Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పనికిమాలిన అఖండ భారత్ క్యాం‘పెయిన్’..! అసలు ఫాయిదా ఏమిటి..?!

August 26, 2021 by M S R

Subramanyam Dogiparthi…… పోస్టు ఇది… ఓసారి చదవండి… ‘‘సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న మరో ఫొటో ఇది . ఎవరు స్పాన్సర్ చేసారో తెలియదు . ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఉంటున్నాయి . ఈ ఫొటోలో స్పాన్సర్ పేరు లేదు . అదో అంశం . నేను ప్రస్తావించదలచుకున్న అంశం మరొకటి . అది : అఖండ భారతం నినాదం బాగా ఉంది . అందరికీ ఇష్టమే . అయితే :: విడిపోయిన / వెళ్ళిపోయిన దేశాలు అఖండ భారతంలో విలీనమయ్యేందుకు సిధ్ధంగా ఉండాలి కదా ! లేదా మనం దాడులు చేసి కలుపుకోవాలి . ఇది సాధ్యమేనా ?! ఏమో ! ఈ ఫొటో స్పాన్సర్స్ మనసులో ఏముందో ! ఈ రెండింటినీ మించి మరో సున్నితమైన అంశం ఉంది . ఇప్పటికే హిందువుల జనాభా తగ్గిపోతుంది ; ఇతర మతస్తుల జనాభా పెరిగిపోతుందని చాలా హిందూ సంస్థలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నాయి . ఈ దేశాలలో ఉన్న జనాభాలో ఎక్కువ భాగం ముస్లింలు కదా ! మరి ముస్లిం జనాభా , హిందూయేతర జనాభా పెరిగితే , ఆమోదించేందుకు హిందూ సంస్థలు సిధ్ధంగా ఉన్నాయా !! నేను ఎందుకు ఈ పోస్ట్ పెట్టానంటే : కొందరు తమ ఐడెంటిటీలను బహిరంగపరచకుండా ఇలా పోస్టులు పెట్టడం వలన దేశంలో గందరగోళం సృష్టించటమవుతుందని చెప్పటానికి . అసాధ్యమైన నినాదాలనిచ్చి ప్రజలను తప్పుదారి పట్టించటానికే . సమాజానికి , దేశానికి మంచిది కాదు …’’

akhanda

బీజేపీయే కాదు, హిందుత్వ క్యాంపుకి చెందిన ముఖ్య నాయకులు కూడా అఖండ భారత్ అనే భావనను పదే పదే ప్రచారంలోకి తీసుకొస్తుంటారు… నిజానికి దానివల్ల సాధించదలిచేది ఏమిటో అర్థం కాదు… నిజాల్ని కూడా దాచేసి, ప్రజలను మభ్యపెట్టడం… ఎస్, ఒకప్పుడు దక్షిణ పాలకులు అనేక సుదూర సముద్ర దేశాలకు వెళ్లి మరీ రాజ్యాలు స్థాపించారు… తమ సంస్కృతిని వ్యాప్తి చేశారు… కానీ కాలం ఎప్పుడూ ఒకేరీతిగా ఉండదు కదా… అసలు ఆర్యావర్తంగా పిలిచే ఉత్తరభారతం ఎవరి హయాంలోనైనా దక్షిణాదిని హస్తగతం చేసుకోగలిగిందా..? దండకారణ్యాలు దాటి రాగలిగాయా..? రాముడి కాలం నుంచీ అంతే… ఎప్పుడైనా మన భారతం ‘‘అఖండ భారతంగా’’ ఉందా..? అంతెందుకు..? అంతటి నొటోరియస్ బ్రిటిష్ రూలర్స్ కూడా అనేక సంస్థానాలను వాటి పాలనకు వదిలేశారు… మన హైదరాబాద్ ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేదు… ఇదే కాదు…

Ads

దేశంలో వందల చిన్న చిన్న సంస్థానాలు దేనికవే పాలించుకునేవి తప్ప… ఇప్పుడున్న భారతదేశ రూపమే అప్పుడు లేదు కదా… స్వరాజ్యం వచ్చాక సర్దార్ పటేల్ నయానో భయానో అందరినీ యూనియన్‌లో విలీనం చేశాక భారత దేశానికి ఓరూపం వచ్చింది… స్వరాజ్యం వచ్చాక చాన్నాళ్లకు ఈశాన్య రాష్ట్రాల్ని కలుపుకోగలిగాం… అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి పలు చిన్న ప్రాంతాలే కాదు.. గోవా, పాండిచ్చేరి వంటి మరీ చిన్న ప్రాంతాలను కలుపుకోవడానికి కూడా చాన్నాళ్లు పట్టింది… మనకు ఎన్ని పెత్తనాలు చేసినా సీషెల్స్, మాల్దీవులే స్వాధీనం కాలేదు… ఇక శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి సర్వసత్తాక దేశాలు దాసోహం అంటాయా..? బర్మా వంటి దేశం తన సొంత ప్రజలనే ఊళ్లకూళ్లు కాల్చేసి మరీ తరిమేసింది… అంత నొటోరియస్ దేశం ఇండియా ఎదుట సాగిలపడుతుందా..? అసలు పాకిస్థాన్, అప్ఘనిస్థాన్ స్వాధీనం అనేది సాధ్యమేనా..? ఆ దిశగా ఇండియా ప్రయత్నిస్తే అంతర్జాతీయ సమాజం ఊరుకుంటుందా..? ఇన్ని ప్రశ్నల నడుమ మళ్లీ అఖండ భారతాన్ని ప్రచారంలోకి తీసుకురావడం దేనికి..? ఒకవేళ ఆ ప్రాంతాలు మనతో కలిసిపోయినా మనకొచ్చే ఫాయిదా ఏమిటి..? మరికొన్ని కాశ్మీరాలను తయారు చేసుకోవడానికా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions