్థం కావు సుమా !!
Share this Article