.
డబ్బు, కీర్తి వ్యవహారాలు సరే… కానీ సెలబ్రిటీలకు కాస్తయినా నైతికత అవసరం… అలాగే రూల్స్ గురించి పట్టింపు ఉండాలి… దురదృష్టవశాత్తూ అదే కనిపించడం లేదు…
జీతెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి అని ఓ కొత్త చాట్ షో స్టార్టయింది… జగపతిబాబు హోస్ట్… నాగార్జున ఫస్ట్ గెస్ట్… సరే, చాలా చాట్ షోలు వస్తుంటాయి టీవీల్లో, తరువాత మాట్లాడదాం దీని గురించి… కానీ ఒక్కటి మాత్రం నచ్చలేదు…
Ads
ఎనిమిది మంది దాకా స్పాన్సర్లు ఉన్నా సరే, దీని ప్రధాన స్పాన్సర్ ఒక్‌స్మిత్… టైటిల్ పైనే అది కనిపిస్తూ ఉంటుంది… డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ అని చూపిస్తుంటారు… కానీ అది పక్కా సరోగేట్ రూట్… అది మద్యం కంపెనీ… అంటే ఆ మద్యం బ్రాండ్ ప్రమోషన్ వాటర్ బాటిళ్ల పేరుతో, పరోక్షంగా, అంటే… దొంగమార్గంలో..!
ఇలాంటివి చాలా కనిపిస్తుంటాయి… చివరకు గుట్కా బ్రాండ్ ప్రమోషన్లు కూడా పాన్ మసాలా, ఇలాచీ పేర్లతో సాగిస్తుంటారు… సరోగేట్ యాడ్స్ కరెక్టు కాదు… చాలామంది నటులు ఈ గుట్కా సరోగేట్ యాడ్స్ మీద తప్పు తెలుసుకుని, వెనక్కి తగ్గారు, మన మహేష్ బాబు మాత్రం కంటిన్యూ చేస్తాడు…
చాలా వివాదాలున్న కంట్రీ డిలైట్‌కు చిరంజీవి బ్రాండ్ ప్రమోటర్… అన్నట్టు ఈ జయమ్ము నిశ్చయమ్మురా చాట్ షో స్పాన్సర్లలో ఈ కంట్రీ డిలైట్ కూడా ఉంది… నాగార్జున, జగపతిబాబు నడుమ టీపాయ్ మీద ఈ ఒక్‌స్మిత్ వాటర్ బాటిళ్లను కొన్ని పెట్టారు… బ్రాండ్ ప్రమోషన్… అదీ వెంకటేశ్వరస్వామి ప్రతిమ పక్కనే… ఇంతగా సరోగేట్ యాడ్స్ (మద్యం యాడ్స్ నిషిద్ధం కాబట్టి ఇలా చేయడం) అవసరమా..?
షో మధ్యలో కూడా ఆ యాడ్స్ ఎక్కువ కనిపించాయి… రీసెంట్ కౌన్ బనేగా కరోడ్‌పతి కొత్త సీజన్ చూస్తుంటే డైరెక్టర్ విస్కీ సరోగేట్ యాడ్స్ కనిపించాయి… దాని ప్రధాన స్పానర్స్ అదేనేమో… నవ్వొచ్చింది ఏమిటంటే..? ఇదే హోస్ట్ అమితాబ్ తను ఏదో గుట్కా సరోగేట్ యాడ్ చేయబోయి, తప్పు తెలుసుకుని, ఆ డబ్బు కూడా వాపస్ ఇచ్చాడు… తనిప్పుడు మద్యం కంపెనీ స్పాన్సర్ చేసే షోకు హోస్ట్… పారడాక్స్..!
మనవాళ్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదాలు, కేసులు, విచారణల కథ తెలిసిందే… డబ్బు కోసం ఏమైనా..!! సరే, ఇక జయమ్ము నిశ్చయమ్మురా గురించి చెప్పాలంటే… జగపతిబాబు ఇలాంటి షోలకు కొత్త… కనిపిస్తూనే ఉంది కొత్తకొత్తగా, అంత ఈజ్ లేదు… కానీ నాగార్జున ఉల్టా తనే హోస్ట్ అన్నట్టుగా… సరదాగా షో రక్తికట్టించాడు…
పెద్దగా హిపోక్రసీ జోలికి పోలేదు… ఫన్, ఎమోషన్… చిన్నప్పటి జ్ఞాపకాలు, ఫోటోలు… రాంగోపాలవర్మ, రాఘవేంద్రరావుల వ్యాఖ్యలు తీసుకొచ్చారు… వెంకట్, సుశీలలు వచ్చారు… గీతాంజలి హీరోయిన్ గిరిజను కూడా చూపించారు… ఆనాటి ఆ గిరిజేనా అనిపించింది… నాగార్జునేమో అప్పుడూ ఇప్పుడూ సేమ్ లుక్… స్లిమ్… ఫిట్…
టాబూ, రమ్యకృష్ణల్లో ఎవరు బెటర్ కోయాక్టర్ అనడిగాడు జగపతిబాబు (63 ఏళ్లు)… అందులో ఓ గూఢార్థం… వాళ్లకు నాగార్జున బాగా దగ్గర అని వార్తలు వినిపించేవి కదా… ఉల్టా నాగార్జున (66 ఏళ్లు) అడిగాడు… రమ్యకృష్ణ, సౌందర్యల్లో నీకెవరు ఇష్టం అని..! అర్థమైంది కదా… ఒకరివి ఒకరు…!! అఫ్‌కోర్స్, ఇద్దరూ ఆ ప్రశ్నల్ని స్కిప్ చేశారు..!!
స్థూలంగా షో బాగానే నడిచింది… కానీ నాగార్జున ఫ్యామిలీతో జగపతిబాబుకు ఏళ్లుగా మంచి సంబంధాలు కాబట్టి, చాలా అంశాలు ముచ్చటించుకున్నారు… పాత జ్ఞాపకాలు కూడా పంచుకున్నారు… కానీ రాబోయే అందరి గెస్టులతోనూ ఇది కంటిన్యూ అవుతుందా..? తనకు బాగా తెలిసిన వాళ్లనే తీసుకొస్తాడా..? చూడాలి..!!
Share this Article